Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…

October 29, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. ఓ షీరో , ఓ బడ్డింగ్ హీరో , ఇద్దరు హీరోయిన్లు : వెరశి కిరాయి దాదా . 1987లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత యన్టీఆర్ సినిమాలకు పంపిణీదారుడుగా పేరు , డబ్బు సంపాదించుకున్న రాజకీయ నాయకుడు దొరస్వామి రాజు .

1986లో హిందీలో హిట్టయిన జాల్ సినిమాకు రీమేక్ మన కిరాయి దాదా . హిందీలో మిథున్ చక్రవర్తి , రేఖ , మందాకిని , మూన్ మూన్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి .

Ads

  • భరతనాట్య శాస్త్రలో పట్టభద్రురాలు , సామాజిక ఉద్యమకారిణి , బ్లూ క్రాస్- హైదరాబాదు వ్యవస్థాపకురాలు అమలకు తెలుగులో అరంగేట్రం ఈ సినిమాయే . ఆ హీరోతోనే నిజ జీవితాన్ని కూడా తర్వాత పంచుకుంది .

అనగనగా ఓ జమీన్ . దాని జమీందారు జమీన్ లోని జనాల్ని పీక్కుతినటం తమ జన్మ హక్కు అని భావిస్తూ ఉంటాడు . అతని తమ్ముడు హృదయుడు . అన్న రావు గోపాలరావు , తమ్ముడు కృష్ణంరాజు .

హృదయుడయిన తమ్ములుంగారు చిన్ననాటి స్నేహితురాలిని ఆరాధిస్తూ ఉంటాడు . ఆ జమీన్లో జనం కోసం పోరాడుతూ ఉంటాడు మురళీమోహన్ . చిన్న జమీందారు కృష్ణంరాజు , మురళీమోహన్ స్నేహితులు .

విలన్ రావు గోపాలరావుకి తోక విలన్ గొల్లపూడి మారుతీరావు , కట్టప్ప లాంటి విధేయుడు శ్రీధర్ . వీరందరూ కలిసి చిన్న జమీందారుని చంపి అతని స్నేహితుడు అయిన మురళీమోహన్ మీద ఆ నేరం మోపి జైలుకు పంపుతారు .‌ మురళీమోహన్ భార్యాబిడ్డలు ప్రాణభయంతో పట్నం చేరుతారు . వారి కొడుకే హీరో నాగార్జున .

చిన్న జమీందార్ భార్య జయసుధే ఈ సినిమాకు షీరో . తన భర్తను హత్య చేసిన విలన్ల మీద పగ తీర్చుకోవటానికి నాగార్జునని కిరాయికి కుదుర్చుకుంటుంది . జయసుధ , మురళీమోహన్లు కలిసి విలన్లను చంపి పగ తీర్చుకుంటారు . ఈ 1+2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా ఖుష్బూ , అమలలు నటించారు .

చివరాఖరికి ఖుష్బూ సైడయిపోవటంతో నాగార్జున , అమల ఒకటవుతారు . శుభం కార్డ్ పడుతుంది .
జయసుధ నటనను మెచ్చుకోవాలి . ముఖ్యంగా పగ తీర్చుకునే వ్యూహకారిణిగా , గానాబజానాలో నర్తకిగా చాలా బాగా నటించింది . ఇంక హీరోగా నాగార్జున సెటిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు . ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ స్పేసుని అందంగా ఫిల్ చేసారు . అమల డాన్సుల్లో అదరకొట్టేసింది .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . రాత్రి వేళకు రేరాణిని రాచలీలకు నీదానిని గానాబజానా పాటలో జయసుధ చాలా బాగా నృత్యించింది . మురిసే మేఘాలు నడిచే అందాలు వాన పాటలో నాగార్జున , అమలలను దర్శకుడు కోదండరామిరెడ్డి విజృంభింపచేసారు . మరో డ్యూయెట్ నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా పాట కూడా బాగుంటుంది . వేటూరా ! మజాకా !

నాగార్జున ఖుష్బూని టీజ్ చేసే గుంతలకిడి గుంతలకిడి పాట , చిత్రీకరణ హుషారుగా ఉంటాయి . ఈ పాటలనన్నీ వేటూరే వ్రాయగా జొన్నవిత్తుల ఒక డిస్కో డాన్సుకి వన్ టూ త్రీ వాటేసేయ్ పాటను వ్రాసారు . అన్ని పాటల చిత్రీకరణ బాగుంటుంది . సినిమా విజయానికి దోహదపడ్డాయి .

బాలసుబ్రమణ్యం , సుశీలమ్స , జానకమ్మ పాటల్ని పాడారు . సత్యానంద్ డైలాగులు పదునుగానే ఉంటాయి . ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , సుధాకర్ , మాడా , రాళ్ళపల్లి , వరలక్ష్మి , సుత్తి వీరభద్రరావు , అనిత , మహీజా , ప్రభృతులు నటించారు .

ఈ సినిమా తమిళంలోకి కూడా తంబి తంగ కంబి టైటిలుతో 1988లో రీమేక్ అయింది . విజయకాంత్ , లక్ష్మి , రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు . క్రమక్రమంగా నాగార్జున హీరోగా నిలదొక్కుకోవటంలో ఈ కిరాయి దాదా బాగానే దోహదపడింది .

సినిమా యూట్యూబులో ఉంది . నాగార్జున , జయసుధ అభిమానులు తప్పక చూడవచ్చు . ఇతరులకూ చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బుడ్డోడిని ఆడించలేదు – చివరకు ఐర్లాండ్ కూడా ఆడుకుంది – ఓడించింది
  • ‘ఇడుపు కాయితం’ ఇచ్చి పన్నెండేళ్లయినా… అదే వెక్కిరింపులు!
  • సింగరాయ కొండకాడా… ఐటమ్ సాంగ్‌లో అర్చనా పూరన్‌సింగ్!
  • ఊహించిందే! మళ్లీ బీఆర్ఎస్ గాయిగత్తర! విషం తప్ప విజ్ఞత లేదు!
  • పేపర్ బాయ్ తలుపు తట్టిన చప్పుడు – నేనింకా బతికే ఉన్నాను…
  • మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా – అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు!
  • ‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!
  • దయానాయక్ బయోపిక్! – వేలు పెట్టి వారం చెడగొట్టే రాంగోపాల్‌వర్మ!
  • Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!
  • కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలకు వణుకు- కేంద్రం కొరడా!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions