పార్ధసారధి పోట్లూరి……… గౌతమ్ ఆదానీ Vs హిండెన్బర్గ్ ! పార్ట్ -03…. గౌతమ్ ఆదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో ప్రధానంగా ఓడ రేవుల [Ports] మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. అలా అని ఇతర వ్యాపారాల మీద దృష్టిపెట్టలేదు అని కాదు కానీ పోర్ట్స్ ని స్వంతం చేసుకోవడం లేదా ఆయా దేశాలతో కలిసి భాగస్వామ్య ఒప్పందం చేసుకొని జాయింట్ వెంచర్ కింద కలిసి పోర్ట్స్ ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టగానే చైనా కి అనుమానాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ దేశంలోని హైఫా నగరంలో ఉన్న ప్రధాన ఓడరేవు ని ఆపరేట్ చేయడానికి గాను ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకొని హైఫా పోర్ట్ ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టగానే ఆదానీ [భారత్ – మోడీ ఫాక్టర్ ] ఉద్దేశ్యం ఏమిటో గ్రహించింది చైనా.
ఇక్కడ చైనాకి ఉన్న అనుమానాలు ఏమిటంటే భవిష్యత్తులో తన చుట్టూ ఉన్న దేశాలలో వేటిలో అయినా పోర్ట్ లని స్వాధీనం చేసుకొని లేదా జాయింట్ వెంచర్ గా ఆపరేట్ చేయడం ప్రారంభిస్తే అది చైనాకి నష్టాన్ని కలుగుచేస్తుంది. చాలా ముందు చూపుతో శ్రీలంక లోని హంబన్ తోట పోర్ట్ నిర్మించడానికి అప్పు ఇచ్చి అది తీర్చలేకపోవడం వలన 99 సంవత్సరాలు లీజుకి తీసుకొని తన అధీనంలోకి తీసుకొని పరోక్షంగా భారత్ మీద గూఢచర్యం చేయడానికి వాడుకుంటున్న సంగతి తెలిసిందే. తాను ఏదయితే చేసిందో, చేస్తున్నదో భారత్ కూడా అదే చేయడం చైనాకి కంటగింపుగా మారింది.
అందరూ అనుకుంటున్నట్లు CIA కాదు హిండెన్బర్గ్ వెనక ఉన్నది ! చైనా ఫండింగ్ చేస్తున్నది హిండెన్బర్గ్ కి ! అలా అని పశ్చిమ దేశాలకి మన దేశం మీద సానుభూతి ఉన్నది అనుకోవడానికి వీలు లేదు. అమెరికాతో పాటు ఇతర ఐరోపా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న వేళ అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి రేట్ ని 5.6 %గా ఆంచనా వేస్తున్నాయి కానీ ఆరు నెలల క్రితం ఇది 7.8 % గా లెక్క కట్టాయి, కానీ ఇప్పటికీ అమెరికా, చైనా, యూరోపు దేశాల కంటే మెరుగయిన వృద్ధి రేటుని సూచించడం మాత్రం తట్టుకోలేకపోతున్నాయి.
Ads
గత చరిత్ర చూస్తే ఐరోపా దేశాలు ఇతర దేశాల మీద ఆక్రమణలకి దిగలేదు. కేవలం వ్యాపారం పేరుతో ఆయా దేశాలకి వెళ్ళి క్రమంగా అక్కడి వ్యాపారాన్ని దెబ్బతీసి తమ ప్రయోజనాలకి అనుగుణంగా పరోక్షంగా ఆధిపత్యం వహిస్తూ వచ్చాయి.
******************************************
రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ! భారత్ పాత్ర !
అమెరికాతో పాటు నాటో దేశాలు రష్యా మీద తాము చేస్తున్న పోరాటం మీద భారత్ మద్దతు ఇస్తుంది అని ఆశించి భంగపడ్డాయి ! ఒక రకంగా అది తాత్కాలికమే అయినా ఈ దేశాలు రష్యా మీద కోపంతో [తమ ప్రయోజనాలని రష్యా అడ్డుకుంటున్నది ఉక్రెయిన్ లో ] ఇంధన సమస్యని కొనుక్కున్నాయి [purchased problems ]. దాంతో సహజంగానే ఇంధనం కొరత వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు తగ్గిపోయింది ! కానీ భారత్ మాత్రం ఇంధనం యధావిధిగా రష్యా నుండి కొంటూ ఇంధనం ధరలు పెరగకుండా జాగ్రత్త పడింది! కోవిడ్ ఫ్యాక్టర్ కి తోడు రష్యా ఉక్రెయిన్ కన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మందగమనానికి దారి తీసింది కానీ ఆ ఎఫెక్ట్ భారత్ మీద పడలేదు, అలా అని పూర్తిగా ఎఫెక్ట్ పడలేదు అని చెప్పలేము కానీ కోవిడ్ కి ముందు 2022 కి గాను భారత్ వృద్ధి రేటు 9.6% గా లెక్కకట్టాయి అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు. ఈ వృద్ధి రేటు అన్ని దేశాలకంటే ఎక్కువే కానీ కోవిడ్ వల్ల అది జరగలేదు.
**************************************
ఏదీ ఒక్కరోజులో జరిగిపొదు కదా ? ఏదన్నా జరగడానికి ముందు పడే ఒక్క అడుగు తరువాతి కాలంలో అది లక్షల అడుగుల ముందుకి దారి చూపిస్తుంది ! సరిగ్గా భారత్ పరిస్థితి ఆ ఒక్క అడుగు దశలో ఉంది ! దీనిని ఎలాగయినా అడ్డుకుంటే ఆ ఒక్క అడుగు ముందుకు వెళ్ళదు ! కానీ 70 వ దశకం చివరలో ఒక్క అడుగు చైనా వేయడానికి అమెరికాతో పాటు యూరోపు దేశాలు కూడా సహకరించాయి. కానీ ఇప్పుడు అది తప్పు అని తెలుకునేలోపు చైనాని ఆపలేని స్థితిలోకి వెళ్లిపోయాయి ! చైనాకి తన పక్కనే ఉన్న భారత్ దేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థితిలో, అలాగే చైనాలో వృద్ధుల సంఖ్య యువకుల కంటే ఎక్కువగా ఉన్న స్థితిలో, రాబోయే కాలంలో భారత్ తనని ఛాలెంజ్ చేసే స్థితిలోకి వెళ్లకూడదనే ఆశిస్తుంది !
************************************
అమెరికాతో పాటు ఐరోపా దేశాలు చేయాలనుకుంటున్న పనిని చైనా చేస్తానంటే వద్దు అంటాయా ?
చైనా హిండెన్బర్గ్ రీసర్చ్ కి ఫండింగ్ చేస్తున్నది షార్ట్ సెల్లింగ్ పేరుతో స్టాక్ ట్రేడింగ్ చేయడానికి. హిండెన్బర్గ్ కి ఫండ్స్ అవసరమా ? ముందే చెప్పుకున్నట్లు సాధారణ ట్రేడింగ్ కంటే షార్ట్ సెల్లింగ్ లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉండాలి అంటే రోజువారీగా ఫండ్స్ అవసరం ఉంటాయి వాటిని చైనా ఇస్తున్నది హిండెన్బర్గ్ కి.
ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. బిబిసిని చైనా తమ దేశంలో కార్యకలాపాలు చేయడం మీద నిషేధం విధించింది కానీ బిబిసికి చైనాకి ఉమ్మడి శత్రువు ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజేపి ఒక్కటే ! కాబట్టి ఈ విషయంలో కలిసిపోతాయి తాత్కాలిక లాభం కోసం ! మొదట బిబిసి డాక్యుమెంటరీ పేరుతో దాడి మొదలుపెడితే, రెండవ చర్యగా హిండెన్బర్గ్ ఆదాని గ్రూపు మీద దాడి మొదలుపెట్టింది అన్నది గమనార్హం !
(*************************************
అసలు ఆదాని మోసానికి పాల్పడ్డాడా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ అనే సంస్థ విశ్వసనీయత ఎంత ? గౌతమ్ ఆదానీ భారత్ లో ఉంటున్న భారత దేశ వ్యతిరేకులకి మరియు విదేశాలలో ఉంటున్న భారత్ శత్రువులకి టార్గెట్ గా ఉంటూ వచ్చాడు అన్నది స్పష్టం !
