వచ్చే ఫిబ్రవరిలో ఓ సినిమా విడుదల అవుతుందట… అల్లు అరవింద్ సమర్పణ… సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణు కథ’… అందులో ఓ పాట… వాసవ సుహాస అని మొదలవుతుంది… పాడింది కారుణ్య… తనకు వొంకేమీ ఉండదు, ప్రతిభ ఉన్న గాయకుడు… ఈ పాటను చంద్రబోస్ మెచ్చుకుని, ఓ ట్వీట్ పెట్టాడు అనే వార్త పలు సైట్లలో కనిపించింది… తీరా చూస్తే ఆ ట్వీట్‌లో ఆశంసలు, సంస్కరం వంటి పదాలు కనిపించి జాలేసింది…
ఒరిజినల్ ట్వీట్ చూద్దామంటే, అదేమీ కనిపించలేదు… సరే… రాసింది ఎవరబ్బా అని చూస్తే ‘త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి’ అని కనిపించింది… ఇంకాస్త తవ్వుతూ పోతే అసలు అది తెలుగు పాటేనా అనిపించింది… మరోవైపు దీన్ని సంస్కృత గీతంగా చెబుతున్నారు… గందరగోళం… నిజానికి ఆ పాట కంటెంటే గందరగోళం… ఆ పాట ఇలా ఉంటుంది…
‘‘వాసవ సుహాస గమనసుధా
Ads
ద్వారవతీ కిరణార్భటీ వసుధా..
అశోక విహితాం కృపానాన్రుతాం కోమలామ్
మనోజ్ఞితం మమేకవాకం..
మయూఖయుగళ మధుసూధనా మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగరధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా..
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్యవిధి విదాన హేసదనా
నిఖిలజన సా లోచనా
యుగ యుగాలుగా ప్రభోదమై
పది విధాలుగా పదే పదే..
పలికేటి సాయమీమన్న
జాడలే కదా.. నువ్వెదికినఏదైనా
చిరుమోవికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక ఆగునా నువ్వెళ్లేదారినా
నినునిన్నుగ మార్చినా.. నీనిన్నటి అంచునా
వెబ్ సముద్రంలో వెతుకుతూ వెతుకుతూ పోతే… అవధాని Naga Gurunatha Sarma…. రాసిన ఓ విశ్లేషణ కనిపించింది… బాగుంది… అదేమిటో మీరూ చదవండి… ఎందుకంటే… ఏదో ఒకటి రాసేయడం, ఆహా ఓహో అని మిగతావాళ్లు చప్పట్లు కొట్టేయడం… కనీస సమీక్ష కరవైంది ఈమధ్య… అసలు గీకి చూస్తేనే కదా అది కాకిబంగారమో, అసలు బంగారమో తెలిసేది… నాగ గురునాథ శర్మ స్వతహాగా ఇండస్ట్రీలో ఇదే ఫీల్డ్‌లో ఉంటూనే ఒక పాటను సరిగ్గా విశ్లేషించడం విశేషమే…
‘‘నేను సాధారణంగా సినిమా పాటలపై ఎక్కువ కామెంట్ చేయను. దానికి ముఖ్యకారణం నేనూ కవిని కాబట్టి.. వాళ్ళు పడే శ్రమ నాకూ తెలుసు కాబట్టి. ఎక్కువభాగం రచయితలకన్నా ప్రక్కవాళ్ళ బలవంతాలతో పాటలు పేలవంగా వస్తూ ఉంటాయని వదిలేస్తాను. ఈ క్రింది పాటకు సంబంధించి మాత్రం స్పందించడం నా బాధ్యత అనిపించింది.
ఎన్నో యేళ్ళుగా కావ్యస్థాయికి సమానంగా కొనసాగిన తెలుగుపాటను వర్తమానంలో కూడా సుసంపన్నమైన సాహితీ ప్రక్రియగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతీ సినీరచయితపై ఉంది. ఇంకా మాట్లాడితే ప్రతీ నిర్మాత, దర్శకుడిపై ఉంది. కేవలం కమర్షియల్ మోజులో పడి గుడ్డిగా వెళితే తెలుగు సినిమా పాటను మర్చిపోయే రోజు దూరంలో లేదు. మిలియన్ వ్యూస్ కాదు.. హృదయాంతరాలలో నిలిచిపోయే పాట మాత్రమే కవిత్వమై, కథాసారమై, కావ్యమై వర్ధిల్లుతుంది. ఆ స్థాయిలో మళ్ళీ తెలుగు సినిమా పాటను చూడాలని కోరుకుంటున్నాను…
Share this Article