అంతర్జాతీయంగా భారత్ దౌత్యం వలన పెను మార్పులు జరుగుతున్నాయి !
మూడు అంశాలని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉన్నది!
Ads
మొదటి సారిగా చైనా పాకిస్థాన్ ని వదిలించుకోవడానికి ప్రయత్నించే పనిలో పడ్డది !
అమెరికా కూడా పాకిస్థాన్ ని వదిలించుకునే దిశగా అడుగులు వేస్తున్నది !
భారత్ విషయంలో చైనా దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి !
అయితే ఇలాంటివి ఏవీ అంత తేలికగా వాటికవే జరిగిపోవట్లేదు ! భారత్ విదేశాంగ విధానం దౌత్యపరమయిన వ్యూహాలని చాలా చక్కగా ఒకదాని తరువాత ఇంకోకటిగా అమలుచేస్తూ రావడం వలన ఇవి సాధ్యమవుతున్నాయి !
*************************************************************
మొదటిది : చాలా కాలంగా పాకిస్థాన్ లో ఉన్న ‘అబ్దుల్ రెహమాన్ మక్కీ ‘ ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించాలి అంటూ భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టిన ప్రతిసారీ అమెరికా, రష్యాలతో సహా తాత్కాలిక సభ్య దేశాలు అనుకూలంగా వోటు వేస్తూ వస్తున్నా చైనా మాత్రం తనకి ఉన్న ‘వీటో ’ అధికారంతో తీర్మానం చెల్లుబాటు కాకుండా అడ్డుపడుతూ వచ్చింది!
*************************************************************
ఎవరీ అబ్దుల్ రెహమాన్ మక్కీ ?
26/11 ముంబై బాంబు దాడుల సూత్రధారి లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది ఈ అబ్దుల్ రెహమాన్ మక్కీ ! భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థాన్ నుండి ఆపరేషన్స్ ని నిర్వహిస్తూ ఉంటాడు. ఉగ్రవాద సంస్థలు అయిన లష్కరే తోయిబా మరియు జమాత్ ఉద్ దువ లకి నిధులు సమకూర్చడం మరియు యువకులని భారత్ వ్యతిరేకంగా శిక్షణ ఇచ్చి లష్కర్ మరియు జమాత్ ఉద్ దువా సంస్థలలో చేర్పించడం చేస్తున్నాడు. ముఖ్యంగా భారత్ లో దాడులు నిర్వహించేందుకు కావాల్సిన విధంగా యువకులని ప్రేరేపిస్తున్నాడు. అమెరికా రెండేళ్ల క్రితమే మక్కీ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
గత సంవత్సరం UN భద్రతా మండలిలో అమెరికా మరియు భారత్ లు కలిసి అబ్దుల్ రెహమాన్ మక్కీ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేందుకు గాను తీర్మానం ప్రవేశపెట్టగా చైనా తనకి ఉన్న వీటో హక్కుతో ఆ తీర్మానాన్ని తొక్కి పట్టి [Hold] ఉంచింది. అయితే గత సోమవారం రోజున చైనా అబ్దుల్ రెహమాన్ మక్కీ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించే తీర్మానానికి మద్దతు తెలిపింది ! So ! ఇక నుండి మక్కీ కి విదేశాల నుండి డాలర్ రూపంలో ఎలాంటి విరాళాలు అందవు. పాకిస్థాన్ దాటి ఎక్కడికీ వెళ్లలేడు. వీలు కుదిరితే అమెరికా తన డ్రోన్ల ద్వారా ఏ క్షణంలో అయినా దాడి చేసి చంపేయవచ్చు !
గత సంవత్సరానికి ఇప్పటికీ చైనాలో వచ్చిన మార్పు కి కారణం ఏమిటీ ?
