.
నిన్నటి సెప్టెంబరు 17 విమోచన అలియాస్ విముక్తి అలియాస్ విద్రోహ అలియాస్ ప్రజాపాలన అలియాస్ జాతీయ సమైక్యత… పేరు ఏదో ఒకటి… కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్, అక్కడక్కడా బీఆర్ఎస్ మమ అనిపించేశాయి… పాపం, మళ్లీ తెలంగాణలో సమైక్య దుష్పరిపాలన జెండాలు ఎగరేయాలని తహతహలాడే సోకాల్డ్ జనసేన, తెలుగుదేశం జాడాపత్తా లేవు, ఉండవు… అంత సోయి లేదు…
సరే, మజ్లిస్ ఆగ్రహానికి భయపడి పిరికిగా ఏవేవో పేర్లతో జెండాలు ఎగరేసే పార్టీలను వాటి ఖర్మానికి వదిలేస్తే, బీజేపీకి ఓ క్లియర్ స్టాండ్ ఉంది… ఎవరెవరో సోషల్ మీడియాలో రాస్తున్నారు, తెలంగాణ సాయుధపోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏముంది అని..? అంటే, ఈ విముక్తి దినాన్ని జరుపుకోవద్దా..? వాళ్లు తెలంగాణ పౌరులు కారా..?
Ads
పూర్తిగా ఇది లెఫ్ట్ పోరాటం అనడంలో కూడా అబద్ధం, అతిశయోక్తి ఉన్నాయి… విలీనం తరువాత కూడా పోరాటం సాగించారు కమ్యూనిస్టులు, ఓ లెఫ్ట్ సర్కారు కోసం… తరువాత దెబ్బలు తినీ తినీ రిట్రీట్ ప్రకటించారు…

స్వామి రామానందతీర్థ హయాంలో స్టేట్ కాంగ్రెస్, పండిట్ నరేంద్ర , వందేమాతరం రాంచంద్రరావు నాయకత్వంలో ఆర్యసమాజ్ సంస్థలు కూడా నిజాం దుష్పరిపాలన నుంచి విముక్తి పోరాటాన్ని సాగించాయనే ఎరుక, సోయి ఇప్పటి లెఫ్ట్, ఇతర నేతలకు లేదు పాపం… అలాగే హైదరాబాద్ స్టేట్ విముక్తిలో భాగంగా తెలంగాణ విమోచనం జరిగింది తప్ప ఇది తెలంగాణ సాయుధ, విముక్తి పోరాటాలు కావు… తేడా ఉంది.,. (సరే, భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట జరిగిన ద్రోహం నుంచి 2014లో పొందిన విముక్తి చరిత్రాత్మకం, అది వేరే కథ)…
అలాగే కాంగ్రెస్‌కు సంబంధం ఏముంది అని మరో శుష్క వాదన కూడా…! అసలు సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరిట విముక్తి, విలీనం సాధించిందే కాంగ్రెస్ ప్రభుత్వ జెండా కింద కదా..! సో, అవన్నీ వదిలేస్తే… నిన్న కొందరు ప్రముఖ నాయకులు గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర నివాళ్లు అర్పించారు… పర్లేదు, స్మరించుకోవాల్సిందే… కానీ..?

1947 తరువాత సాగిన తెలంగాణ విముక్తి పోరాటాలకూ… 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాలకూ తేడా ఉంది… గన్‌పార్క్ 1969 అమరవీరుల స్మారకస్థూపం అనుకుంటా… (Subject to Correction)… ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ మర్యాదలు తప్ప చరిత్ర పట్టదు… చలో గన్‌పార్క్ అంటారు, మిగతావాళ్లు గుడ్డిగా వెళ్లిపోతారు…
నిన్నటి దినం విమోచన దినం కదా, నిజం పాలన నుంచి విముక్తి కదా… మరి 1969 అమరుల దగ్గర నివాళ్లు ఏమిటి..? అర్పించకూడదని కాదు… అది ఆప్ట్ వేదిక ఎలా అవుతుందీ అని..!!
ఇక్కడే మరికొన్ని అంశాలూ చెప్పుకోవాలి… 2014కు ముందు జరిగిన పోరాటం, ఉద్యమంలో అమరులైన వారిని స్మరిస్తూ… సచివాలయం ఎదుట ఓ విశిష్ట నిర్మాణం చేయించాడు కేసీయార్… బిల్డింగ్ చూడటానికి బాగుంది… కానీ అందులో అమరుల పేర్లేవీ… 1969 తొలిదశ, 2014కు ముందు మలిదశ అమరుల పేర్లేవీ..? గాలికి వదిలేశాడు…
రేవంత్ రెడ్డి వచ్చాక ఏమైనా మార్పుందా..? జీరో..!!

నిన్నటి నివాళ్ల ప్రముఖులకు తెలియని మరో విశేషం చెప్పనా..? హైదరాబాదులోనే మరో అమరవీరుల స్థూపం ఉంది… ఇది సికింద్రాబాదులో ఉంటుంది… చాలామందికి ఇదొకటి ఉందనే తెలియదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని కూడా పట్టించుకోవాలి… అమరవీరుల స్మారకాల్ని నిర్లక్ష్యం చేయడం అంటే అవమానించడమే… కేసీయార్ పిరియడ్‌లో అవేవీ జరగలేదు, ఆ అన్యాయాన్ని ఈ ప్రభుత్వమే సరిదిద్దాలి…!!

Share this Article