అయ్యప్ప దీక్షలో ఉంటే దేన్నయినా తప్పించుకోవచ్చు అనేది ఓ భ్రమ… ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో కీలక వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తనపై ఈడీ పంజా విసిరింది… కేసీయార్‌కు సిట్ ఉంటే, బీజీపీకి ఈడీ ఉంటుంది కదా… నేను విచారణకు రాను, నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, కొన్నాళ్లయ్యాక వస్తాను వీలైతే అని ఈడీ టీంకు సమాచారం పంపించాడు… నవ్వుకున్న ఆ టీం తప్పనిసరిగా రావల్సిందే అని చెప్పింది… ఏం చేయగలదు ఈడీ టీం అనుకున్నాడేమో రోహిత్… అరెస్టు చేసి, కోర్టులో చూపించి, తిరిగి తమ కస్టడీకి అడిగే అధికారం ఈడీకి ఉంది… ఇంకాస్త గట్టిగా ఫిక్స్ చేస్తారు…
ఇదంతా ఒక వార్త… కేసీయార్ కూతురే మొదట్లో విచారణకు రెడీ అని చెప్పి, తరువాత ఇప్పుడు వీలు కాదు అని చెప్పి, విధిలేక ఓసారి విచారణకు హాజరైన తీరును రోహిత్ రెడ్డి విస్మరించినట్టున్నాడు… సరే, తను భాగ్యలక్ష్మి గుడికి వెళ్లాడు… నాకు ఏ దోషం అంటలేదు, నేనే పాపమూ ఎరుగను అని ప్రమాణం చేశాడు… గుడ్… కానీ దాన్ని ఈడీ పరిగణనలోకి తీసుకోదు నాయకా..? సాక్షాత్తూ వాళ్లనే గుడి దగ్గరకు రమ్మని ఆహ్వానించి, వాళ్ల ముందు ప్రమాణం చేసినా సరే… వాళ్లు అస్సలు పట్టించుకోరు…
బండి సంజయ్ రాలేదేం..? రఘునందన్ రాలేదేం..? సవాల్‌కు ముఖం చాటేసిన బండి, పలాయనం చిత్తగించాడు అంటూ ఏవేవో రాసి, ఫస్ట్ పేజీలో పెట్టి మురిసిపోయింది నమస్తే తెలంగాణ అనబడే కేసీయార్ వాయిస్… నువ్వు భాగ్యలక్ష్మి గుడికి రా, నేనూ అక్కడివే వస్తా, ప్రమాణాలు చేద్దాం అని బండి సంజయ్ ఏమైనా అన్నాడా..? రోహిత్ ఏకపక్షంగా తనంతట తనే సవాల్ విసిరి, బండి రాలేదు కాబట్టి పారిపోయాడు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తే ఎలా..?
Ads
నీ సవాల్‌ను అసలు బండి సంజయ్ గుర్తిస్తే కదా, అంగీకరిస్తే కదా, అది సవాల్… వెళ్లి కాణిపాకం గుళ్లో కూడా ప్రమాణం చేయి, నీ ఇష్టం, ఈడీ వాళ్ల ఇష్టం… అందరినీ ఎందుకు లాగడం..? కాంగ్రెస్ జెడ్పీటీసీ లేదా ఎమ్మెల్యే ఎవరైనా ఏదైనా ఆరోపణ చేసి, యాదాాద్రి దగ్గర ప్రమాణం చేద్దాంరా అని కేటీయార్‌కు సవాల్ విసిరితే వస్తాడా..? ఎహెపోరా అని కొట్టేస్తాడు… అంటే స్థాయీభేదం… అది కరెక్టు కూడా..! మరి రోహిత్‌రెడ్డి కమాన్ బండీ, వచ్చెయ్, నేను ఫలానా టైమ్‌కు రెడీ, ప్రమాణాలు చేద్దాం అనగానే బండి సంజయ్ రావాలా..?
ప్రధాన పత్రికల్లో రిపోర్టర్లకు, సబ్‌ఎడిటర్లకు ఓ విషయాన్ని పదే పదే చెబుతుంటారు… (టీవీలకు ఇలాంటి నియమాలు, నీతులు వర్తించవులెండి… అది అరాచక పాత్రికేయం…) ఎవరిపైనైనా విమర్శ, ఆరోపణ చేస్తే, సదరు వ్యక్తి స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని..! అంటే ఓ మండల స్థాయి లేదా జిల్లా స్థాయి లీడర్ ఎవరైనా ముఖ్యమంత్రి మీద ఏదో జనరల్ ఆరోపణలు, విమర్శలు చేస్తే వాటిని పబ్లిష్ చేయకూడదు అని… అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి లీడర్లు ప్రధానిని, రాష్ట్రపతిని తిట్టిపోసినా పత్రికలు పట్టించుకోవద్దు…
ఐనా ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పత్రికలు ఎక్కడున్నాయి..? ఏయ్ బండీ, ఏమైంది..? రాలేదు, భయపడ్డావా..? మా రోహిత్ సవాల్‌కు తోకముడిచావా..? అని పత్రికే రాసేస్తోంది… సార్, ఈడీ గారూ… పోనీ, మా రోహిత్ సార్‌కు మడితో వండిన భోజనం, నిష్టగా పూజ చేసుకోవాలని ఏర్పాట్లు చేస్తారా..? అలా హామీ ఇస్తే, రాసిస్తే, ఏదో పోనీలే, పదే పదే అడుగుతున్నారు కదా, వెళ్లొద్దాం అని విచారణకు వస్తాడేమో…!!
Share this Article