వాళ్ల నడుమ పోటీ… వీళ్ల నడుమ పోటీ అని మనకు మనమే అనుకుని, రాసుకుని ఆవేశపడిపోతుంటాం గానీ… సినిమాల్లో భిన్నరంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ కూల్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతారు… వాళ్ల నడుమ బంధాలు బాగానే ఉంటాయి… అఫ్‌కోర్స్, లోలోపల ప్రొఫెషనల్ పోటీ ఉంటుంది… అది ఉంటేనే పరుగుకు ఉత్ప్రేరకం… కానీ ఓ లక్ష్మణరేఖ దాటరు…
ఉదాహరణకు… శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తదితరులు… వాళ్ల వ్యక్తిగత సంబంధాలు ఫ్రెండ్లీగా ఉంటాయి… వాటిని అలాగే ప్రదర్శించగలరు కూడా… ఒకే సినిమాలో వేర్వేరు పాటలకు వేర్వేరు కొరియోగ్రాఫర్స్ కూడా పనిచేసిన ఉదాహరణలు బోలెడు… అన్నీ నేనే కంపోజ్ చేస్తాననే మంకుపట్టు, ప్రొఫెషనల్ అన్‌హెల్తీ ధోరణి కనిపించదు…
వీరయ్య, వీరసింహా నడుమ పోటీ బాలయ్య వర్సెస్ చిరంజీవి అన్నంతగా ప్రొజెక్ట్ చేశారుగా కొన్నాళ్లు… ఇప్పటికీ ఆ సినిమాల కలెక్షన్ల నడుమ పోటీని ప్రొజెక్ట్ చేస్తున్నారు… అంతేకాదు, వాటికి పనిచేసిన మ్యూజిక్ కంపోజర్ డీఎస్పీ వర్సెస్ థమన్ అనీ ప్రొజెక్ట్ చేశారు… వీటికి అతీతంగా వ్యవహరించే కీరవాణి ఎంచక్కా ఆర్ఆర్ఆర్ పాటకు మంచి అంతర్జాతీయ ప్రశంసలు పొందుతున్నాడు… ఎక్కడికో వెళ్లిపోయాడు… కీరవాణికి సంబంధించి మిగతా కంపోజర్స్ కూడా ఒక్క రాంగ్ వర్డ్ వాడినట్టు ఎప్పుడూ వినలేదు…
Ads
డీఎస్పీ థమన్ గురించి ఎప్పుడూ పెద్దగా సానుకూల, సహృదయ వ్యాఖ్యలు చేసినట్టు వినలేదు… అఫ్‌కోర్స్, ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు కూడా… కానీ డీఎస్పీ ప్రస్తావన వచ్చినప్పుడు థమన్ పాజిటివ్‌గా మాట్లాడిన మాటలు బాగుంటాయి… ఉండాల్సిన పద్ధతిలో ఉంటాయి… ఉదాహరణకు ఆమధ్య ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ తెలుగు షో వచ్చింది కదా… అందులో థమన్ మెయిన్ జడ్జి… ఓసారి వైష్ణవి అనే కంటెస్టెంట్ ఏదో సాంగ్ పాడింది…
దానికి డీఎస్పీ మ్యూజిక్ కంపోజర్… కంటెస్టెంట్ పాడిన తీరు విశ్లేషణే కాదు, మ్యూజిక్ కంపోజింగ్‌ను కూడా విశ్లేషిస్తూ థమన్ ఇలా అన్నాడు…
‘‘హుక్ లైన్‌లో కరెక్టుగా… ఆ టెంపో ఆ కటింగ్స్… ఎ డాన్సర్ కమ్ కంపోజర్ మాత్రమే ఇలాంటి పాటలు కంపోజ్ చేయగలడు… వాళ్లకే ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆరంభించాలో కరెక్టుగా తెలుస్తుంది… అదీ డీఎస్పీ క్వికీ పాయింట్… డీఎస్పీ యూఎస్పీ అదే… లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సోలాగా, తను కొరియోగ్రాఫర్ ఆల్సో… మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో… ఒక పాటకు ఎలా కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా ఉంటుందనే సంగతి బాగా తెలిసినవాడు…’’
ఈ లింకు ఓసారి ఓపెన్ చేసి వినండి… ఆ అమ్మాయి పాటను ఇరగదీసింది… థమన్ జడ్జిమెంట్ సమయంలో ఈ వ్యాఖ్యలు ఉంటాయి… ఇదీ ఆహా ఓటీటీలో వచ్చిన ఆ పాట బాపతు లింక్… గుడ్… నిజానికి ఇండస్ట్రీలో ఈ పాజిటివ్ స్పిరిట్ ఉండాలి…!
Share this Article