రజినీకాంత్‌కు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా అనుమతి లేకుండా, నాకు డబ్బు ఇవ్వకుండా నా పేరు వాడుకుని కమర్షియల్ ప్రచారాలు చేసుకుంటారా..? ఎంత ధైర్యం..? అంటూ ఊగిపోయాడు… బులావ్ లాయర్… తక్షణం లాయర్ సుబ్బయ్య ఎలంబర్తి ఆయన దగ్గర వాలిపోయాడు…
ముందుగా పబ్లిక్ నోటీస్ ఇద్దాం సార్ మీ పేరిట… తరువాత వినకపోతే పర్టిక్యులర్ వ్యక్తులు, సంస్థల మీద యాక్షన్ తీసుకుందాం అన్నాడు లాయర్… సరేలే అన్నాడు రజినీకాంత్… ఇంకేముంది..? ఓ జనరల్ పబ్లిక్ నోటీసు జారీ చేశారు… అయితే తను ఈ చర్య తీసుకోవడం వెనుక ఏం జరిగింది..?
నిజంగా సినిమా నటుల పేర్లు, ఫోటోలు, సినిమాల్లో డైలాగులు వాడుకోవద్దంటే… ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్‌లో 80 శాతం కనిపించవు… ప్రత్యేకించి బ్రహ్మానందం గనుక ఇలాంటి నోటీసు జారీ చేస్తే తెలుగులో ఒక్క మీమ్ కనిపించదు… కార్టూన్లు, విమర్శలు, పంచులు, మీమ్స్ గట్రా అన్నింటికీ బ్రహ్మానందం మొహం, వాయిస్ ముడిసరుకులు… నిజానికి అది తన పాపులారిటీ… తన మొహం కనిపిస్తేనే జనం చూస్తారు…
Ads
ఐనా కేసులు పెడతాం, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టేసి లోపల వేయించేస్తాం అని బెదిరిస్తే సోషల్ మీడియాను కంట్రోల్ చేయగలమా ఈ రోజుల్లో..? మంచు విష్ణు బోలెడు మందికి నోటీసులు పంపించాడు… ఎంతమందిపై యాక్షన్ మొదలైంది… టీవీ యాంకర్ ఆంటీ, కేరక్టర్ ఆర్టిస్టు హేమ తదితరులు గుర్రుమన్నారు, కొన్ని వందల మంది మీద ఇలాంటి బెదిరింపులే చేసింది ఆంటీ… ఏం జరిగింది..?
సో, నా పేరు వాడుతున్నారు, ఫోటోలు వాడుతున్నారు, నాకు డ్యామేజీ జరుగుతోంది అని ఎవరైనా మొత్తుకున్నా సరే, పెద్దగా ఫలితం ఉంటుందని అనుకోలేం… సైబర్ క్రైమ్ విభాగానికి రోజూ బోలెడు సీరియస్ కేసులొస్తున్నయ్, పనిభారం పెరుగుతోంది… ఈ చిల్లర కేసుల్ని పట్టుకుని వాళ్లేం చేయగలరు..? ఇంతకీ రజినీకాంత్ ఎందుకింత ఆగ్రహానికి గురయ్యాడు… ఒక ట్వీట్ చూద్దాం, వాళ్ల లాయర్ పెట్టిందే…
Here is the Public Notice on behalf of Mr. Rajinikanth @rajinikanth @jswsteel @THChennai @SunTV @dinamalarweb @timesofindia @dailythanthi @news7tamil @polimer88 @PTTVOnlineNews @IndianExpress pic.twitter.com/IC3Ht0o7dJ
— elambharathi subbiah (@bhara123) January 28, 2023
ట్యాగ్ చేయబడినవాళ్లలో పలు పత్రికలు, మీడియా సంస్థల పేర్లతోపాటు జేఎస్‌డబ్ల్యూస్టీల్ పేరు కూడా ఉంది… బహుశా వాళ్లు రజినీ పేరుతో ఈ మీడియా సంస్థలకు ఏదైనా కమర్షియల్ యాడ్ ఇచ్చారేమో… నాకు డబ్బు ఇవ్వకుండా ఇలా నా పేరు వాడుకోవడం ఏమిటి అని రజినీకి కోపం వచ్చినట్టుంది… అంతకుమించి పెద్దగా ఊహించడానికి ఏమీలేదు…
సినిమా నటులు, సెలబ్రిటీలు తమ పేర్లు, ఫోటోలు వాడుకోవడానికి డబ్బు తీసుకుంటారు కదా… అసలు చాలామంది నటుల రెవిన్యూ ఈ కమర్షియల్స్‌లో నటించడమే… అందుకే ‘‘ఏ ప్లాట్ ఫారమైనా సరే, ఏ సంస్థయినా సరే, నా క్లయింట్ ఫోటో, పేరు, వాయిస్, కేరికేచర్, కార్టూన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా జనరేట్ చేసిన చిత్రాలను వాడుకుంటే క్రిమినల్, సివిల్ కేసులు పెట్టాల్సి వస్తుంది… ఇవన్నీ మా కస్టమర్ ఇమేజీని దెబ్బతీస్తున్నాయి…’’ అని రజినీ లాయర్ ఓ తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు…
ఈ వార్త ఎలా ఉన్నా సరే, లాయర్ నోటీసులో ఒక వాక్యం మాత్రం భలే నవ్వు పుట్టించింది… ‘‘మా కస్టమర్ సూపర్ స్టార్‌గా లక్షల మందితో పిలవబడతాడు… ఆ పాపులారిటీని కొందరు వాడుకుంటున్నారు, తద్వారా తన ఇమేజీకి నష్టం వాటిల్లుతోంది… తనకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది, అందుకని పర్సనాలిటీ/ పబ్లిసిటీ /సెలబ్రిటీ రైట్స్ అనగా హక్కులకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదు…’’ ఇదుగో ఇక్కడ నవ్వొచ్చింది… సెలబ్రిటీలకు ఇలాంటి హక్కులున్నాయా..? ఏ చట్టం, ఏ ఆర్టికల్, ఏ సెక్షన్ సోదరా..? దేశంలో సెలబ్రిటీలు అని ప్రత్యేకంగా ఓ సామాజికవర్గం ఉందా..?
ఈ నోటీసేదో ఆ స్టీల్ కంపెనీ వాడికే ఇవ్వొచ్చుగా… సదరు మీడియా సంస్థలకు ఇవ్వొచ్చుగా… అదెందుకు చేతకాదు..? జనరల్ నోటీసు దేనికి..? యాడ్స్‌లో తన పేరు, తన గొంతు, తన డైలాగులు, తన వీడియోలు, తన మొహం వాడితే అనైతికమే… అదేదో టార్గెటెడ్‌గా పోరాడొచ్చు కదా…! ఈ డొంక తిరుగుళ్లు దేనికి సూపర్ స్టార్..?!
Share this Article