హరి క్రిష్ణ ఎం. బి…… చైనాలో కరోనా.. ప్రపంచం అంతా herd immunity కోసం ప్రయత్నం చేసి ఫలితాలు సాధించింది. చైనా లాక్ డౌన్లతో సమస్య సాల్వ్ చెయ్యాలి అనుకుంది. అలానే నెలలు, ఏళ్ళు చేసారు. లాస్ట్ కి open చేసారు ఈ మధ్యే.. ప్రపంచం అంతా scientists నీ, experts నీ నమ్మింది. వాళ్ళు చెప్పేవి పాటించింది. చైనా పాలకులు అలా ఎవరు చెప్పేదీ వినడం, పాటించడం చెయ్యలేదు. అధికార పార్టీ ఆడిందే ఆట, పాడిందే పాట.
చాలా దేశాలు డాక్టర్స్ కీ హాస్పిటల్స్ కీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చాలా డబ్బులు వీటి మీద ఖర్చు పెట్టారు. చైనాలో రూలింగ్ పార్టీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చిన్న చిన్న ఊర్లలో కూడా ఆ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో సగటు మనిషి జీవితం ఇరుక్కుంది. ప్రతి పనికీ వాళ్ళ approvals అవీ పాటించి పౌరులకు లాస్ట్ కి విసుగు వచ్చింది.
ప్రపంచం అంతా aged people కి ముందు vaccines – booster doses ఇచ్చింది.. చైనా అందుకు విరుద్ధంగా aged people ను ఇంట్లోనే బంధించింది. కమిటీలు అత్యుత్సాహం చూపాయి. working class కి vaccines ఇచ్చారు, కానీ అవి కూడా సరిగా ఇవ్వలేదు. ఫారిన్ vaccines కి అనుమతి ఇవ్వలేదు. చాలా జనాభా vaccine తీసుకోలేదు.
Ads
almost చాలా దేశాలు కరోనా rules and restrictions ఎత్తేసారు. కానీ చైనా అలానే కంటిన్యూ చేసింది… FIFA మొదలయ్యాక లక్షల మంది ఖతర్ లో match లు చూడడానికి వచ్చారు. చాలా దేశాల వాళ్ళు వచ్చారు చైనా వాళ్ళు తప్ప… తిరిగివెళ్ళారు ఎవరిదేశాలకు వాళ్ళు, ఎక్కడా కరోనా విజృంభణ జరగలేదు. మనుషులు చనిపోలేదు.
ప్రేక్షకులు/ జనాలు ఎవరూ masks పెట్టుకోలేదు. గుంపులు గుంపులు – అసలు కరోనా అనేది ఒకటి ఉందా అనేది తెలియకుండా టోర్నమెంట్ మొత్తం జరిగింది.. FIFA టీవీల్లో ప్రసారం అయ్యింది. టీవీలో మ్యాచ్ చూసిన చైనా ప్రజలు ప్రభుత్వాన్ని అడగడం మొదలుపెట్టారు “మమ్మల్ని ఎందుకు ఇలా బంధించారు” అని..
చైనా ప్రభుత్వం TV లో లైవ్ మ్యాచ్ లో ప్రేక్షకుల స్టాండ్స్ ను blur చేసి కేవలం players- ground మాత్రమే చూపించారు. జనాలకు ఇంకా కడుపు మండి, కోపం వచ్చి రోడ్ మీద పడ్డారు.. రోడ్ మీద పడిన ప్రజలు కరోనా రూల్స్ కు వ్యతిరేకంగానే కాకుండా, ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా కూడా ఉద్యమించారు. ఈ ధర్నాలు యూనివర్సిటీలకు పాకింది.. స్టూడెంట్స్ చాలా చోట్ల పోరాటాలు మొదలుపెట్టారు..
సమస్య ఇంకా పెద్దది అవుతుంది అనుకున్న చైనా ప్రభుత్వం, ఒక్కసారిగా rules అన్నీ సడలించింది.. ఇండియా కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఒక్కసారిగా జనాలు బయటి కి వచ్చేసరికి కోవిడ్ కేసులు ఎక్కువ రావడం మొదలయ్యింది.. దానికి ఏదో పేర్లు పెట్టి జనాలను భయపెట్టడానికి కొన్ని శక్తులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అంత కంటే ఏమీ లేదు.
వార్తలు సమాప్తం. చైనా మొదటినుంచీ రాంగ్ స్టెప్స్ తీసుకుంది కరోనా విషయంలో. అందరినీ misdirect కూడా చేసింది. ఇప్పుడైతే ఆందోళన అనవసరం. మాస్కులూ, sanitisers కొనాల్సిన పనిలేదు. Give time, some time.
—
ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచ దేశాలు చైనా ప్రొడక్షన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉన్నాయి.. వాళ్ళు కిందపడితే మనకు ఎముకలు విరిగే పరిస్థితి. సప్లై చైన్ ను వాళ్ళు dictate చేసినట్లు అమెరికా కూడా చెయ్యలేదు ఇప్పట్లో. ఆత్మ నిర్భరం మాటల్లో కాకుండా చేతల్లో చూపినప్పుడే మనం వారి గురించి ఆలోచించొచ్చు.. అంత వరకూ నమో చైనా నమోనమామి అనాల్సిందే…
Share this Article