పాలకుడికి జర్నలిస్టులు లేక, వాళ్లు రాసే వార్తలు లేక కెరీర్ లేదు… తెల్లారి లేస్తే జర్నలిస్టులు కావాలి… వాడుకోవాలి… వార్తలు రావాలి… ప్రచారం కావాలి… కానీ వాడికేదైనా కష్టం వస్తే మాత్రం వాళ్లను గాలికి వదిలేయాలి… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి పార్టీ నాయకుడూ అంతే… ప్రతి పాలకుడూ అంతే… మాటలకు మాత్రం జర్నలిస్టులకు మేం అది చేశాం, ఇది చేశాం అని డొల్ల మాటలు… పైగా నెగెటివ్ వార్తల పేరుతో అరెస్టులు, కేసులు, వేధింపులు, బెదిరింపులు…
దిగువన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఎగువన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దాస్ మాత్రం దీనికి మినహాయింపు… ఇద్దరూ వేర్వేరు ఎక్స్‌ట్రీమ్ భావజాలాలకు ప్రతినిధులు… కానీ జర్నలిస్టులకు చేయూతనివ్వడంలో మాత్రం సేమ్… తను అంతకుముందు ఇచ్చిన హామీ మేరకు స్టాలిన్ గత నవంబరులో రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు 10 వేల పెన్షన్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించాడు… 41 మంది జర్నలిస్టులకు ఈమేరకు పత్రాలు అందించడం ద్వారా పథకం ఆరంభమైంది…
Ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కుకుని మరణించిన 53 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఒక్కొక్క జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున.. మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అందించాడు… హామీ నిలబెట్టుకోవడం అంటే ఇదీ…
ఈ మొత్తాల్ని ఆయన లక్నోలోని కాళిదాస్ మార్గంలోని తన కార్యాలయంలో నిన్న (25-12-2-22)న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశాడు… నిజానికి ఈ మొత్తం ప్రభుత్వానికి పెద్ద భారం ఏమీ కాదు… కానీ ప్రాణాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయా జర్నలిస్టుల కుటుంబాలకు మాత్రం పెద్ద చేయూత… జర్నలిస్టులను ఆదుకునే విషయంలో మరి మిగతా నాయకులకు ఈ సిన్సియారిటీ ఎందుకు ఉండదు..?
Share this Article