చైనాకి పాకిస్థాన్ లో ఉన్న ఒకే ఒక్క ప్రయోజనం అది CPEC లో భాగంగా జింజియాంగ్ ప్రావిన్స్ నుండి కారకోరం కారిడార్ ద్వారా గ్వాదర్ పోర్ట్ వరకు ఉన్న రోడ్డు మార్గం మాత్రమే ! ఇక CPEC లో భాగంగా విద్యుత్ ప్రాజెక్ట్ లు మరియు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాంటివి మధ్యలోనే ఆపేసింది పూర్తి కాకుండా ! చైనా కి చెందిన ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు పాకిస్థాన్ లోని వివిధ ప్రాజెక్ట్ లని నిర్మిస్తున్నాయి కానీ చాలా కాలంగా వాటికి చెల్లింపులు చేయలేకపోతున్నది పాకిస్థాన్ ! ఇప్పట్లో పాకిస్థాన్ చెల్లింపులు చేయలేదు కాబట్టి ఇప్పటివరకు తనకి రావలసిన డబ్బుని రాబట్టుకునే వరకు ఎలాంటి పనులు చెయ్యవు చైనా సంస్థలు. తనకి కట్టాల్సిన డబ్బులు కట్టకపోగా మళ్ళీ 2 బిలియన్ డాలర్ల ఋణం కోసం పాకిస్థాన్ అభ్యర్ధిస్తున్నది ! తనకి లాభం ఉంటుంది అని భావిస్తే తప్పితే చైనా అప్పులు ఇవ్వదు కాబట్టి పాకిస్థాన్ తో పెద్దగా పని లేదు !
***********************************************************
చైనాలో 70% జనాభా కోవిడ్ వల్ల తీవ్ర బాధలు పడుతున్నారు. బల్క్ డ్రగ్స్ తయారీలో చైనా ముందు ఉంది కానీ కోవిడ్ వల్ల ఉత్పత్తి దెబ్బతిన్నది కాబట్టి ఇప్పట్లో తనకి కావాల్సిన మందులని తయారుచేసుకునే స్థితిలో లేదు. వారం క్రితం భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తూ చైనా అడిగితే అత్యవసర మందులని సప్లై చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉంది అనడమే కాదు చైనాలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న భారతీయ ఔషధాల ఉత్పత్తిని పెంచమని ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మార్చ్ నెలకి చైనా లో కోవిడ్ అనేది చాలా తీవ్ర రూపం దాల్చవచ్చని WHO ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇప్పట్లో భారత్ తో పెట్టుకుంటే తనకే నష్టం అని చైనా గ్రహించింది కాబట్టే మక్కీ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి ఒప్పుకుంది.
మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ లోని లిథియం గనుల తవ్వకం…. దాని నుండి వచ్చే లిథియం వాడుకోవడానికి ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అది ఆచరణలోకి రావాలంటే పాకిస్థాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు మొగ్గు చూపాల్సిన స్థితి చైనాకి ఉంది. కాబూల్ హోటల్ లో ఉన్న చైనా వాళ్ళ మీద బాంబు దాడి విషయంలో చైనాకి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర గ్రూపుల హస్తం ఉందని అనుమానిస్తున్నది.
****************************************************************
అమెరికన్ సెనేటర్ ఆండీ బిగ్స్ [Andy Biggs] పాకిస్థాన్ కి వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టాడు ! అమెరికా ఇప్పటి వరకు నాటో దేశాలకి అవతల ఉన్న ముఖ్యమయిన స్నేహితుడు [To terminate the designation of the Islamic Republic of Pakistan as a major non-NATO ally, and for other purposes] అనే హోదాని రద్దు చేయాలి అంటూ బిల్లుని ప్రవేశపెట్టాడు ఈ జనవరి 9న. ఇది అసలే ఆర్ధిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కి పుండు మీద కారం చల్లడం లాంటిదే !
దీనివలన ఇప్పటి వరకు పాకిస్థాన్ కి లభిస్తున్న రక్షణ రంగ సప్లైస్, మెటీరీయల్ మీద రుణాలు, అమెరికా పాకిస్థాన్ దేశాల రక్షణ రంగ సంయుక్త భాగ్యస్వామ్యంతో డిఫెన్స్ రీసర్చ్ & డెవలప్మెంట్ సహకారం ఉండదు. ఇప్పటికే పాకిస్థాన్ తన F-16 లకి కావాల్సిన విడి భాగాలని ఇండెంట్ పెట్టింది అమెరికన్ సంస్థలకి, వాటికి ఆమోదం కూడా లభించింది. వీటికి అవసరం అయిన డబ్బు ఋణం రూపంలో లభిస్తుంది కానీ బిల్ కి ఆమోదం లభిస్తే ఇది ఆగిపోతుంది…
Share this Article