Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!

October 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. ఒక సినిమా కోసం వ్రాసిన కధ ఆరు భాషల్లో సినిమాలకు పనికొచ్చిందంటే ఆ రచయితను తప్పకుండా అభినందించాల్సిందే . ఆ ఘనత మళయాళ సినీ రంగానికి సంబంధించిన ఫాజల్ అనే రచయిత కం దర్శకుడికే చెందుతుంది . (పుష్ప ఫహాద్ ఫాజిల్ తండ్రి) పూవిన్ను పుదియ పూంతెన్నాల్ అనే మళయాళ సినిమాకు ఫాజల్ కధను వ్రాసి ఆయనే దర్శకత్వం వహించారు . మమ్ముట్టి , సురేష్ గోపి , నదియా ప్రభృతులు నటించారు …

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి అల్లు అరవింద్ హక్కులు కొనుక్కొని బావ చిరంజీవితో పసివాడి ప్రాణం అనే టైటిలుతో రీమేక్ చేసారు . ఈ టైటిల్ కూడా అరవిందే పెట్టారట . చిరంజీవి స్టార్డంకు అనుకూలంగా క్లైమాక్సును శుభాంతం చేసారు . మళయాళంలో హీరో చనిపోతాడు . మన తెలుగులో హీరో చిరంజీవి చిరంజీవి కదా ! శుభాంతం చేసి బ్లాక్ బస్టర్ని చేసారు . కనక వర్షం కురిసింది .

Ads

చిరంజీవి , కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ ఈ పసివాడి ప్రాణం . చిరంజీవి బ్రేక్ డాన్స్ , విజయశాంతి వయ్యారాలు , సుమలత ముగ్ధ మనోహర రూపం , పసివాడి సెంటిమెంట్ , చక్రవర్తి సంగీతం , తార కొరియోగ్రఫీ , కోదండరామిరెడ్డి పాటల చిత్రీకరణ , దర్శకత్వం ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసాయి .

జంట హత్యల్ని చూసిన నోరు , వినికిడి శక్తి లేని ఓ పసివాడిని చంపటానికి ఇద్దరు విలన్లు వెంటాడుతుంటారు . ఆ పసివాడు అదృష్టవశాత్తూ హీరో చేతిలో పడతాడు . హీరో ప్రేమతో కాపాడుకుంటూ విలన్ల కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు . ఈ ప్రయత్నంలో అతని ప్రేయసి విజయశాంతి కూడా సాయపడుతూ ఉంటుంది .

ఆ పసివాడు తన అక్క కొడుకు అని కూడా తెలుస్తుంది . హీరోనే హత్యల్ని చేసాడని నమ్మిన పోలీసు ఇనస్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేస్తాడు . కస్టడీ నుండి తప్పించుకుని విలన్లను తుదముట్టించటంతో శుభం కార్డ్ పడుతుంది .

ఇది కూడా 1+2 సినిమాయే . అయితే ఒకరి తర్వాత ఒకరు ఎంటరవుతారు . వాళ్ల గ్లామర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్… ముఖ్యంగా మెచ్చుకోవలసింది పసివాడిగా నటించిన బేబీ సుజిత . ఎందుకనో టైటిల్సులో మాస్టర్ అని వేసారు . పెద్దయ్యాక ఈ బేబీ సుజిత పెద్ద టివి నటి అయింది . జై చిరంజీవ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కూడా నటించింది .

విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రసయిన కన్నడ ప్రభాకర్ సిన్సియర్ పోలీసు ఇనస్పెక్టరుగా నటించటం విశేషం . రఘువరన్ , అతని అనుచరుడుగా నటించిన బాబు ఇద్దరికీ తెలుగులో ఇదే మొదటి సినిమా . ఇద్దరూ బాగా నటించారు . ఇతర పాత్రల్లో ప్రసాద్ బాబు , అల్లు రామలింగయ్య , రాజ్యలక్ష్మి , జగ్గయ్య , గుమ్మడి , గిరిబాబు , పి జె శర్మ , ప్రభృతులు నటించారు .

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది పాటలు . ఆత్రేయ , వేటూరిలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ పాడారు . సుమలతతో ఒక డ్యూయెట్ అందం శరణం గఛ్ఛామి అధరం శరణం గఛ్ఛామి నిజంగానే అందంగా ఉంటుంది . చిరంజీవి ఎంట్రీ సాంగ్ సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం హుషారుగా సాగుతుంది .

విజయశాంతితో మూడు డ్యూయెట్లు ఇద్దరూ అదరగొట్టేసారు . కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామా , ఇదేదో గోలగా ఉంది , చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అంటూ సాగుతాయి ఈ మూడు డ్యూయెట్లు . ఇద్దరూ బ్రేక్ డాన్స్ అద్భుతంగా డాన్సించారు .

1987 జూలై 23 న విడుదలయిన ఈ సినిమా డైరెక్టుగా మరియు షిఫ్టింగులతో 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తిరుపతిలో సిల్వర్ జూబిలీ అడింది . ఒకటి రెండు చోట్ల మార్నింగ్ షోలతో 300 రోజులు అడింది .

తెలుగు తర్వాత తమిళంలో సత్యరాజుతో , కన్నడంలో అంబరీషుతో , హిందీలో గోవిందాతో రీమేక్ అయింది . బంగ్లాదేశీ , సింహళీసులో కూడా రీమేక్ అయింది . బేబీ సుజిత అన్ని భారతీయ భాషల్లోనూ నటించిందట . ఈ బ్లాక్ బస్టర్ సినిమా యూట్యూబులో ఉంది . తరచూ టివిలో వస్తూ ఉంటుంది . It’s a Chiranjeevi-AkR mark feel good , unmissable , action entertainer . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!
  • Miss & Mrs Universe… ఏడేళ్ల కూతురికి తల్లి… ఈసారి విశ్వసుందరి!
  • 26/11 ముంబై ఉగ్రవాద దాడి… ఇది మరో కుట్రకోణం !!
  • ఈ హీరోలతో ఇక పనేంటి బాసూ..! కొత్త ‘హీరో’లు వచ్చేస్తున్నారు !!
  • ఊగే మోదుగు పూలూ, త్యాగమూ… సారంగపాణీ… దాశరథి కృష్ణమాచార్యా…
  • కొత్త ట్విస్ట్! సుప్రీంకు జోసెఫ్ విజయ్ సర్కారు తప్పుడు నివేదిక?
  • ముసలోడే గానీ… మహా కర్కోటకుడు! ఓ భారీ రాక్షస ముఠా బద్దలు !!
  • పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!
  • ఆకాశంలో ఒక తార… ఇది మన పాలకొల్లు జాహ్నవి కథేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions