విశ్వనాథ్ మరణించి, ఆ కట్టె కాలకముందే ఏవేవో విమర్శలు తనమీద… తను పక్కా థ్రెడ్ లేదా కేబుల్ లేదా వైర్ ఓరియెంటెడ్ సినిమాలే తీశాడనీ, కులతపస్వి అనీ, తన సినిమాలన్నీ బ్రాహ్మణీయాలేననీ వాటి సారాంశం… అగ్రవర్ణ పక్షపాతమనీ వాటి ఆరోపణ… ఆ చర్చ, ఆ రచ్చ సాగుతూనే ఉంది… కొన్నాళ్లు సాగుతుంది కూడా… తన సినిమాల్లోని కొన్ని అభ్యుదయాలు, ఆదర్శాలు గాలికి వదిలేసి, తన కులాన్ని పట్టుకుని, ఒక బయాస్డ్, ప్రిజుడీస్ అభిప్రాయంతో పోస్టులు పెట్టినవాళ్లు కూడా బోలెడుమంది…
నిజంగా తన సినిమాలు అంత బేకార్ సినిమాలా..? వాటికి ఏ విలువా లేదా..? అవి పక్షపాతం, పక్షవాతం సినిమాలేనా..? ఈ చర్చల నేపథ్యంలో Sunil Pilli అప్పట్లో… అంటే 1980లో రంగనాయకమ్మ ఆంధ్రజ్యోతిలో శంకరాభరణం సినిమా మీద రాసిన ఓ సమీక్షను ఫేస్‌బుక్‌లో తన వాల్ మీద పోస్ట్ చేశారు… ఆమె సమీక్ష బాగున్నట్టనిపించింది… ఇప్పటి సినిమాల మీద ఆమెకు సదభిప్రాయమేమీ లేదు… కానీ శంకరాభరణం సినిమాను న్యూట్రల్ వీక్షకురాలిగా చూసి సమీక్షించిన విధానం బాగుంది… తప్పున్నచోట తప్పించుకోకుండా ఇదీ తప్పు అని చెప్పింది… అభినందించే అంశాల్ని అభినందించింది… బ్రాహ్మణీయ సినిమాల మీద రచ్చ నేపథ్యంలో… ఆ సమీక్ష యథాతథంగా…
సహజ సుందరమైన చిత్రం “శంకరాభరణం”
Ads
ఈ చిత్రాన్ని నిజ జీవితంలాగా చిత్రించిన దర్శకుడూ, సంభాషణల రచయితా, పాత్రధారులూ కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు. (ఈ అభినందన ఈ ఒక్క చిత్రానికి మాత్రమే వర్తిస్తుంది. ఇదే దర్శకుడు తీసిన ఇతర చిత్రాలకు గానీ, ఇదే రచయిత రాసిన ఇతర చిత్రాలకు గానీ,ఇదే పాత్రధారులు నటించిన ఇతర చిత్రాలకు గానీ, వర్తించదు.)
ఈ ఒక్క సినిమా ఆగమనం తోటే తెలుగు సినిమా స్థితి గతులు బాగుపడ్డాయని ఎంత మాత్రం భ్రమపడక్కర్లేదు.
[ ‘ఆంధ్ర జ్యోతి’ వార పత్రిక, ? – ? – 1980] *
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Foot note
“ఆ కంఠంలో గానీ, పాడిన విధానంలో గానీ, ఏమీ సౌందర్యం లేదు” అన్న వ్యాఖ్యలో న్యాయం లేదు అనిపిస్తోంది నాకు ఇప్పుడు. ఎందుకంటే: ‘కంఠం’ అనేది ప్రకృతి ద్వారా సంక్రమించే విషయం. ‘పాడిన విధానం’ అనేది, శక్తి సామర్థ్యాలకు సంబంధించినది. కంఠం – ఒక రకంగా వుండి, ఇంకో రకంగా లేనందుకు తప్పు పట్టలేము. అది ఆ మనిషి చేతిలో విషయం కాదు. అలాగే, పాడే విధానంలో శక్తి సామర్ధ్యాల సంగతి కూడా. ఒక మనిషికి, ఎంత శక్తి వుంటే అంతే వుంటుంది. అది కూడా ఆ మనిషి చేతిలో పని కాదు. ఉన్న కంఠంతోనే, ఉన్న శక్తి తోనే, ఆ మనిషి ప్రయత్నం ఎలా వుందో చూడాలి, అంతే. ఆ రకంగా చూస్తే, ఆ పాటలూ, వాటి కవిత్వాలూ అద్భుతంగా వున్నట్టే. కథ ప్రకారం, శంకర శాస్త్రి మంచి సంగీత కళా కారుడనీ, చక్కగా పాడతాడనీ, ఆ పాటల ద్వారానే, ఆ కవిత్వాల ద్వారానే ఊహించాలి.
– రంగనాయకమ్మ.
సేకరణ: పి జె సునీల్. (Sunil pilli fb) 4.2.2023
Share this Article