తెగింపు తరువాత అజిత్ చేయబోయే సినిమా… భారీ బడ్జెట్… తగ్గేదేలా… లైకా ప్రొడక్షన్స్ వాళ్ల సినిమా… 250 కోట్ల బడ్జెట్… సహజంగానే అందులో తనకు జోడీగా ఎవరు నటిస్తారు..? జానర్ ఏమిటి..? వంటి ప్రశ్నలు రేకెత్తుతాయి కదా… అసలు అజిత్ సినిమాకు అంత మార్కెట్ ఉందానేది మరో ప్రశ్న… తునివు (తెగింపు) సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 160 కోట్లు… మహా అయితే మరో 40 కోట్లు వచ్చి, 200 కోట్లు కష్టమ్మీద వస్తాయేమో… శాటిలైట్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్, ఎట్సెట్రా ఎన్ని కలిపినా 250 కోట్ల మార్కెట్ మహాగగనం…
ఓ వార్త కనిపించింది… నయనతార హీరో అజిత్‌తో రహస్యంగా భేటీ వేసిందట… ఎందుకయ్యా అంటే..? ఆ సినిమాకు తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకుడు… సో, అజిత్ లుక్కు, కథ, సంగీతం ఎట్సెట్రా అజిత్‌తో సుదీర్ఘంగా చర్చించిందట… అవన్నీ విఘ్నేశ్ మాట్లాడుకోలేడా..? పైగా దానికి రహస్య భేటీలు దేనికి..? నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇద్దరిని అనుకున్నారు… నయనతార, త్రిష… పొన్నియిన్ సెల్వన్ తరువాత త్రిష డిమాండ్ పెరిగిపోయిందిగా…
Ads
సో, త్రిష డ్రాప్… కారణేమిటో తెలియదు గానీ నయనతార కూడా డ్రాప్… తరువాత ఐశ్వర్యారాయ్, హుమా ఖురేషి పేర్లు వినిపించాయి… తరువాత అవీ వినిపించడం మానేశాయి… తాజాగా సాయిపల్లవి పేరు ఫైనల్ అయినట్టుగా తమిళ మీడియా వార్తలు రాస్తోంది… అదే నిజమైతే సాయిపల్లవికి భారీ ఛాన్సే… బడ్జెట్, స్టార్ హీరో, పెద్ద బ్యానర్, పాన్ ఇండియా… కానీ అజిత్, సాయిపల్లవి జంట అని తలుచుకుంటేనే ఆడ్‌గా ఉంది… అజిత్ పర్సనాలిటీకి, పిట్టపిల్లలా ఉండే సాయిపల్లవికి కెమిస్ట్రీ మాట అటుంచితే అసలు ఇద్దరికీ ఓ జంటగా ఫిజిక్సే సూటవుతుందానేది ప్రశ్న…
విఘ్నేశ్ శివన్ సినిమాల్లో హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉంటుంది… మరీ వారసుడులో రష్మికలా నామ్‌కేవాస్తే తరహా మాత్రం కాదు… సో, సాయిపల్లవి అందుకే అంగీకరించి ఉంటుందని ఓ టాక్… ఆమె ఏదిపడితే అది ఒప్పుకోదు… తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే అస్సలు ఎస్ చెప్పదు… ఈ కారణంతోనే గార్గి, విరాటపర్వం తరువాత ఇన్నిరోజులైనా ఎవరికీ ఎస్ చెప్పలేదు… పూర్తిగా ఎవరికీ కనిపించకుండా పోయింది… శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది… కానీ ఆ వివరాల్ని అధికారికంగా వెల్లడించలేదు…
కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ నిర్మించే సినిమాపై మే నెల నుంచీ ఆ వార్తలు వస్తున్నాయి గానీ అడుగు ముందుకు పడలేదు… దానికి మావీరన్ అని పేరు కూడా ఫైనల్ చేశారు… ఇదీ పాన్ ఇండియా సినిమాయే… ఈ రెండు సినిమాలూ వర్కవుట్ అయితే సాయిపల్లవి పాపులారిటీ మరింత పెరగడం ఖాయం… రెండు సినిమాల్లోనూ రెండు డాన్స్ పాటల్ని పెట్టి, శేఖర్ మాస్టర్ లేదా ప్రభుదేవాతో కంపోజ్ చేయిస్తే, సినిమాల సంగతేమో గానీ ఆమె ఇమేజీ మాత్రం పెరగడం ఖాయం..!!
Share this Article