Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం కన్నప్ప… ఇంకా ఫాఫం రజినీకాంత్… పూర్ టీవీ రేటింగ్స్…

October 30, 2025 by M S R

.

కన్నప్ప మీద రిలీజ్ మొదట్లో బాగా హైప్ వచ్చింది, హమ్మయ్య, ఇక ఇది సక్సెసయినట్టే అనుకున్నారు అందరూ… ప్రభాస్ పుణ్యమాని సినిమాకు కాస్త మంచి పేరు, ఐమీన్, మంచి మౌత్ టాక్ వచ్చినట్టే అనుకున్నారు…

తీరా చూస్తే ఏమైంది..? మనం ముందు నుంచీ చెప్పుకుంటున్నట్టే…. కథను మరీ ఓవర్ క్రియేటివిటీతో మరీ కేజీఎఫ్, బాహుబలి తరహాలో పొల్యూట్ చేశారు… కన్నప్ప కథ వేరు, దానికి ఆధ్యాత్మిక ఫ్లేవర్ కావాలి… నానా భాషల స్టార్లతో సంకరంతో కథ వక్రమార్గం పట్టి, అందరినీ అకామిడేట్ చేయలేక, సోకాల్డ్ కమర్షియల్ వాల్యూస్ పేరిట హీరోయిన్‌ను అసభ్యంగా చూపి.,. మొత్తానికి జనం దాదాపు తిరస్కరించారు…

Ads

ఇది రియాలిటీ… ఓటీటీలో దాని నడక ఏమిటో తెలియదు, ఏ ఓటీటీ వాడూ ఏదీ చెప్పిచావడు… కానీ టీవీ ప్రీమియర్లు నిజం చెబుతాయి కదా… 19న జెమినిలో వేశారు… ఆ చానెల్ అసలు ఎవడూ ట్యూన్ చేయడు… రీచ్ మరీ ఘోరం… దానికి తోడు కన్నప్ప మీద క్రమేపీ పెరిగిన నెగెటివిటీ కూడా తోడై… మరీ ఘోరంగా 3.90 రేటింగ్స్ నమోదయ్యాయి… ఓ సాదాసీదా నాసిరకం టీవీ సీరియల్ ఇంకా బెటర్…

సరే, ది గ్రేట్ రజినీకాంత్ తీసిన కూలీ సినిమా సంగతి..? అదీ ఘోరమే… అదీ జెమినీలోనే వేశారు… అదీ 19 తేదీనే… పొద్దున కన్నప్ప, సాయంత్రం కూలీ… ఆ డబ్బింగ్ సినిమాను థియేటర్లలో ఎవడూ చూసి ఉండడు కదా… ఒకరో ఇద్దరో టీవీల్లో చూసినట్టున్నారు… అందుకే కన్నప్పకన్నా కాస్త పైన, అంటే 5.43 రేటింగ్స్… జెమినీకి, ప్రస్తుత రజినీకి అది కాస్త ఎక్కువే…

సరే, బిగ్‌బాస్‌కు వద్దాం… సుదీర్ఘంగా గంటల తరబడీ దీపావళి స్పెషల్ అని ఓ షో నడిపించారు కదా… కాస్త నయం… 7.08 రేటింగ్స్ వచ్చాయి… పర్లేదు, ప్రస్తుతం నిరాసక్తంగా, నిస్సారంగా సాగుతున్న ఆ షో ప్రస్తుత పాపులారిటీతో పోలిస్తే కాస్త నయమే… ఓవరాల్ టీవీ ఈ వీక్ రేటింగుల్లో కనీసం టాప్ 30 లో కూడా లేకుండా పోయింది… ఈ షోకు ముందు శనివారం షోకు 6 రేటింగ్స్… మాధురి, రీతూ, రమ్య ఎట్సెట్రా కేరక్టర్లతో ఈ షో ఇంకెక్కడికో రేటింగుల్లో దిగజారుతుందీ అనుకుంటే… ఈ రేటింగ్స్ పర్లేదు, షోకు కాస్త ఊపిరి పోసినట్టే…

టీవీ సీరియల్స్ అంటారా..? అసలు స్టార్ మా, అందులోనూ దాన్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల కార్తీకదీపం నిర్మాత… ఇంకెవరు టాప్ వన్… ఖచ్చితంగా ఆ సీరియలే… అవును, అదే ఈసారి కూడా నంబర్ వన్ అదే… మిగతా వాటి గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రానా, దుల్కర్‌కు షాక్..! లీగల్ చిక్కుల్లో తమిళ తొలి సూపర్ స్టార్ బయోపిక్..!
  • పాటలో భళా… మాటలో భోళా… నాకు కనెక్టయిన అద్వైతి అందెశ్రీ …
  • అందెశ్రీ ఎవరినీ ఎప్పుడూ శపించలేదు… ‘మనిషిని అన్వేషించాడు’…
  • ఒక్కడు..! ఆ చార్మినార్ సెట్, దాని చుట్టూ ఓ కథ… ఓ దర్శకుడి తపన..!
  • కల్తీ నెయ్యి కాదు… అసలు నెయ్యే కాదట… భారీ అపచారం కథ…
  • ‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!
  • శ్రావ్యమైన ఈ గొంతు… 3800 పసి గుండెల శృ‌తి సరిచేసింది..! ను
  • అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!
  • …. అందుకే రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులకూ నచ్చుతాడు కొన్నిసార్లు..!!
  • బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లి మీద కోపం వస్తుంది మొదట… కానీ..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions