Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!

January 28, 2023 by M S R

వివేక్ అగ్నిహోత్రి… ఈ పేరు వినగానే మనకు ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు గుర్తొస్తాయి… మరీ ప్రత్యేకంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు… ఈ సినిమాతో తనపై జాతీయవాది, కాషాయవాది ముద్రలు చకచకా పడిపోయాయి… తను బీజేపీ ప్రయోజనాల కోసమే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడనేది తనపై ఉన్న ఛార్జ్ ఇప్పుడు…

దర్శకుడు, రచయిత, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఫిలిమ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు (సీబీఎఫ్సీ) సభ్యుడు… ఇండియన్ కల్చర్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌ (ఐసీసీఆర్)లో ఇండియన్ సినిమాకు సాంస్కృతిక ప్రతినిధి… అధికార పదవుల్లో ఉన్నాడు, అధికార పార్టీకి కావల్సినవాడు… ఇప్పుడు వేక్సిన్ వార్ అనే సినిమా తీస్తున్నాడు… అంతేకాదు, ది ఢిల్లీ ఫైల్స్ అనే మరో సినిమాను కూడా ప్రకటించాడు… డౌటేముంది..? అవి రెండూ కాషాయ శిబిరం ఆలోచనలకు తగినట్టుగా ఉండబోతున్నాయి…

vivek

Ads

ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుడుతున్నాడు… రిపబ్లిక్ డే నాడు ప్రకటించాడు… అయిదుగురు జాతీయ అవార్డు గ్రహీతలైన దర్శకులతో ఓ సినిమా చేయబోతున్నాడు… వాళ్లు ఎవరంటే..? ప్రియదర్శన్, చంద్రప్రకాష్ ద్వివేదీ, జాన్ మెథ్యూ మథన్, మజు బొహరా, సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్… ప్లస్ వివేక్ అగ్నిహోత్రి సరేసరి… అంటే ఆరుగురు మెగా దర్శకులు అన్నమాట… ఇంట్రస్టింగ్…  సినిమా పేరు ‘వన్ నేషన్’…


Six National Award winners will tell the untold tales of India’s unsung heroes who dedicated their lives for 100 years to keep India as #OneNation.

Priyadarshan
Vivek Ranjan Agnihotri
Dr Chandra Prakash Dwivedi
John Methew Mathan
Maju Bohara
Sanjay Puran Singh Chauhan pic.twitter.com/tAC2SO151l

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 26, 2023


ఈ దేశాన్ని ‘వన్ నేషన్’గా ఉంచడానికి 100 ఏళ్లుగా కష్టపడిన హీరోల గురించి చెబుతారట… అన్ సంగ్ హీరోస్… అంటే ఇప్పటివరకూ బహుళ ప్రాచుర్యంలోకి రాని వ్యక్తులు… ఈ సినిమాకు నిర్మాతలు ఇందూరి విష్ణువర్ధన్, హితేష్ థక్కర్… ఇప్పుడు వివేక్ వేక్సిన్ వార్ సినిమాలో బిజీగా ఉన్నాడు… అందులో తన భార్య, నటి పల్లవీజోషి, అనుపమ్ ఖేర్ నటిస్తారు… వాళ్లిద్దరూ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు… వీళ్లకు తోడుగా కాంతార హీరోయిన్ సప్తమి గౌడ కూడా నటించబోతోంది… వేక్సిన్ వార్ సినిమా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కష్టపడిన శాస్త్రవేత్తల గురించిన స్టోరీ… ది ఢిల్లీ ఫైల్స్ రాజధానిలో అల్లర్ల గురించిన స్టోరీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions