అవతార్ మీద ఎన్ని నెగెటివ్ విమర్శలు వచ్చినా, సమీక్షలు వచ్చినా… ఎవడెన్ని సెటైర్లు వేసినా… జేమ్స్ అంటే జేమ్స్ అంతే… తిరుగులేని దర్శకుడు… తనలా గ్రాఫిక్స్ వాడుకుని సినిమాలు తీసిన దర్శకులు బోలెడు మంది… కానీ ఒక టైటానిక్, ఒక అవతార్, ఇప్పుడు అవతార్ సీక్వెల్… జేమ్స్ కామెరూన్ ఏం మాయ చేస్తాడో గానీ టచ్ చేస్తాయి… ఈ విమర్శకులెప్పుడూ ఉంటారు, అవతార్ ఫస్ట్ పార్ట్ గురించి ఇంతకన్నా ఘోరంగా ఖండఖండాలుగా నరుకుతూ సమీక్షలు కూడా చేశారు… సో, వాటిని పక్కన పెడితే…
తెలుగు అనువాదం కోసం డైలాగుల్ని తెలుగీకరించే పని దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌కు అప్పగించారు… ఫేస్‌బుక్‌లో ఓ మిత్రుడి పోస్టు చూశాను… అవసరాల సరళానువదానికి కొన్ని ఉదాహరణల్ని పేర్కొన్నాడు… బాగుంది పోస్టు… అయితే ఇదే పోస్టును వేరే ఓ మిత్రుడికి ఇచ్చాను… ఇంకా సరళీకరించగలవా అని… ఎందుకంటే..? ఇంగ్లిష్ డైలాగులకు పెదాల కదలిక పెద్దగా అవసరం లేదు… తెలుగులో ఎంత సంక్షిప్తంగా, సరళంగా ఉంటే అంత బెటర్…
ఆ మిత్రుడు కూడా చిన్నా చితకా సవరణలు చెప్పగలిగాడు తప్ప… అవసరాల బాగా రాశాడబ్బా అన్నాడు… కొందరు డైలాగ్ రచయితలు తమ పొంత పైత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు… కానీ అవసరాల ఇంగ్లిషు డైలాగుల అసలు సారాన్ని మాత్రమే అనువదించాడు… అనవసరంగా ఒక్క పదం కూడా వాడలేదు… తక్కువ వాడలేదు అన్నాడు ఆ మిత్రుడు… అవసరాలకు అభినందనలు…
Ads
ఈ చిత్రంలో కొన్ని డైలాగులు….
*”Wherever we go,
this family is our fortress.”
*మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చుగాక,కుటుంబమే మన దుర్భేద్య దుర్గం.
**”A father protects.It’s what gives him meaning.”
**కాపు కాయడమే తండ్రి విధిఅతని పాత్రకదే పరమావధి.
*** “When life ends,another begins. “
*** ఓ బ్రతుకు ముగుస్తుంది,మరొకటి మొదలవుతుంది.
**** “Teach them our waysso they do not sufferthe shame of being useless.”
****వాళ్లకు మన జీవన విధానాలు నేర్పాలి. లేకుంటే పనికిమాలినవాళ్ళనే ముద్రతో ఇబ్బందిపడతారు.
***** “Our hearts beat inthe womb of the world.”
*****ఈలోకం గర్భకోశంలోపలమన గుండె చప్పుళ్ళు వినిపిస్తాయి.
****** “Water connects all things,life to death, darkness to light.”
******
బ్రతుకు నుంచి చావు దాకా,
చీకటి నుంచి వెలుగు దాకా
ప్రతిదాన్ని లంకె పెట్టి ఉంచేది నీరే.
మిత్రుడు మొహమాటానికి స్వల్ప సవరణలు సూచించాడే తప్ప తనేమీ అదనంగా గొప్పతనాన్నిఅద్దలేదు… మనం ఎక్కడికెళ్లినా సరే, మన కుటుంబమే బలమైన కోట… తండ్రి రక్షించాలి, తన పాత్రకు అదే సార్థకత… ఓ బతుకు ముగిసేచోట మరో బతుక్కి ఆరంభం… మన వెళ్లే బాటలేవో వాళ్లకూ నేర్పిద్దాం, లేకపోతే అసమర్థులవుతారు… ఈలోకపు గర్భంలో మన గుండెలు కొట్టుకుంటున్నయ్… బతుకు నుంచి చావు దాకా, చీకటి నుంచి వెలుగు దాకా… అన్నీ అనుసంధానించేది నీరే…
Share this Article