నిజమే… వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ చాణక్యుడే… రాజకీయంగా ఎత్తులుజిత్తులు తెలిసిన మాయలమరాఠీ… కానీ గ్రహచారం ఎక్కడో ఎదురుతంతోంది… అందుకే జస్ట్, అలా అలా వోటుకునోటు కేసులాగే బీజేపీ అగ్రనేతలను బజారుకు లాగి బర్‌బాద్ చేస్తానని అనుకున్నాడు… కానీ వరుసగా తనకే దెబ్బలు పడుతూ తలబొప్పి కడుతోంది… ఇంకా చాలా ఉంది… వెరసి ఏమి సేతురా లింగా అనే పరిస్థితి…… ఇది ఒక వెర్షన్…
నేను ప్లాన్ వేస్తే ఎదుటోడు చిత్తు చిత్తు అనుకున్నాడు… ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు రచించాడు… ఆడియోలు, వీడియోల సీడీలు, పెన్‌డ్రైవ్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు పలు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లకు పంపించాడు… మీరే ఆలోచించండి అన్నాడు… అందరేమో గానీ కీలకమైన హైదరాబాద్ జడ్జి చాలా సీరియస్‌గానే ఆలోచించాడు… తన దగ్గర ఈ కేసుంది… సో, ఈ కేసును సిట్ పరిధి నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలని ఆదేశించాడు… అనేక రాజ్యాంగపరమైన, చట్టపరమైన అంశాల్ని ప్రస్తావించాడు… 45 అభ్యంతరాలు, 25 రకరకాల పాత కేసుల్ని వడబోసి, జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేయబడిన ఈ జడ్జిమెంట్ కాపీ అప్పుడే లీగల్ సర్కిళ్లు, పొలిటికల్ సర్కిళ్లలో బహుళ చర్చనీయాంశమైంది… ప్రశంసాపూర్వకంగానే…
వెరసి జరిగిందేమిటి..? కేసీయార్ తన అత్యుత్సాహంతో, అతిశయంతో ఓవరాక్షన్ చేశాడనీ, అది కాస్తా బూమరాంగ్ అయిపోయి, ఇప్పుడేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడనీ చర్చ సాగుతోంది… మరి కేసీయార్ సాధించింది ఏముంది..? పైగా ఉల్టా ఫలితాలు…
Ads
1) సిట్ కొనసాగింపు ప్రశ్నార్థకం… 2) వెళ్తే హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలి… కానీ హైదరాబాద్ జడ్జి లేవనెత్తిన అంశాలే అక్కడా చర్చకు వస్తాయి… 3) ఈలోపు ఈడీ రోహిత్ రెడ్డి చుట్టూ కేసు బిగిస్తుంది… విచారణకు డుమ్మా కొట్టినందున ఇప్పుడు బాల్ వాళ్లకే అడ్వాంటేజ్‌గా ఈడీ కోర్టులో ఉంది… 4) సీబీఐ కేసు నమోదు చేసి, ఎవరైతే ఈ ఎమ్మెల్యేల కుట్రకేసును రచించారో వాళ్లనే పకడ్బందీగా ఇరికించే మార్గాల్ని అన్వేషిస్తుంది… 5) అటు ఈడీ, ఇటు సీబీఐ రోహిత‌్‌రెడ్డినే కాదు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను కేసులోకి లాగుతాయి… కేసీయార్ అనుకున్న ఫలితానికి పూర్తి ఉల్టా ఫలితం… 6) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు ఫిక్సయిపోయినట్టే… 7) బీజేపీ అగ్రనేతల్ని బజారుకు లాగాలనుకున్న కోరిక ఏమీ ఫలించలేదు… పైగా తనే జాతీయ స్థాయిలో బదనాం అయిపోయాడు… 8) దేశంలో ఒక్క నాయకుడు కూడా తన వీడియోలను, తన వాదనల్ని పట్టించుకోలేదు… ఇది కేసీయార్ కలలో కూడా ఊహించలేదు… 9) ఈ స్థితిలో తను బీఆర్ఎస్ జాతీయ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లలేడు… అందుకే హఠాత్తుగా ఓ నిర్లిప్తత వచ్చేసింది… ఇప్పట్లో జాతీయరథం కదిలే సీన్ కనిపించడం లేదు… 10) తను తెలంగాణ గోచీనే సరిదిద్దుకునే సిట్యుయేషన్ కనిపించడం లేదు… ఏమైంది మరి చాణక్యం… ఇన్నాళ్లూ గ్రహచారం బాగుంది కాబట్టి అన్నీ చెలామణీ అయ్యాయా..? మరి ఇప్పుడు గ్రహచారం..?
సరే, ఇదంతా ఒక వెర్షన్… ఇంకోవైపు బీఆర్ఎస్ శ్రేణులకు ఓ కంటితుడుపు వెర్షన్ కూడా చర్చల్లో ఉంది… కేసీయార్ ఇవన్నీ ఊహించాడు… మొదట్లోనే ఏదో తప్పుటడుగు పడిందనీ, ఇది ముందుకు పోదనీ తెలుసు… అందుకే పొలిటికల్ అవసరాలకు వాడుకున్నాడు… బీజేపీ నా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందహో అని గాయిగత్తర లేపడానికి ప్రయత్నించాడు… వ్యూహాలన్నీ ఎందుకు సక్సెసవుతాయి..? ఇదొక్కటీ అనుకున్నట్టు సక్సెస్ కాలేదు… రాజకీయాల్లో కామనే కదా…. ఇదీ ఆ వెర్షన్ సారాంశం…
కానీ ఆట ఇప్పుడే కదా స్టార్టయింది… పావులన్నీ ఇప్పుడేగా కదులుతున్నాయి… రక్తికట్టాల్సిన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నయ్…!! కొన్ని పత్రికల్లో వస్తున్నట్టు కేసీయార్ తలకు చుడతారా ఆ కేసును..? చుట్టకపోవచ్చు… మామూలుగా బీజేపీ మోడస్ ఆపరెండీ ప్రకారం టార్గెటెడ్ కేరక్టర్ చుట్టూ ఉన్న గ్రహాల మీదే కాన్సంట్రేట్ చేస్తారు..!!
Share this Article