మీరు సున్నిత హృదయులా..? రాబోయే విపత్తులను తలుచుకుని బెంబేలెత్తిపోతుంటారా..? కొద్దిరోజులపాటు టీవీ9, ఏబీఎన్ వంటి పిచ్చి చానెళ్లను చూడటం మానేయండి… ఎంతసేపూ ఎంత మంది చస్తారు..? వేలా..? లక్షలా..? అదుగో ప్రళయం, ఇదుగో మహానాశనం వంటి మాటలే తప్ప పాజిటివ్ అనే పదమే తెలియని బుర్రలవి… చైనా పరిస్థితి ఇండియాలో తలెత్తితే ఎంతమందిని కరోనా కబళించవచ్చు అనే లెక్కలు, అంచనాల దాకా పోయాడు ఇండియాటుడే వాడు… సో, ఈ దిగువ వార్తను కాస్త జాగ్రత్తగా చదవండి…
చైనాలో కరోనా సిట్యుయేషన్ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో… ఎవడో ఓ లండన్ నిపుణుడు ఏదో కూస్తాడు… ఇంకేముంది, చైనా పని మటాష్… 60 శాతం మంది ఉంటారో పోతారో అన్నట్టుగా మూడు నెలల లెక్కలు మీడియా ఎదుట పరిచాడు… ఇంకేముంది..? WHO దాన్ని పట్టుకుని, మేం చైనాకు అన్నిరకాలుగా సాయం చేస్తామని ఓ పిచ్చి ప్రకటన జారీచేసింది… ఆ ఆర్గనైజేషన్ నడిచేదే చైనా కనుసన్నల్లో…! పలు దేశాలు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా అలర్ట్ నోటీసులు జారీచేస్తోంది… మన దేశం కూడా అంతే…
ఒకవేళ నిజంగానే సదరు వైరస్ వేరియంట్ గనుక విజృంభిస్తే… మనకున్న పడకలు, ఆక్సిజన్ ఏర్పాట్లు ఎట్సెట్రా ఓసారి సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి… ఎస్, బయటికి వెళ్తే మాస్క్ ఎప్పుడూ మంచిదే, వైరస్ నుంచే కాదు, డస్ట్, కాలుష్యం నుంచి కాస్త రక్షణ… వైరస్ నుంచీ రక్షణే… ఈ వైరస్ ఎయిర్‌బార్న్ అని తేలాక నిజానికి మొదట్లో మనం పాటించిన డోన్ట్ టచ్, ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్స్ క్లీనింగు గట్రా ఇప్పుడు అంత ముఖ్యంగా తోచడం లేదు…
Ads
ఎప్పుడైతే ఒమిక్రాన్ జలుబు స్థాయికన్నా దిగజారిపోయిందో… ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా మీద జనంలో భయం పోయింది… పైగా దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది… 95 శాతం వేక్సిన్లు పడ్డాయి… సో, చైనా కొత్త వేరియంట్ ఇండియాలో ప్రబలంగా వ్యాప్తి చెందుతుందనే తీవ్ర భయాందోళన అవసరం లేదు… టైమ్స్‌లో వచ్చిన ఓ వార్త బాగుంది…
ఇప్పుడు మనం చైనాకు చెందిన బీఎఫ్-7 వైరస్‌ను తలుచుకుని భయపడుతున్నాం కదా… ఆ వైరస్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి, అంటే రెండేళ్ల నుంచీ ప్రపంచంలోని 91 దేశాల్లో ఉందట… మన దేశంలో కూడా..! Scripps Research Institute విడుదల చేసిన డేటా ప్రకారం… ఈ వైరస్ ఉనికి, వ్యాప్తి 0.5 శాతం… 47,881 జీనోమ్ సీక్వెన్సింగ్ శాంపిళ్లలో ఈ బాపతు వైరస్ తేలింది కేవలం 0.5 శాతం…
మరెందుకు ఈ ప్యానిక్ వార్తలు అనే ప్రశ్నకు పలువురు వైరాలజిస్టులు బదులిస్తూ… ‘‘ఒకేసారి జీరో కోవిడ్ పాలసీని ఎత్తేయడం, అక్కడ వేక్సిన్ల వైఫల్యం వంటి చాలా కారణాలుంటాయి… అక్కడ వేక్సిన్లు వేయబడిన ప్రజల శాతం ఎంతో చూడాలి… కానీ మన దేశం వేరు… డబుల్ డోస్ మాత్రమే గాకుండా బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు కోట్ల మంది…’’ అంటున్నారు… మంచిదే, మనమెంత అప్రమత్తంగా ఉన్నామో చెక్ చేసుకోవడానికి, మన ప్రజారోగ్య వ్యవస్థ ఎంత సంసిద్ధంగా ఉందో చూసుకోవడానికి చైనా అనుభవాలు ఉపయోగపడతాయి అనేది వారి ముక్తాయింపు…!
Share this Article