ఆర్ఆర్ఆర్ జపాన్ భాషలోకి అనువదింపబడుతుంది… మస్తు హిట్ అవుతుందని ఏదో లెక్క చెబుతారు… పలు ఇండియన్ సినిమాలు చైనా భాష (మాండరిన్)లోకి అనువదింపబడతాయి… వేల కోట్లు వసూలు చేసినట్టు లెక్కలు చెబుతారు… పాన్ వరల్డ్ సినిమాల్లాగా ప్రచారం జరుగుతుంది… నిజంగా ఇండియన్ సినిమాను దేశదేశాల ప్రజలు అంత ఇష్టపడుతున్నారా..?
ఈ పిచ్చి ఫైట్లు, ఈ తిక్క పాటల్ని నెత్తిన పెట్టుకుంటున్నారా..? లేక ఈ డబ్బింగుల పేరిట హవాలా, మనీలాండరింగు ఏమైనా జరుగుతోందా..? ఈడీకి ఇవెందుకు పట్టవు..? ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్థులేనా..? మన సినిమాల్ని ఎవడూ పట్టించుకోడు అని చెప్పడానికి ఓ ఉదాహరణ… మెట్రోసాగా సైటు రాసుకొచ్చింది ఓ కథనం…
ఆమధ్య పుష్ప సినిమాను రష్యన్ భాషలోకి తర్జుమా చేసి రిలీజ్ చేశారు కదా… డబ్బింగుకు ప్లస్ ప్రమోషన్‌కు దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టారట… అల్లు అర్జున్, రష్మీక మంథాన, సుకుమార్ ఎట్సెట్రా తరలిపోయారు… పిక్నిక్ కమ్ ప్రమోషన్ నడిచింది జోరుగా… తీరా చూస్తే వసూళ్లు పల్లీబఠానీతో సమానమట… పెట్టిన పెట్టుబడి మొత్తం మటాషేనట…
Ads
ఇదేమైనా రాజ్‌కపూర్ కాలమా..? ఊ అంటావా..? ఊఊ అంటావా అంటూ… రామయ్యా వస్తావయ్యా తరహాలో రష్యా మొత్తం పాడుకోవడానికి నాటి పాతకాలమా..? ఈ సినిమా చూడగనే రష్యన్లు అందరూ తగ్గేదేలే అంటూ ఓ చిత్రమైన బాడీ లాంగ్వేజీ ప్రదర్శిస్తారని సినిమా టీం కలలు కన్నదా..? ఏయ్ బిడ్డా, ఇది నా అడ్డా అనగానే పుతిన్ కూడా ఆనందంతో ఊగిపోతాడా..?
డిసెంబరు 8న రిలీజ్ చేశారు… ఈరోజుకూ ఇక దాని వివరాలు బయటపెట్టే స్థితిలో లేదు సినిమా టీం… ప్రమోషన్ వర్క్ మాత్రం భారీగానే చేశారు పాపం… రేడియో ఇంటర్వ్యూలు, టీవీ ఇంటర్వ్యూలు బాగానే ఆర్గనైజ్ చేశారు… ప్చ్, ఫాఫం… సినిమా ఫ్లాప్… అసలు పెట్టిన పెట్టుబడి పెట్టిన మొత్తం కోల్పోయినట్టేనని Tracktollywood.com అంటోంది… అనేకచోట్ల థియేటర్ల నుంచి మూడే రోజుల్లో తీసేశారట… పాన్ ఇండియా రేంజే కష్టం… ఇక పాన్ వరల్డ్ రేంజుకు ఎదిగి, హాలీవుడ్‌కు పోటీ అవ్వాలనే ఆశను అత్యాశ, దురాశ, పేరాశ వంటి పదాలతో ప్రస్తావిస్తారు… చివరకు నిరాశ…!!
పుష్ప- 2 నుంచి రష్మీకను తీసేశారని ఒక టాక్… ఆమెను తీసుకుంటే కన్నడ ఎగ్జిబిటర్స్ నుంచి సమస్యలు వస్తాయని భయపడుతున్నారట… ఆమె ప్లేసులో సాయి పల్లవి వస్తోందని ప్రచారం… రెండూ కరెక్ట్ కాదు… రష్మీక మీద బ్యాన్ పెట్టేంత తీవ్ర కోపం ఆమెపై కన్నడ ఎగ్జిబిటర్స్ కు లేదు… పైగా సాయిపల్లవి రష్మిక రేంజ్‌లో ఎక్స్పోజింగ్ చేయదు… పుష్పలో కొన్ని సీన్లు కూడా వెగటు… సో, సాయిపల్లవి పుష్ప సీక్వెల్ ఒప్పుకోదు… ఏవో అలా ప్రచారాలు వస్తుంటాయి…
Share this Article