Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళంలో ధోని సినిమా… చెన్నై రుణం ఇలా తీర్చుకుంటాడట…

January 30, 2023 by M S R

ఆహా… ఏం వార్త..? సూపర్… గెలుపు, ఓటమి, ఆనందం, విషాదం… ఉద్వేగం ఏదైనా సరే, ఏమాత్రం చలనం కనిపించని ధోని ఏకంగా ఓ సినిమాలో నటించబోతున్నాడు… అదీ హిందీలో కాదండోయ్… తమిళంలో…! ఒక రాతి బొమ్మ నటించగలదా అని సందేహించకండి… ప్రొడ్యూసర్ కూడా తనే… పర్లేదు, లాభం నష్టం తరువాత చూసుకుందాం… చెన్నై రుణం తీర్చుకోకపోతే ఎలా మరి..? చెన్నై సూపర్ కింగ్స్ పేరిట కోట్లకుకోట్లు సంపాదించాడు కదా…

తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి… లేకపోతే లావైపోతాడు కదా మరి… పైగా చెన్నై నా రెండో ఇల్లు అంటుంటాడు కదా… ఆ సినిమా పేరు కూడా ప్రకటించేశారు… సహజంగానే ధోని అంటే పాన్ ఇండియా క్రికెటర్ కదా… ఈ సినిమాను కూడా తొలుత తమిళంలోనే తీసినా సరే, తరువాత మిగతా భాషల్లోకి డబ్ చేసేస్తారని ఊహించగలరుగా…

అక్టోబరు 2022 నుంచీ ధోని నిర్ణయం తీసుకున్నాడు… కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని… ఎట్టకేలకు 27 జనవరిన టైటిల్, తారాగణం వివరాలు చెప్పేశాడు…

Ads

ధోనీ తీసే సినిమా పేరు ‘Let’s get Married’… మనం పెళ్లి చేసుకుందాం అని తెలుగులోకి వస్తుందేమో… టైటిల్ బాగుంది… ఏదో మోషన్ పిక్చర్ కూడా రిలీజ్ చేశారు… బాలీవుడ్ హంగామా మీడియా కథనం ప్రకారం… ఈ సినిమాలో హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కూడా నటించనున్నారు…


DHONI ENTERTAINMENT FORAYS INTO MAINSTREAM FILM PRODUCTION WITH A TAMIL FILM ✨#DHONIENTERTAINMENT #TAMILCINEMA @SAAKSHISRAWAT @MSDHONI @RAMESHARCHI @PRIYANSHUCHOPRA @HASIJAVIKAS PIC.TWITTER.COM/LIVMKBEVVC

— DHONI ENTERTAINMENT PVT LTD (@DHONILTD) OCTOBER 25, 2022


 

STARTING OFF ON A POSITIVE NOTE – HERE IS THE FULL PUJA VIDEO OF DHONI ENTERTAINMENT’S TAMIL FILM #LGM! HTTPS://T.CO/1CWG69JPKZ@MSDHONI @SAAKSHISRAWAT @IAMHARISHKALYAN @I__IVANA_ @ACTRESSNADIYA @IYOGIBABU @RJVIJAYOFFICIAL @RAMESHARCHI PIC.TWITTER.COM/AGDFLWXILS

— DHONI ENTERTAINMENT PVT LTD (@DHONILTD) JANUARY 29, 2023


dhoni

ఈ సినిమాకు తమిళమణి రమేష్ దర్శకుడు… తనకు ఇదే తొలి సినిమా… త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట… నదియా, యోగిబాబు కీలకపాత్రలు అని సమాచారం… మ్యూజిక్ విశ్వజిత్, ఎడిటర్ ప్రదీప్ రాఘవ్… మరి ధోని హీరోగా సెట్ అవుతాడా..? ఏమో… తను నటించకపోవచ్చునని కూడా అంటున్నారు… హమ్మయ్య… పాన్ ఇండియా ప్రేక్షకులను బతికించారు… కేవలం నిర్మాతగా అంటారా..? వోకే, వెల్కమ్ ధోనీ… కమాన్ కుమ్మేసెయ్…


PICTURES FROM THE PUJA OF DHONI ENTERTAINMENT’S FIRST PRODUCTION IN TAMIL – #LGM WHICH TOOK PLACE TODAY MORNING.@MSDHONI @SAAKSHISRAWAT @ACTRESSNADIYA @IAMHARISHKALYAN @I__IVANA_ @RAMESHARCHI PIC.TWITTER.COM/QTMKOUGHYW

— DHONI ENTERTAINMENT PVT LTD (@DHONILTD) JANUARY 27, 2023


అవునూ, చెన్నై రుణం తీర్చుకోవడం కోసం సినిమాలే తీయాలా..? అదీ డబ్బులు సంపాదించే యావే కదా… మరి ఈ పోచుకోలు బిల్డప్పులు దేనికి..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions