చిన్న వార్తే… కానీ కేరళ సీపీఎం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన వార్త… స్టోరీ ఏమిటంటే..? కొందరు మహిళా విద్యార్థినులు కోర్టుకెక్కారు… ‘‘కొజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంక్షలు పెడుతోంది… ఓ నోటీఫికేషన్ జారీ చేసింది… ఫిమేల్ స్టూడెంట్లు ఎవరూ తమ హాస్టళ్ల నుంచి రాత్రి 9.30 తరువాత బయట ఉండానికి వీల్లేదు అని… అవసరముంటే స్టడీ హాల్స్ వాడుకొండి, చదువుకొండి అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు అని… ఇది అన్యాయం’’ అనేది వాళ్ల పిటిషన్…
Kerala University for Health Sciences దీని మీద హైకోర్టుకు ఓ అఫిడవిట్ సబ్మిట్ చేసింది… ‘‘హాస్టళ్లు టూరిస్ట్ హోమ్స్ కాదు.,. ఇష్టమొచ్చినట్టు రావడానికి, వెళ్లడానికి… వాళ్ల నైట్ లైఫ్‌కు ఇవేం అడ్డాలు కావు… వాళ్లు రాత్రిళ్లు బయటికి వెళ్లడానికి వీల్లేదు…’’ అని దాని సారాంశం…
‘‘పాతికేళ్లకు ఏ మనిషికైనా మెచ్యూరిటీ వస్తుంది… అంతర్జాతీయ అధ్యయనాలు కూడా అదే చెబుతున్నాయి… ఆ వయస్సులోపు ఇష్టారాజ్యంగా తిరుగుతాం, నైట్ లైఫ్ గడుపుతాం అంటే కుదరదు… కాలేజీ లైబ్రరీలు కూడా రాత్రి 9 గంటలకల్లా క్లోజ్ చేస్తాం… సో, 9.30 లోపు వాళ్లు హాస్టల్‌కు వచ్చేయాలి… నిద్ర వస్తే పడుకోవాలి… అంతే…’’ అని ఆ అఫిడవిట్ చెబుతోంది…
Ads
ఈ వాదనలు విన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది… ‘‘ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కఠినంగా అమలు చేయండి… బాలికలకే కాదు, బాలురకు కూడా… ఒకవేళ ఎప్పుడైనా 9.30 దాటాక వస్తే మూమెంట్ రిజిష్టర్‌లో తగిన కారణం పేర్కొనాలి… సెకండియర్ తరువాత విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది’’ అని ఆదేశించింది…
జస్టిస్ దేవన్ రామచంద్రన్ ప్రభుత్వాన్ని అడిగాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని… ‘‘రాత్రిళ్లు చదువుకోవడానికి క్యాంపసుల్లో సరిపడా రీడింగ్ రూమ్స్ ఉన్నాయా..? ఒకవేళ అంటే ఈ టైమింగ్స్‌కు సడలింపు ఇవ్వొచ్చు…’’ అసలు ప్రతి యూనివర్శిటీలో ఈ రూల్ స్ట్రిక్టుగా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుండు..? హాస్టళ్లలో ఉంటే ఉండు, లేకపోతే వెళ్లిపో… ఇదే సూత్రం,.. ప్రత్యేకించి తమ బిజినెస్, పొలిటికల్ యాక్టివిటీస్‌కు అడ్డాగా హాస్టళ్లను మార్చుకున్న ప్రతి యూనివర్శిటీలో ఈ రూల్ అమలయ్యేలా సుప్రీంకోర్టు ఓ డైరెక్షన్ ఇస్తే ఎంత బాగుండు..?!
Share this Article