నాకు అంతా బాగుంది, నేను చెప్పినట్టు నడుస్తోంది… నేను ఏది అనుకుంటే అది నడిపించుకోగలను, నేను చెప్పిందే శాసనం… ఈ తరహాలో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, సినిమాల నిర్మాణం, పంపిణీ తదితర వ్యవహారాల్లో దిల్ రాజు ధోరణి… కానీ ఇలాంటి వైఖరి కొన్నాళ్లే ఉంటుంది… తరువాత పరిస్థితులు ఎదురుతిరుగుతుంటాయి… మెడలు వంచుతాయి… అదీ జరుగుతోంది…
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయ్‌తో తను తీసిన ఓ డబ్బింగ్ సినిమాను పోటీకి నిలబెట్టి… రోజుకోరకం మాట మాట్లాడాడు… మైత్రి మూవీస్‌తో గోక్కున్నాడు… థియేటర్లు నలుగురి గుప్పిట్లో చిక్కుకున్న తీరుతో అసలు నష్టమేమిటో, చిన్న నిర్మాతలకే కాదు, పెద్ద నిర్మాతలకూ తలనొప్పే అనే సంగతి పెద్ద నిర్మాతలకూ తెలిసొచ్చింది…
ఎంతటి దిల్ రాజైనా సరే, అందరితోనూ గోక్కుంటే… చివరకు ఏదో సమయం చూసి, అందరూ కలిసి ఒత్తుతారనే సంగతి దిల్ రాజుకూ తెలుసు… పెద్ద సినిమాలు లేకుండా తన సిండికేట్ నడవదనీ తెలుసు… అందుకే సినిమా పెద్దలు ఎక్కడో ఆయువుపట్టు చూసి ఒత్తారు… దాంతో విజయ్ వారసుడు సినిమా విషయంలో మెడలు, తల వంచి… చిరంజీవి, బాలయ్య సినిమాలకు నష్టం లేకుండా పక్కకు తప్పుకున్నాడు దిల్ రాజు… ముందు నుంచీ పట్టుదలగా ఉన్న విడుదల తేదీని తనే మార్చి, వాయిదా వేశాడు… తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు మరీ ఎక్కువ చేస్తున్నాడనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది… అదింకా పెరుగుతోంది…
Ads
తన ధోరణిలో పడి, ఇన్నాళ్లూ తనతో బాగున్న వారికీ నష్టం చేయడానికి దిల్ రాజు వెనకాడటం లేదు… బన్నీ వాసు, హారిక చినబాబు సంగతి అంతే… దిల్ రాజు ఏమిటో అర్థమైపోయింది వాళ్లకు కూడా… ఫిబ్రవరి ఏడున వాళ్లు తమ సినిమాల రిలీజుకు ప్లాన్ చేసుకున్నారు… ముందుగా నిర్ణయించుకున్న తేదీయే… కానీ హఠాత్తుగా దిల్ రాజు శాకుంతలం సినిమాను తీసుకొచ్చి పెడుతున్నాడు వాటికి పోటీగా… చివరకు టీజర్ విడుదల తేదీల విషయంలోనూ దిల్ రాజు మిగతా నిర్మాతలను అస్సలు దేకడం లేదు…
సాగినన్ని రోజులు ఇలాంటి ధోరణితో నష్టం లేదు, కానీ ఒక్కొక్కరే దూరమై, అందరూ టైమ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం ఏదోఒకరోజు దారుణంగా నష్టపోవాల్సి ఉంటుంది… దిల్ రాజు మొండిగా, ఆ సోయి లేకుండా తన సంబంధాల్ని తనే తెంపేసుకుంటున్నాడు… సుధాకర్, అశ్వనీదత్, మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా , సితార, హారిక హాసిని, గీతా 2… ఎవరూ దిల్ రాజు ధోరణి పట్ల సంతృప్తిగా లేరు… లేరు…!!
Share this Article