ఆగస్ట్ 25, 2022 న్యూ ఢిల్లీ !…. భారత సంతతికి చెందిన అమెరికన్ ఇండస్ట్రియల్ ఇంజినీర్ అయిన రాబిన్ రైనా [Robin Raina] ఢిల్లీ లోని తీస్ హజారీ కోర్టులో హిండెన్బర్గ్ మీద కేసు వేశాడు. రాబిన్ రైనా Ebix Inc అనే సంస్థకి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ [CEO]. Ebix Inc అమెరికా లోని నాస్డాక్ [NASDAQ] తో పాటు మన దేశంలోని స్టాక్ ఎక్స్చేంజ్ లలో లిస్టింగ్ లో ఉన్నది Ebix.inc. Ebix కి 6 దేశాలలో 200 కార్యాలయాలు ఉన్నాయి.
Ebix.Inc అనేది ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ [On Demand Softwere ], e కామర్స్ సేవలు అందిస్తుంది. Ebix వినియోగదారులు వచ్చేసి ఇన్స్యూరెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్, ట్రావెల్, e లెర్నింగ్ రంగాలకి చెందిన సంస్థలు Ebix కి ఉన్నాయి. Ebix సంస్థ CEO అయిన రాబిన్ రైనా తరుచూ భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ ఉంటాడు. ఈ కారణం చేత Ebix. Inc మీద మోడీ వ్యతిరేకుల దృష్టిపడింది !
2022, జులై నెలలో హిండెన్ బర్గ్ Ebix మీద చాలా ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆగస్ట్ నెలలో రాబిన్ రైనా ఢిల్లీ లోని తీస్ హజారీ సెషన్స్ కోర్టు లో సూట్ ఫైల్ చేశాడు హిండెన్బర్గ్ మీద. తమ సంస్థ మీద అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నది అని తన సూట్ లో రాబిన్ రైనా పేర్కొన్నాడు. ఢిల్లీ లోని తీస్ హజారీ సెషన్స్ కోర్ట్ హిండెన్బర్గ్ కి నోటీసులు పంపించింది స్పందించమని ! తీస్ హజారీ కోర్ట్ పంపిన నోటీసుల మీద హిండెన్బర్గ్ స్పందించలేదు! దాంతో సూట్ వేసిన రాబిన్ రైనా కోరినట్లుగా హిండెన్బర్గ్ Ebix మీద విడుదల చేసిన రిపోర్ట్ ని ఆపివేయాలని గూగుల్, ట్విట్టర్ సంస్థలకి ఆదేశాలు ఇచ్చింది. గూగుల్, ట్విట్టర్ లు హిండెన్బర్గ్ రిపోర్ట్ ని తమ తమ సంస్థల డాటా నుండి తొలగించాయి కోర్ట్ ఆదేశాలని పాటిస్తూ !
******************************
Ebix మీద నిరాధార ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ కోర్టు నోటీసులకి ఎందుకు స్పందించలేదు ? కోర్టులో ఊహాగానాలకి విలువ ఉండదు కాబట్టి ! ఒక వేళ కోర్టులో వాదనకి దిగితే పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. అందుకే అసలు తమ మీద రాబిన్ రైనా వేసిన కేసులో అసలు కోర్టుకే హాజరవ్వలేదు. Ebix మీద హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసే ముందే పెద్ద మొత్తంలో Ebix షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసింది హిండెన్బర్గ్. ఎప్పుడయితే హిండెన్బర్గ్ Ebix మీద ఆరోపణలు చేసిందో వెంటనే Ebix షేర్ ధర 30% పడిపోయింది. హిండెన్బర్గ్ 30% న్ని కాష్ చేసుకుంది. కానీ కోర్టు కేసుకు హాజరవ్వలేదు!
వారం క్రితం Ebix విషయంలో ఎలా చేసిందో అదే రీతిలో ఆదానీ గ్రూపు మీద ఆరోపణలు చేసింది దరిమిలా ఆదానీ గ్రూపు షేర్ల ధరలు 20% పడిపోయాయి. హిండెన్బర్గ్ 20% న్ని కాష్ చేసుకుంది ! ఆదానీ ని ఎందుకు సమర్ధించాలి ? హిండెన్ బర్గ్ ఆదానీ గ్రూపు షేర్లు కొన్న వారికి చేసిన నష్టం విలువ ఎంతో తెలుసా ? అక్షరాలా 4 లక్షల 20 వేల కోట్ల రూపాయలు. నష్టపోయిన వారిలో చిన్న చిన్న వ్యక్తిగత మదుపరులు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి హిండెన్ బర్గ్ ని నమ్మాలా ?
(*************************************
Share this Article