ఒక వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… అందరూ కాంతార సీక్వెల్ గురించి అడుగుతున్నారు, రాస్తున్నారు కదా… తనలో రకరకాల ఆలోచనలు ఉన్నాయని, అవి ఇంకా ఓ ఫైనల్ షేప్‌కు రాలేదని రిషబ్ శెట్టి చెప్పి తప్పించుకుంటున్నాడు… ఈమధ్య పీటీఐతో మాట్లాడుతూ కాంతార నిర్మాత విజయ్ కిరంగదూర్ ‘‘కాంతార -2 ఉంటుంది… ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను… అంతేకాదు, అది సీక్వెలా, ప్రీక్వెలా కూడా తేల్చుకోవాల్సి ఉంది…’’ అన్నాడు…
హఠాత్తుగా తన నోటి వెంట ప్రీక్వెల్ మాట వచ్చేసరికి… ఇక అందరి దృష్టీ కాంతార-2 కథపై పడింది… ఒకవేళ ప్రీక్వెల్ అయితే ఏమిటి కథ..? దీనికి ముందు ఓ విషయం చెప్పుకుందాం… ఇండియన్ సినిమాలో ప్రీక్వెల్స్ తక్కువ… ఏడాదిన్నర క్రితం వార్త చెప్పుకుందాం… అప్పటికి చైౌతూ, సమంత పెళ్లి పెటాకులు కాలేదు… ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్‌లో ఆడపులి రాజీ పాత్రలో అదరగొట్టేసింది… పాన్ ఇండియా స్టార్ అయిపోయింది…
Ads
అప్పట్లోనే ఆమెకు ఓ అవకాశం వచ్చింది… ఆ అవకాశం ఏమిటీ అంటే..? నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నిర్మించే బాహుబలి ప్రీక్వెల్… అంటే రాజమౌళి తీసిన బాహుబలి కథకు ముందస్తు కథ అన్నమాట… అంటే శివగామి, కట్టప్ప తదితరుల ఎర్లీ జీవితాలు, మాహిష్మతి సామ్రాజ్య పాలకులు, రాజకీయాలు గట్రా ఉండే కథ… బాహుబలి రెండు పార్టులు ఎంత హిట్టో తెలుసు కదా… అలాంటి కథనే ఆనంద్ నీలకంఠన్ రాశాడు…
అవును, విజయేంద్రప్రసాద్ కాదు… సహజంగానే ఆనంద్ మంచి ఫ్లో ఉన్న రైటర్… 2017లో విడుదలైన ఆ నవల బాగా హిట్టయింది కూడా… దాన్ని రెండు మూడు పార్టులుగా విభజించి, ‘‘బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్’’ అనే ఆ పేరుతోనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరీస్ స్టార్ట్ చేసింది… దేవ కట్టా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం… ముందుగా శివగామి పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు… తరువాత వామికా గబ్బి అన్నారు… ఒక పార్ట్ షూటింగ్ కూడా మృణాల్తో పూర్తిచేసినట్టు చెప్పారు…
ఏమైందో ఏమో గానీ… అది ఎంతకూ ముందుకు కదల్లేదు… నెట్‌ఫ్లిక్స్‌కు ఆ ఔట్పుట్ నచ్చలేదనీ, అందుకని ఆ ఫీడ్ అంతా కోల్డ్ స్టోరేజీలో వేసేశారనీ ప్రచారం జరిగింది… అకస్మాత్తుగా వచ్చిన వేరే వార్తలు ఏమిటంటే..? విశ్వేష్ కృష్ణమూర్తి (ఏఆర్రెహమాన్ 99 సాంగ్స్ తీశాడు) దర్శకత్వంలో కొత్త టీంతో ఈ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట… అర్క్ మీడియా, వన్ లైఫ్ స్టూడియో వాళ్లు నిర్మించాలి, నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయాలి… స్క్రిప్ట్ కూడా వేరేవాళ్లతో రాయించారుట… అందులో శివగామి పాత్రకు సమంతను అడిగారు, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామన్నారు…
కానీ ఎందుకో సమంత ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట… నిజానికి ఇది చాలెంజింగ్ పాత్రే… కానీ ప్రతి ఒక్కరూ బాహుబలిలో రమ్యకృష్ణ నటనతో పోల్చుతారనే భావనతో ఆమె వెనక్కి తగ్గినట్టుంది… ఏమో, ఆమెకన్నా మంచి పేరు వచ్చేదేమో… ఎందుకంటే బాహుబలిలో రమ్యకృష్ణది సీరియస్ రోల్… కానీ ఈ వెబ్ సీరీస్ కథలో పాత్ర చాలా డిఫరెంట్, యంగ్ వెర్షన్… బాహుబలిలో ప్రభాస్, రాణాలు హైలైట్ అయ్యారు… కానీ ఆనంద్ నీలకంఠన్ రాసిన కథలో హీరోయిజం లేదు… పైగా శివగామిది చాలా డైమెన్షన్స్ ఉన్న పాత్ర… సమంత అంగీకరించి ఉండాల్సింది…!!
అంటే ఇండియన్ ఇండస్ట్రీలో ప్రీక్వెల్ అంత వీజీ కాదు… ప్రీక్వెల్ కథ అంటే హీరో శివ పోరాటంకన్నా ముందు రోజులకు, తన చిన్నప్పటి రోజులకు కథను తీసుకెళ్లాలి… మీకు కథ గుర్తుంది కదా… శివ తండ్రి కూడా సొసైటీ కోసమే భూతకళ చేస్తూ, అడవుల్లోకి వెళ్లి మాయం అయిపోతాడు… తను ఏమయ్యాడు..? తనకు ఎదురైన సవాళ్లేమిటి..? ఇదే ప్రీక్వెల్ కథ… అది కూడా రిషబే పోషించాడు కాంతారలో… తను కూడా భూతకళ నర్తకుడు… కానీ అన్నీ కాంతార అంత హిట్టవుతాయా..? అదే మ్యాజిక్ రిపీటవుతుందా..? చూడాలి…!!
Share this Article