పార్ధసారధి పోట్లూరి ……….. హిండెన్బర్గ్- బిబిసి డాక్యుమెంటరీ- ఇల్హాన్ ఒమర్ – 2024 ఎన్నికలలో మోడీని గద్దె దించడానికి ఢిల్లీలో రహస్య సమావేశాలు- లిథియం గనులు-చైనా – ఆదానీ ! వెరసి ఇదొక టూల్ కిట్ !
ది సండే గార్డియన్ పత్రికలో అభినందన్ మిశ్రా మరియు దివ్యేందు మోండల్ [Abhinandan Mishra & Dibyendu Mondol] వ్రాసిన ఆర్టికల్ లోని అంశాలు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అది Some PIOs and European officials plan government change in 2024, ఇక్కడ PIO అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ [Persons of Indian Origin ] గా చెప్పబడింది.
2021 లో ది సండే గార్డియన్ [The Sunday Gaurdian ] లో వచ్చిన ఆర్టికల్ ని కనుక ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే అసలు విషయం ఏమిటో బోధపడుతుంది.
Ads
***************************
2021 లో దాదాపుగా 3 నెలల పాటు ఢిల్లీతో పాటు లండన్ నగరంలో చిన్నవి,పెద్దవి కలిపి సుమారుగా ఓ 10 సమావేశాలు జరిగాయి. ప్రధానంగా ఢిల్లీ లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో జరిగిన సమావేశం అప్పటి వరకు జరిగిన సమావేశాలలో పెద్ద వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు! దీని తరువాత 6 నెలలకి రష్యా ఉక్రెయిన్ మీద దాడిచేసింది ఫిబ్రవరి 23, 2022 అన్నది గుర్తుపెట్టుకోవాలి.
2021 లో ఢిల్లీ మరియు లండన్ నగరాలలో జరిగిన సమావేశాల తాలూకు ముఖ్య ఉద్దేశ్యం 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మోడీని ఎలా గద్దె దించాలి అనే అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకొని జరిగినవే ! ఈ సమావేశాలన్నింటిలోనూ యూరోపియన్ దేశాలకి చెందిన దౌత్య అధికారులతో పాటు ప్రవాస భారతీయులు మరియు మన దేశంలో ఉన్న వాళ్ళు [PIO] ఉన్నారు.
సండే గార్డియన్ ఈ సమావేశాలలో పాల్గొన్న వారిని కలిసి వివరాలు సేకరించింది. నిజానికి సమావేశానికి రమ్మని పిలుపు వచ్చినా అక్కడికి వెళ్ళే వరకు తమని ఎందుకు సమావేశాలకి పిలుస్తున్నారో ఆహ్వానితులకి తెలియదు. కానీ ఆ సమావేశాలు నిర్వహించే వారితో పిలవబడ్డ వారికి పరిచయం ఉంది.
******************************
ఎక్కడా ఎవరి పేర్లని బయటపెట్టకుండా గోప్యంగా ఉంచింది సదరు పత్రిక. సండే గార్డియన్ ప్రచురించిన వాటిలో కొన్ని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి:
1. యూరోపియన్ దౌత్యవేత్తలతో పాటు మన దేశంలోని కొందరు వ్యక్తులు పాల్గొన్న ఒక సమావేశానికి వెళ్ళిన ముగ్గురు సండే గార్డియన్ కి అంతకుముందు నుండి పరిచయం ఉన్నవారే… విషయం రాజకీయ పరమయినది అవడం వల్ల సమావేశ వివరాలు మామూలుగానే సండే గార్డియన్ తో పంచుకున్నారు సదరు వ్యక్తులు.
2. 2024 లో జరిగే జనరల్ ఎలక్షన్స్ లో బిజేపిని ఓడించడానికి గాను విదేశీ సహాయం ఎంత మేరకు, ఎలా ఉండాలి అనే అంశం మీద చర్చ జరిగింది. అంటే దీనర్ధం మన దేశ వ్యవహారాలలో ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుండి ఎలాంటి జోక్యం ఉండాలి అనే దానిమీద జరిగింది.
3. ఇలాంటి సమావేశాలు మూడు సార్లు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ రెసిడెన్సీలో జరిగాయి. దక్షిణ ఢిల్లీలోని మోతీ బాగ్ లో ఉంది ఆ పెద్ద బంగ్లా ! మొత్తం 20 మంది విదేశీయులు మరియు భారతీయులు పాల్గొన్నారు ! అమెరికాలోని టెక్సాస్ నగరం నుండి వచ్చిన NRI లు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో. టెక్సాస్ తో పాటు అమెరికాలోని ఇతర నగరాల నుండి కూడా NRIలు వచ్చారు… ఈ సమావేశం కోసమే వచ్చారు అన్నది స్పష్టంగా తెలిసిపోయింది ఎందుకంటే ఈ సమావేశం అయిపోగానే నేరుగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుండి తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
4. మరో సమావేశం ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కూడా 20 మంది పాల్గొన్నారు. భారతీయులతో పాటు చాలా వరకు యూరోపియన్ దేశాల డిప్లొమాట్లు ఎక్కువగా ఉన్నారు ఈ సమావేశంలో.
5. ఇంకో సమావేశం బహదూర్ షా జఫర్ మార్గ్ లోని ఒక ప్రముఖ సుప్రీం కోర్ట్ అడ్వొకేట్ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో 12 మంది పాల్గొన్నారు.
6. ఢిల్లీ మరియు లండన్ లో జరిగిన సమావేశాలకి కొన్ని యూరోపియన్ దేశాల డిప్లొమాట్లు, లండన్ లో జరిగిన సమావేశాలకి ఎక్కువ మంది యూరోపియన్ డిప్లొమాట్లు పాల్గొన్నారు.
