సాధారణంగా అక్షయ్ కుమార్ నెలకు ఓ సినిమాను ఊదిపారేయాలని చెప్పినా సరే రెడీ అంటాడు… హిట్టా, ఫ్లాపా పట్టించుకోడు… ఫుల్ ఎనర్జీ లెవల్స్… నటిస్తూ వెళ్తాడు… ప్రత్యేకించి దేశభక్తి, చరిత్ర బాపతు కథల్ని వెంటనే పట్టేసుకుంటాడు… వేరే వాళ్లకు చాయిస్ ఇవ్వడు… అలాంటిది తను ఓ వీరజవాను బయోపిక్ నుంచి తనంతట తనే వైదొలిగాడు… ఆ సినిమా పేరు గూర్ఖా…
ఇది 1971 వార్ సమయంలో గూర్ఖా రెజిమెంట్‌ను లీడ్ చేసిన మేజర్ జనరల్ కార్డోజో [Major General Ian Cardozo] కథ ఆధారంగా రూపొందుతోంది… యుద్ధసమయంలో అనుకోకుండా ఓ మందుపాతర మీద కాలువేసిన కార్డోజో, సమయానికి అండగా వచ్చేవారు కనిపించక, తనంతట తనే గూర్ఖాల సంప్రదాయ కత్తి ఖుక్రీతో తనే కాలిని తనే నరుక్కుంటాడు… ఇదీ ఆయన కథలో కాస్త ఇంట్రస్టింగు పాయింట్…
తను నిజానికి గూర్ఖా కాదు… ఆంగ్లో ఇండియన్… ఆర్మీకి అందించిన సేవలకు గాను అతి విశిష్ట సేవా మెడల్ పొందిన ఆయన వయస్సు ప్రస్తుతం 85… ఈ సినిమా యూనిట్ చెబుతున్న కథను, అందులో తన పాత్ర చిత్రీకరణపై ఆయనకు బోలెడు సందేహాలు… తను ఆ యూనిట్ ముఖ్యులను పదే పదే ప్రశ్నిస్తున్నాడు… అక్షయ్ కుమార్ కూడా ఎందుకో విసిగిపోయి అసలు ఆ సినిమానే చేయకపోవడం బెటర్ అని ఫిక్సయ్యాడు… వైదొలిగాడు…
Ads
సినిమా వేరు, డాక్యుమెంటరీ వేరు… సినిమా అనేసరికి కొంత క్రియేటివ్ ఫ్రీడం తీసుకుంటారు… ప్రేక్షకుడిని కనెక్ట్ కావడానికి, కొంత కల్పన అవసరం… అది ఆ జనరల్‌కు అర్థం కావాలని ఏమీ లేదు… తను చెప్పినట్టు సినిమా కథ రావాలంటే అది డాక్యుమెంటరీ అవుతుంది… ఎవరి కథో వాళ్లే కన్విన్స్ కానప్పుడు ఇక సినిమా కొసెళ్లడం సందేహమే… అందుకే వదిలేసినట్టున్నాడు…
ఇదేకాదు, ఈ ఆర్మీ వాళ్లకు చాదస్తాలు ఎక్కువ… ఈ సినిమా పోస్టర్ విడుదలయ్యాక, అక్షయ్ దాన్ని ట్వీట్ చేశాడు… దాన్ని చూసిన ఓ ఆర్మీ మాజీ ఆఫీసర్ ఓ ట్వీట్ పెట్టాడు… ‘‘డియర్ మిస్టర్ అక్షయ్, గూర్ఖా రెజిమెంట్ మాజీ ఆఫీసర్‌గా మీరు తీయబోయే సినిమా పట్ల సంతోషం… కానీ ఆ ఖుక్రీ అలా ఉండదు… అది కత్తి కాదు, ఒకవైపు పదును ఉంటుంది… ఇలాంటి ఎర్రర్స్ లేకుండా చూస్తే సంతోషం’’ అన్నాడు అందులో… అక్షయ్ రిప్లయ్ ఇస్తూ ‘సంతోషం, ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటాం’ అన్నాడు గానీ ఇదేదో సజావుగా వెళ్లడం లేదని అనుకున్నాడు… ఓ పేద్ద దండం పెట్టాడు…
Share this Article