మీకు గుర్తుందా..? ఉయికె అనసూయ… ఒక దశలో బీజేపీ ఆమెను ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఆలోచించింది… మధ్యప్రదేశ్ గిరిజన కుటుంబానికి చెందిన ఈమె నిన్నటి చత్తీస్‌గఢ్ గవర్నర్…. ఈరోజు జరిగిన గవర్నర్ల మార్పులు, చేర్పులు, నియామకాల్లో ఆమెను ఏకంగా మణిపూర్ గవర్నర్‌గా పంపించారు… ఆమె ప్లేసులో ఏపీ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ హరిచందన్‌ను నియమించారు… ఎక్కడి రాష్ట్రపతి అభ్యర్థిత్వం..? ఎక్కడి మణిపూర్ గవర్నర్ పదవి..?
మరి ఈ విశ్వభూషణుడినే మణిపూర్ పంపిస్తే పోయేది కదా… అలా చేయరు… ఆయన వయస్సు 88 ఏళ్లు… అదికాదు, వాళ్లు ఖండాయత్‌లు… ఇది ఒడిశాకే పరిమితమైన క్షత్రియ కులం… ఏపీలో రాజులు టైపు… ఆయన మణిపూర్ పోలేదు… ఉయికె అనసూయ మాత్రం చత్తీస్‌గఢ్ ఆయన కోసం వదిలిపెట్టి మణిపూర్ వెళ్లాల్సి వస్తోంది… ఇక్కడే ఉంచేస్తే నష్టమేమిటి సార్… పోనీ, విశ్వభూషణుడితో ఇప్పటికిప్పుడు చత్తీస్‌గఢ్‌లో సాధించే ఫాయిదా ఏముంది..?
ఏమీలేదు, పైగా ఏపీలో ఉన్నన్నిరోజులూ జగన్‌కు శ్రేయోభిలాషిగానే వ్యవహరించాడు… అందుకని తనను మార్చారనేదీ కరెక్టు కాదు, ఎందుకంటే..? చత్తీస్‌గఢ్‌లో తస్మదీయ ప్రభుత్వముంది… తమిళనాడు, బెంగాల్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ల తరహాలో వ్యవహరించగలడా అనేది సందేహమే… సరే, ఈ నియామకాన్ని అలా వదిలేస్తే మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన భగత్ సింగ్ కోషియారీ తనను ఈ విధుల నుంచి విముక్తం చేయాలనీ, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపదలుచుకున్నాననీ ఇప్పటికే మొరపెట్టుకున్నాడు… బీజేపీ దాన్ని గౌరవించి, కొత్తగా రమేశ్ బయాస్‌ను నియమించింది…
Ads
నవ్వొచ్చిన విషయం ఏమిటంటే..? మేం విజయం సాధించాం అని ఉద్దవ్ ఠాక్రే వర్గం ఓన్ చేసుకోవడం… ఒకవేళ ఠాక్రేకు తలనొప్పిగా మారి ఉంటే, బీజేపీ సంతోషించేది కదా, ఎందుకు మారుస్తారు..? ఇదొక హాస్యాస్పదమైన క్లెయిమ్… మరొకటి చెప్పుకునే మార్పు… రాజస్థాన్‌లో ప్రతిపక్షనేతగా ఉన్న గులాబీ చంద్ కటారియాను అస్సోం గవర్నర్‌గా పంపించేస్తున్నారు… అంటే మీ సేవలు ఇక చాలు, యాక్టివ్ పాలిటిక్స్ వద్దు, కొత్తనీటిని రానివ్వండి అని చెప్పడం… సేమ్, అప్పట్లో వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిని చేసినట్టు… అప్పట్లో బీజేపీ సీఎం వసుంధరరాజే సింధియాతో కూడా ఈయనకు పడలేదు… పనిలోపనిగా ఆమెను కూడా ఏ నాగాలాండ్‌కో గవర్నర్‌గా పంపిస్తే సరిపోయేది…
మిగతా గవర్నర్లపై పెద్ద చర్చ లేదు గానీ, ఏపీ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టస్ ఎస్, అబ్దుల్ నజీర్‌ను నియమించడం మీద కొంత చర్చ సాగుతోంది… రామాలయం, ట్రిపుల్ తలాఖ్ తదితర కేసుల్లో తను కూడా జడ్జి… అవి బీజేపీ కోరికలకు అనుగుణంగా వచ్చిన తీర్పులు కాబట్టి, ఆయన బీజేపీ అనుకూలుడనేది ఈ చర్చల సారాంశం… తమకు నచ్చిన వాళ్లను గాకుండా బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సానుభూతిపరులు, నాయకులను గవర్నర్లుగా నియమించదు కదా…!! జగన్ పట్ల ఆయన ఎలా ఉంటారూ అంటే… జగన్ కేంద్రంతో కొనసాగించే సంబంధాలను బట్టి ఉంటుంది…!!
Share this Article