తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ఎవరు..? ఆమధ్య టీవీ9ను కొట్టేసి ఎన్టీవీ టాప్ ప్లేసులోకి వెళ్లింది… ఆ ఉక్రోషంతో మరింత బాగా పనిచేసి టీవీ9 మళ్లీ ఎన్టీవీని కొట్టేసి నంబర్ వన్ అయ్యిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం దిగువ ఇచ్చిన చార్ట్… టీవీ9 మారదు, మారలేదు… సెన్సేషనలిజం మాత్రమే తమ ఎడిటోరియల్ లైన్‌గా భావించే టీవీలు అంతే… కొన్ని కీలక వార్తల ప్రజెంటేషన్‌లో అదే పాత పైత్యమే కనిపిస్తోంది… ఉదాహరణ, ఓ రేస్ కారులో కూర్చున్నట్టు గ్రాఫిక్ చేయించుకుని, ఫార్ములా రేస్ వార్తల్ని కవర్ చేయడం..! ఆమధ్య ఎవరో ఒకాయన గుహలో ఇరుక్కుపోతే టీవీ9 చేసిన ఓవరాక్షన్ అంతాఇంతా కాదు… చివరకు హాస్పిటల్‌లో బాధితుడి మూతి వద్ద గొట్టం పెట్టి ప్రశ్నలడగడం చూసేవాళ్లకు పీకల్దాకా కోపం తెప్పించింది…
ఎప్పుడోసారి అలాంటి ప్రయోగాల్ని ప్రేక్షకుడు భరిస్తాడు… అలాగే చిన్న చిన్న వార్తాంశాలను కూడా బొంబాట్ చేసి, కొంపలు మునిగిపోయినట్టు వార్తీకరించడం కూడా ఓ నాన్సెన్స్… ఒక ఆల్టర్నేట్ కనిపించేవరకు మాత్రమే ప్రేక్షకుడు అలాంటివి భరిస్తాడు… ఎన్టీవీ చానెల్ స్ట్రెయిట్, ప్లెయిన్ రిపోర్టింగును నమ్ముకుంది… నిజానికి అదే బెటర్… సో, తాజా రేటింగ్ చార్ట్ చూస్తే నంబర్ వన్ ప్లేసులో ఎన్టీవీయే కొనసాగుతోంది…
Ads
హైదరాబాదులో మాత్రమే టీవీ9 నంబర్ వన్… స్థూలంగా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్, అన్ని కేటగిరీలు కలిపి లెక్కిస్తే ఎన్టీవీకి, టీవీ9కు నడుమ దూరం కూడా బాగానే ఉంది… అంటే ఇప్పట్లో టీవీ9 మళ్లీ నంబర్ వన్ కావడం సాధ్యం కాదు… ఐనా ఆ మేనేజ్‌మెంట్‌కే పెద్ద పట్టింపు లేదు… వాళ్ల అవసరాలు వేరు… పొలిటికల్ స్టాండ్ వేరు… అంటే ఎన్టీవీ కూడా నిష్పాక్షికమేమీ కాదు… సో, ఎన్టీవీని ప్రొఫెషనల్‌గా కొట్టేయడమే టీవీ9కు సాధ్యం కావడం లేదు…
అందరికీ ఆశ్చర్యమేమిటంటే టీవీ5 మూడో స్థానంలో ఉండటం… ప్యూర్ తెలుగుదేశం డబ్బా… ఈమాట అనడానికి సందేహించాల్సిన పని కూడా ఏమీలేదు… ఖండించేవాళ్లు కూడా లేరు… ఆ రంగు పూసుకుని కూడా మూడోస్థానంలో నిలవడం గొప్పే నిజానికి… ప్రొఫెషనల్‌గా ఇక ఆ చానెల్‌లో చెప్పుకోవడానికి కూడా ఏ విశేషమూ లేదు… రేటింగ్స్‌లో ఎన్టీవీతో పోలిస్తే కేవలం సగం… అదీ దాని రేంజ్…
ఈ మూడు చానెళ్లనూ ఏ కేటగిరీ న్యూస్ చానెళ్లుగా పరిగణిస్తే… బీ కేటగిరీలో వీ6, ఏబీఎన్ ఉంటాయి… (థర్టీ జీఆర్పీల లోపు)… సరే, సీ కేటగిరీ కూడా ఉందనుకుందాం… అంటే బిలో ట్వంటీ జీఆర్పీలు… ఇందులో సాక్షి, టీన్యూస్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి… సాక్షి, టీన్యూస్ చానెళ్లకు కూడా పార్టీల రంగులున్నా సరే, కేవలం భజనే పరమార్థం అయినా సరే, ఆ టీవీలకు చెందిన రెండు ఓనర్‌షిప్ పార్టీలు అధికారంలో ఉన్నాయి, చల్తా హై… డీ కేటగిరీ కూడా ఉందనుకుందాం… అందులో రాజ్ న్యూస్, ఐ న్యూస్, మహాన్యూస్ ఉండీ లేనట్టే…!!
మనం జాతీయ స్థాయిలో మన న్యూస్ చానెళ్ల పరిస్థితి ఏమిటో ఓసారి గమనిస్తే… టాప్ 30 లో మన చానెళ్లు ఏడున్నాయి… ఎన్టీవీ ఆరో ప్లేసు కాగా, టీవీ9 పదో ప్లేసు… 19 వ ప్లేసులో టీవీ5, 21వ ప్లేసులో వీ6, 23వ ప్లేసులో ఏబీఎన్ ఉన్నాయి… టీన్యూస్, సాక్షి టీవీలు టాప్ 29, 30 స్థానాలు… మరి మిగతావి..? వాటికంత సీన్ లేదని అర్థం…!!
Share this Article