పార్ధసారధి పోట్లూరి ……… మోడి Vs జార్జ్ సోరోస్ అండ్ కంపనీ ! గూగుల్ యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ + లిథియం ! చేజారిపోతున్న భారీ ఆదాయం ఇవ్వగల ఒక్కో అవకాశం వెరసి అమెరికా వెనక ఉండి నడిపిస్తున్న డ్రామా ! పైకి కనపడేది వేరు, లోలోపల జరుగుతున్నది వేరు! పేరు జార్జ్ సోరోస్ దే అయినా ఫైనల్ గా రంగంలోకి దిగేది ఐరోపా సమాజం మరియు అమెరికా ! 140 కోట్లు జనాభా కల భారత దేశంలో ఐరోపాతో పాటు అమెరికాకి బాగా ఆదాయం సంపాదించపెట్టగల ఒక్కో అవకాశం చేజారీ పోతున్నది మోడీ వలన!
2020 లో దాదాపుగా $546 బిలియన్ డాలర్లు సంపాదించవచ్చు అని ఆశ పడ్డ బహుళజాతి ఫార్మా సంస్థలకి యుద్ధ ప్రాతిపదిక మీద మన దేశంలోనే రెండు రకాల కోవిడ్ వాక్సిన్లని తయారుచేసి బహుళ జాతి సంస్థలకి అవకాశం లేకుండా చేసిన మోడీ అంటే ఐరోపాకి కానీ అమెరికాకి కానీ ఇష్టం ఉంటుందా ?
****************************
Ads
సరే ! అదేదో అయిపోయిన ఎపిసోడ్ అనుకుంటే మళ్ళీ ఇంకో షాక్ ఇచ్చారు మోడీ ! అది యాంటీ ట్రస్ట్ చట్టం కింద గూగుల్ మీద ఆంక్షలు విధించే అవకాశం ! యాంటీ ట్రస్ట్ మరియు మోనోపలి అనేవి మన దేశంలో చట్ట విరుద్ధం! గూగుల్ మీద ఎందుకు యాంటీ ట్రస్ట్ చట్టం ప్రయోగించాల్సి వస్తున్నది ?
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా [Compitions Commission of India – CCI] 2020 లో గూగుల్ మీద జరిమానా విధించింది ! గూగుల్ తన యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ [Android Opareting System ] తోపాటు ప్లేస్టోర్ సూట్ ని డీఫాల్ట్ గా ఇన్స్టాల్ చేస్తున్నది మొబైల్ ఫోన్లలో అంటూ! అంటే దీనర్ధం మొబైల్ కంపనీలు తమ తమ మొబైల్ ని తయారు చేసి మార్కెట్ లోకి వదిలే ముందు గూగుల్ యాండ్రాయిడ్ Os తో పాటు Play Store మరియు దానిలో Apps ని కూడా ఉచితంగా ఇస్తున్నది వినియోగదారులకి… ఇక్కడి వరకు Ok !
గూగుల్ ప్లేస్టోర్ లో ఎవరన్నా తమ App ని పెట్టాలంటే సదరు సంస్థ వన్ టైమ్ పేమెంట్ కింద $25 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా Ok ! కానీ డెవలపర్ తమ App ని గూగుల్ ప్లేస్టోర్ లో పెట్టడానికి చెల్లించాల్సిన 25 డాలర్లని కేవలం GPay ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, అంతే కానీ UPI తో అనుసంధానం అయిన వేరే ఏ ఇతర పేమెంట్ App ని అంగీకరించట్లేదు. ఇది మార్కెట్ మోనోపాలి [ఏకఛత్రాధిపత్యం ] కిందకి వస్తుంది మరియు మన దేశ యాంటీ ట్రస్ట్ చట్టాలకి విరుద్ధం ! దీని మీద లోతుగా విచారణ చేస్తున్నది CCI. అలాగే డబ్బు చెల్లించి కొనే Apps కూడా ఉంటాయి, ప్లేస్టోర్ లో వాటికి డబ్బు చెల్లించాలి అంటే GPay ద్వారానే చెల్లించాలి కానీ ఇతర UPI Apps ని అంగీకరించదు గూగుల్. ఇది కూడా వివాదాస్పద అంశం !
మరో వివాదం ఏమిటంటే… యాండ్రాయిడ్ Os తో పాటు డీఫాల్ట్ గా అన్నీ గూగుల్ కి సంబంధించినవే ఉంటాయి ఏ మొబైల్ ఫోన్ లో అయినా… వాటి అవసరం వినియోగదారుడికి లేకపోయినా చచ్చినట్లు ఉంచుకోవాలి తప్పితే వాటిని మొబైల్ నుండి తీసివేయడం [ఆన్ ఇన్స్టాల్ ] చేయడం కుదరదు. ఇది మోనోపలి కిందకి వస్తుంది !
ఇంకో వివాదం ