మన తెలుగింటి పెళ్లి ఆచారాలు గంగలో కలిసిపోయినా సరే… మనం నార్త్ సంప్రదాయాాల్ని నెత్తిన పెట్టుకుంటాం… ‘‘మొన్న మా బిడ్డ పెళ్లిలో మెహందీ ఫంక్షన్ అదరగొట్టాం తెలుసా..? 5, 6 లక్షల ఖర్చు, పోతేపోయింది, మళ్లీ మళ్లీ చేసుకుంటామా ఏం..?’’ అని ఘనంగా చెబుతుంటుంది ఓ నడమంత్రపు సిరి… ‘‘అదేముందిలే ఒదినా, సంగీత్ చేశాం మా కొడుకు పెళ్లికి… భోజనాలు, మందు, డాన్సులు, కానుకలకు 10 లక్షల ఖర్చు… అంతేలే, నువ్వన్నట్టు ఖర్చు పోతేపోయింది, మళ్లీ మళ్లీ చేసుకుంటామా..?’’ అని కంటిమెరుపులతో బదులిస్తుంది ఆ ఒదిన… పెళ్లి, రిసెప్షన్ సరేసరి…
ఈ దిక్కుమాలిన సంప్రదాయలకు డబ్బు లేక, అప్పులు పుట్టక ఆత్మహత్య చేసుకుంటాడు ఓ సగటు మధ్యతరగతి పరువు కుటుంబరావు… మళ్లీ మళ్లీ రాని చావు… ఇలాంటి వాతలు పెట్టుకునే అట్టహాసులు ఇంకా స్టార్ట్ చేయలేదు… రానా, మిహికా బజాజ్ పెళ్లికి ముందు రోకా అనే ఫంక్షన్ జరుగుతుంది… అటూఇటూ ముఖ్యమైనవాళ్లు వస్తారు… కానుకలు పెట్టుకుంటారు, కలిసి భోంచేస్తారు, ఓ గెట్ టుగెదర్… ఇందులో సందన, పటాటోప ప్రదర్శన ఉండదు కాబట్టి, అది లేకపోతే ఇక పెళ్లి తంతు దేనికి అనే చెత్తా భావనలు మనల్ని ఎప్పుడో ముంచేశాయి కాబట్టి ఇంకా దాన్ని స్టార్ట్ చేయనట్టున్నారు…
Ads
ఇలాంటి వాళ్లకు మరో సంప్రదాయం చెప్పాలి ఓసారి… పైగా ఇటీవలే ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది… పక్కా గుజరాతీ సంప్రదాయం… మనకు కావల్సింది ఉత్తర సంప్రదాయాలే… (ఇందులో ఏదో అపశకునం ధ్వనిస్తోంది…) పోనీ… ఉత్తరాది సంప్రదాయాలు… ఇది పురాతన సంప్రదాయం… పేర గోల్ ధన… ముఖ్యమైనవాళ్లతో నిర్వహిస్తారు… వరుడి కుటుంబం వధువు ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తారు… బహుమతులు తీసుకుని తరలి రాగానే హారతులిచ్చి స్వాగతిస్తారు… గోల్ అంటే బెల్లం, ధన అంటే ధనియాలు… వాటితో చేసిన ముద్దలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు… తరువాత షాగున్ అని చిన్నమొత్తాల నగదు బహుమానాలు కూడా ఉంటాయి… ఆ తరువాత వధూవరులు రింగులు మార్చుకుంటారు… పెద్ద ఆశీస్సుు తీసుకున్నాక ఛునారి విధి అనే మరో చిన్న తంతు ఉంటుంది… వరుడి తరఫు నుంచి వధువుకు చునారి ఇవ్వడం… అంటే దుపట్టా… అంటే పెళ్లికి అనుమతి ఇవ్వడం… ఆ తరువాత లగ్నపత్రిక చదువుతారు…
ఈ తంతుల సందర్భంగా ముఖేష్ అంబానీ భార్య నీతూ స్వయంగా డాన్స్ చేసి అందరినీ ఆనందపరిచింది… తను ట్రెయిన్డ్ డాన్సర్… అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే తన స్నేహితురాలి పేరు రాధిక మర్చెంట్… ఈ ఫంక్షన్ ఫోటోలు చూస్తుంటే గ్లేరింగుగా కనిపించేది అనంత్ ఆకారం… అంతటి స్థూలకాయం అందమైన రాధిక పక్కన అదోలా కనిపించింది… ఎన్ని వేల కోట్లు డబ్బుంటే ఏముంది…? అన్నీ డబ్బుతో కొనలేం కదా అనిపించింది…
నిజానికి 208 కిలోలున్న అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన వైనం అప్పట్లో వైరల్… రోజూ ఏడెనిమిది కిలోమీటర్ల నడక, కీటో డైట్, ప్రత్యేకంగా శిక్షకులు, పళ్లరసాలు, ప్రొటీన్ ఫుడ్, నో కార్బ్స్, లెక్క ప్రకారం రోజూ 1000 కిలోకాలరీలు దాటని ఆహారం… కానీ ఏమైంది..? మళ్లీ మొదటికి వచ్చింది… మునుపటి అనంతుడే కనిపిస్తున్నాడు… ఏవో పద్ధతుల్లో కష్టపడి, బరువు తగ్గడం కాదు, దాన్నలాగే మెయింటెయిన్ చేయడమే ఇంకా కష్టమనే నిజాన్ని అనంతుడి రూపం మనకు చెబుతుంది…
నా కొడుక్కి ఆస్త్మా, హైడోస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రభావం, అవి మావాడికి పడటం లేదు అని చెబుతుంది నీతూ… సరే, అది కాకపోతే మరో అనారోగ్యం కావచ్చుగాక… ప్రపంచంలో ఏ మూల ఎన్ని కోట్ల ఫీజు ఇచ్చయినా సరే, తీసుకొచ్చి చికిత్స చేయించగల అంబానీకి, టాప్ టెన్ ధనికుల్లో ఒకడైన అంబానీకి, నిలబెట్టి ప్రభుత్వాలను కొనేయగలిగిన అంబానీకి… కొడుకు రూపం ఓ సవాల్… ఏమీ చేయలేడు, చేయలేకపోయాడు… దాన్నే విధి అంటారు…!!
Share this Article