కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు గతంలో మస్తు హడావుడి ఉండేది… సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉండేవి… ఈసారి అవేవీ పెద్దగా లేవు… కానీ సెలబ్రిటీలు ఎంచక్కా విదేశాలు, ఎక్కువగా మాల్దీవులు వెళ్లిపోయారు… కొందరు ఫోటోలకు చిక్కారు… కొందరు కాన్ఫిడెన్షియల్ ట్రిప్స్‌లా ఎంజాయ్ చేశారు… కానీ ఒక నిత్యా మేనన్, ఒక సాయిపల్లవి టోటల్లీ డిఫరెంట్ కేరక్టర్లు కదా… అందులో సాయిపల్లవి మనం ఊహించని రీతిలో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది…
నిజానికి గార్గి సినిమా రిలీజు తరువాత ఇక ఆమె బయట కనిపించలేదు… ఎవరికి తోచింది వాళ్లు రాసుకోవడమే తప్ప, ఆమె నిజంగా ఎక్కడుంది..? ఏం చేస్తుంది..? హఠాత్తుగా ఎందుకు మాయమైంది..? ఏం చేయబోతోంది..? ఎవరికీ నిజాలేమిటో తెలియదు… ఆమె డాక్టరీ చదివింది కాబట్టి ఏదో ఆస్పత్రి కట్టబోతోంది అని ఊహాగానాలు… అదీ ఆమె గతంలో చెప్పింది కాబట్టి… కానీ గైనకాలజీలో స్పెషలైజేషన్ చేద్దామని ఆమె ఆలోచన… బహుశా ఆ దిశలో సాగుతోందేమో అని డౌటనుమానాలు…
విరాటపర్వం సమయంలో తను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం కూడా ఆమెను మానసికంగా డిస్టర్బ్ చేశాయి… ఆ సినిమాతోపాటు గార్గి కూడా ఫెయిల్ కావడం ఆమెకు మరో షాక్… అసలు తెలుగులో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ సినిమా అంటే గుర్తొచ్చే పేర్లు రెండే… సమంత, సాయిపల్లవి… ఇందులో సమంత ఓ ఎక్స్‌ట్రీమ్ కేరక్టర్… వెకిలి, వెగటు, విచ్చలవిడి వేషాలు… కానీ సాయిపల్లవి కేరక్టర్ వేరు… కామాటిపురలో ఉంటున్నా సరే, పద్ధతిగా ఉండే కేరక్టర్ అంటారు మరి…
Ads
ఇంతకీ ఆమె న్యూ ఇయర్‌కు ఎలా వెల్కమ్ చెప్పిందనే కదా ప్రశ్న… పార్టీలు, పబ్బులు, వెకేషన్లు కాదు… ఆమె ఆ రోజు మొత్తం దైవచింతనలోనే గడిపింది… సాయిపల్లవి అనే పేరు పెట్టింది పుట్టపర్తి సాయిబాబా… తను, తన కుటుంబం సాయిబాబా భక్తులు… సాయిపల్లవి చేతికి కూడా ఓ జపమాల ఎప్పుడూ ఉంటుంది… అందుకే కొత్త సంవత్సరం రాగానే పుట్టపర్తి వెళ్లిపోయింది, సత్యసాయి నిలయానికి వెళ్లి అక్కడే గడిపారు ఆ కుటుంబసభ్యులు…
తనను గుర్తుపడితే అనవసరంగా హడావుడి నెలకొంటుందని ఆమెకు తెలుసు కదా… ఓ మాస్క్ పెట్టుకుంది మొహానికి, సైలెంటుగా సాధారణ భక్తుల్లో కలిసిపోయింది… కానీ కొందరు భక్తులు గుర్తుపట్టారు… ఆమె ఫోటోలను తీశారు… సెల్పీల కోసం వెంటపడ్డారు… తప్పదు, సహజమే… నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది… ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్… గుడ్, ఎలాగైతేనేం ఆమె మళ్లీ కనిపించింది… సినిమాలు మానేయాలా వద్దా అనేది ఆమె ఇష్టం… కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమెను తమ కుటుంబసభ్యురాలిగా భావించేంత ఆదరణను సొంతం చేసుకుంది ఆమె… సో, సినిమాలు మానేస్తే ప్రేక్షకులకు నిరాశ… సరే, వెళ్తే వెళ్లనీ… కానీ చివరగా ఒక సినిమా… నాలుగు పాటలు, అవీ ఆమె మార్క్ డాన్సులతో… బాగుంటుంది కదా…!!
Share this Article