కొందరు హీరోలు…., కాదులెండి… నటులు… అస్సలు మారరు… మారడానికి ప్రయత్నించరు… కాలం ఎంత మారినా వాళ్లు మారాలనే తపన ప్రదర్శించరు… అదే రొటీన్, రొడ్డుకొట్టుడు, ఫార్ములా, ఇమేజ్, చెత్తా కథలతో ప్రేక్షకులతో దాడి చేస్తూనే ఉంటారు… ఒరే నాన్నా… లోకం చాలా మారిందిరా, కాస్త నువ్వూ మారొచ్చు కదా అంటే వినరు… మరింత ఇరగబాదుతారు… లాఠీ సినిమా కూడా అదే…
నిజానికి లాఠీ సినిమా ట్రెయిలర్ చూసినప్పుడే ఆ సినిమా మీద ఓ అభిప్రాయం ఏర్పడింది… కాపురం చేసే కళ కల్యాణంలో కాళ్లు తొక్కినప్పుడు… సినిమా నడిచే తీరు ట్రెయిలర్లోనూ కనిపిస్తుంది ఓ సినిమా సామెత… సినిమా అంతే కొట్టుడు, దంచుడు, బాదుడు… ఎవడు ఎందుకు కొడుతున్నాడో, ఎవడిని కొడుతున్నాడో కూడా సమజ్ కాదు కొన్నిసార్లు… ఫాఫం విశాల్…
ఒకవైపు తమిళ, మలయాళ సినిమాల్ని దేశమంతా మెచ్చుకుంటోంది… ప్రయోగాలకు, కొత్త కథలకు అడ్డాలు అని… ఆ ప్రశంసలకు దిష్టితీయడం కోసమా అన్నట్టు ఇలాంటి విశాల్‌లు రెడీగా ఉంటారు… లేకపోతే ఈ లాఠీ సినిమాలో ఏముంది..? యాక్షన్, యాక్షన్, యాక్షన్… యాక్షన్ అంటే తెలుసు కదా… బాగా యాక్ట్ చేయడం కాదు… దమ్మడ దమ్మడ దంచడం… అంతే…
Ads
ఆమె ఎవరో సునైనా అని హీరోయిన్… ఎందుకుందో ఆమెకే అర్థం కాదు… ఈ కథ ఏమిటో, నేను ఈ సినిమా ఎందుకు తీశానో అని దర్శకుడికీ అర్థం కాలేదు… ఫాఫం, చకచకా చుట్టి తమిళంలో రిలీజ్ చేసి… ఆనవాయితీ ప్రకారం తెలుగు ప్రేక్షకుల మీదకూ వదిలారు… పచ్చి అరవ వాసన… సంగీతం, పాటలు, ఎడిటింగ్ మన్నూమశానం మీద రివ్యూ అస్సలు వేస్ట్…
ఓ దిక్కుమాలిన కథ… తన కెరీర్ ఏమిటో తనకే అర్థం కాని ఓ హీరో… అంతే… చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం… వామ్మో వామ్మో, మరీ థియేటర్‌కు వచ్చినందుకు మరీ కక్షకట్టి ఇంతగా లాఠీతో బాదాలా..? విశాల్‌ను ఎప్పుడూ ఓ సెన్సిబుల్ హీరోగా చూడలేదు… అఫ్కోర్స్, తను వ్యక్తిగా మంచోడు… అంతే తప్ప సినిమా హీరోగా సోసో… ఒక్కటంటే ఒక్క సినిమాను ఇది నాది అని గర్వంగా చెప్పుకునే సీన్ లేదు ఇన్నేళ్లయినా… పైగా ఈమధ్య పలు సినిమాలు వరుసగా తన్నేశాయి… ఐనా మారడం లేదు ఈ మనిషి…
నాకు రాజకీయాల మీద ఇంట్రస్టు ఉంది… పవన్ కోసం ప్రాణమిస్తాను… జగన్‌కు వోటేస్తాను… అనే డబుల్ స్టాండర్డ్స్ డైలాగ్స్ అక్కర్లేదు… నిజానికి విశాల్ ఇప్పుడు చేయాల్సింది… నిజంగా ఇంట్రస్టు ఉంటే వెళ్లి కుప్పంలో వర్క్ చేసుకోవాలి… ఒకవేళ జగన్ వోకే అంటే… లేదంటే అన్నీ వదిలేసి, కాస్త సినిమా ప్రపంచం ఎలా మారిపోతుందో చుట్టూ చూసుకుని, వర్తమానంలోకి వచ్చిపడాలి… లేకపోతే ఎవడు థియేటర్‌కు రావాలన్నా లాఠీ దెబ్బలకు భయపడిపోతారు…!!
Share this Article