7. అన్ని సమావేశాలలో పాల్గొన్న వారి ప్రొఫైల్స్ పరిశీలిస్తే డాక్టర్లు, లాయర్లు, IT ప్రొఫెషనల్స్ ఉన్నారు.
8. ఈ సమావేశాల అజెండా మాత్రం ఒక్కటే ! కాకపోతే ప్రతీ సమావేశానికి ఆరుగురు కొత్తవారిని చేర్చుకుంటూ వాళ్ళ సలహాలు, సూచనలని రికార్డ్ చేశారు నిర్వాహకులు.
9. అజెండాలో భాగంగా ఉన్న అంశాలు : 2024 ఎన్నికలలో బిజేపిని ఓడించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? నెగెటివ్ ప్రాపగాండా ఎక్కడ నుండి మొదలు పెట్టి, ఎలా చేయాలి ? ప్రాపగాండాని మార్కెట్ చేయడానికి ప్రొఫెషనల్స్ ఎవరిని ఎక్కడ నియమించుకోవాలి ? అది ఎలా చేయాలి ? పబ్లిక్ రిలేషన్ మేనేజర్లుగా ఎవరిని నియమించుకోవాలి ? సోషల్ మీడియా నిపుణులని ఎవరిని నియమించుకోవాలి, వాళ్ళ చేత ట్విట్టర్, ఫేస్బుక్, వాట్స్అప్ లలో బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఎలాంటి రా మెటీరీయల్ ఎంచుకోవాలి ?
10. ఇలా గ్రూపు డిస్కషన్స్ చేసిన తరువాత అంతిమంగా లండన్ ప్రధాన కేంద్రంగా పధకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట 2023 ఫిబ్రవరి నుండి క్రమంగా మొదలు పెట్టి 2023 సెప్టెంబర్ నెల వచ్చే సరికి దూకుడు పెంచుకుంటూ పోవాలి. 2023 సెప్టెంబర్ నెలకి మరో ఆరు నెలల గడువు ఉంది జనరల్ ఎలక్షన్స్ కి…
11. అంటే ఈ ఫిబ్రవరి నెలలో జరిగిన హిండెన్ బర్గ్, బిబిసి డాక్యుమెంటరీ, వ్యవహారాలు అనేవి సినిమా ముందు వచ్చే టైటిల్స్ లాంటివి అన్నమాట. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ఇలాంటి దుష్ప్రచారాలని మరింత పకడ్బందీగా, వేగంగా ఒక దానితో పాటు ఇంకొకటి వదులుతూ పోతూ ఉంటారు అన్నమాట.
12. వీటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి ? అది కూడా ఈ సమావేశాలలో చర్చించారు. నిధులు మన దేశంలో ఉన్న వ్యక్తులే సమకూరుస్తారు, అదీ ప్రభుత్వ నిఘా నుండి తప్పించుకోవడానికి గాను… విదేశాల నుండి అక్కడ ఉద్యోగ, వ్యాపారాలలో నిమగ్నం అయిన వారి ద్వారా తమ రక్త సంబంధీకులకి, సన్నిహిత మిత్రులకి పంపిస్తారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలయింది కూడా. ఎక్కడా కూడా నిఘా సంస్థలకి అనుమానం రాకుండా నెలకి రెండు వేల డాలర్ల కి మించకుండా ఎక్కువ మందికి పంపిస్తారు. కేరళలోని నిషేధిత PFI కి కూడా నిధులు ఇలానే వచ్చాయి అని సీజ్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా వెల్లడి అయ్యింది.
ముందు మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే 2021 లో జరిగిన ఈ సమావేశాల వివరాలు ఒక పత్రిక సంపాదించగలిగింది అంటే మన కేంద్ర ఇంటెలిజెన్స్ కి వివరాలు తెలియకుండా ఉంటాయా ? ఇంటలిజెన్స్ బ్యూరో [IB], RAW లకి తెలియకుండా ఉంటుందా ? అందుకే 2022 ఫిబ్రవరి 23 న ఉక్రెయిన్ మీద దాడికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశం అయ్యి వెంటనే మాస్కో వెళ్ళిన సంగతిని గుర్తు చేసుకోవాలి.
రష్యా దాడి మొదలు పెట్టగానే ఢిల్లీ లోని ఉక్రెయిన్ రాయబారి ఏడుస్తూ భారత దేశ జాతీయ గీతాన్ని అలపించి మరీ రష్యాని ఆపగలిగే శక్తి ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే ఉందంటూ వేడుకున్నాడు, అంటే తమ రాయబార కార్యాలయంలో జరిగిన మన దేశ వ్యతిరేక సమావేశ వివరాలు మోడీకి తెలిసిపోయాయి అనే కదా ?
2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం మొదలుపెట్టగానే వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాని ఆపగలిగిన శక్తి ఒక్క భారత ప్రధానికి ఉంది కానీ మోడీ ఆపట్లేదు అంటూ ఉక్రోషంతో వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం కూడా తమ దేశ రాయబార కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ అనుకూల సమావేశం అనే అర్ధం ఉంది.
ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే వెంటనే యూరోపియన్ యూనియన్, అమెరికాలు పూర్తి స్థాయి ఆంక్షలు విధించడం పెద్ద తప్పు అని ఆలస్యంగా తెలుసుకున్నాయి. దాని పర్యవసానంగా ఇప్పుడు అమెరికాతో పాటు యూరోపు దేశాలు కూడా పెట్రోల్, డీజిల్ కోసం భారత్ మీద ఆధార పడుతున్నాయి…. (ఈ కథనంలోని అంశాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు…)
Share this Article