తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ ఎవరు..? పోనీ, టాప్ హీరో ఎవరు..? వాల్తేరు వీరయ్య చిరంజీవా..? వీరసింహారెడ్డి బాలకృష్ణా..? కాదా…? ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ గడప దాకా వెళ్లిన రాంచరణా..? జూనియర్ ఎన్టీయారా..? ధమాకా రవితేజ, బిగ్‌బాస్ నాగార్జున, దసరా నాని… ఎవరూ కాదు… అసలు ప్రభాస్ కూడా కాదు… పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ నెంబర్ వన్ హీరో… నిజం…
ఐఐహెచ్‌బి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్) అనే సంస్థ ఓ సర్వే చేసిందని వార్త… ఆ సర్వేలో 5,246 మంది పాల్గొన్నారుట. సౌత్ నుంచి 18 మంది సెలబ్రిటీస్ ఈ పోటీ లిస్టులో ఉన్నారుట… తెలుగుకు వచ్చేసరికి బన్నీ టాప్ హీరో అని తేల్చేశారు వోటర్లు… అనగా ప్రేక్షకులు… ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు… అల వైకుంఠపురంలో, పుష్ప సక్సెసులు బన్నీని ఎక్కడికో తీసుకుపోయాయి… అల్లు అర్జున్ తరువాత కూడా వాళ్లెవరూ సెకండ్ ప్లేసులో లేరట… ఆ ప్లేసులో విజయ్ దేవరకొండ ఉన్నాడు…
వోకే, వోకే… మరి మలయాళంలో ఎవరు..? మమ్ముట్టి..? మోహన్‌లాల్..? కాదు… దుల్కర్, ఫహాద్ ఫాజిల్ టాప్ ప్లేసుల్లో ఉన్నారు… ఇదీ రీజనబులే… మలయాళంలో ఇద్దరూ ప్రస్తుతం తిరుగులేని పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నారు… నిజానికి ఈ ఐఐహెచ్‌బీ ప్రతి ఏడాది ఇలాంటి సర్వేలు చేస్తుంటుంది… కానీ ప్రత్యేకించి సౌత్‌కు సంబంధించిన సర్వే ఇదే మొదటిసారి…
Ads
కన్నడంలో ఇద్దరు హీరోలనే ప్రతిపాదించగా… వారిలో కిచ్చా సుదీప టాప్ ప్లేసులో ఉన్నాడు… కేజీఎఫ్ హీరో యశ్ గానీ, కాంతార హీరో రిషబ్ గానీ పోటీలే లేకుండా పోయారు… రక్షిత్ శెట్టి కూడా ఈమధ్య ఓ హిట్ ఇచ్చాడు… ఐతే విక్రాంత్ రోణ మూవీ సక్సెస్ సుదీప పాపులారిటీ పడిపోకుండా కాపాడింది… బిగ్‌బాస్ కూడా తన ఇమేజీని ప్రేక్షకుల్లో పదిలంగా ఉంచుతుంది…
తమిళంలోకి వస్తే… రజినీకాంత్ లేడు, కమల్‌హాసన్ కాదు… విజయ్, అజిత్ అసలే కాదు… ధనుష్ కూడా కాదు… సూర్య టాప్ ప్లేసులో ఉన్నాడు… తమిళంలో ఆరుగురు హీరోలను ప్రతిపాదిస్తే సూర్య నెంబర్ వన్‌గా నిలవడమే కాదు… మొత్తం సౌత్ ఇండియా భాషల్లోనే సూర్య నెంబర్ వన్ ప్లేసులో ఉన్నాడు… రీజనబులే…
సింగం వంటి పక్కా కమర్షియల్స్ మాత్రమే కాదు… జైభీమ్, ఆకాశం నీ హద్దురా వంటి భిన్నమైన సినిమాల్లో నటించడం, భార్య జ్యోతిక తీసే ప్రయోగాత్మక, సందేశాత్మక సినిమాలకు సపోర్టుగా నిలవడం సూర్య ఇమేజీకి శ్రీరామరక్ష… సో, వసూళ్లు కాదు… సినిమా హిట్స్ కాదు… ఒక పాపులర్ టాప్ హీరోగా ప్రేక్షకులు గుర్తించాలంటే, అభిమానించాలంటే… వాటికి మించి ఇంకేదో ఉండాలి… జనం మెచ్చే ఇమేజీ డిఫరెంట్… అది సూర్యలో ఉంది… మిగతా హీరోలకు అది అర్థం కాదు..!!
Share this Article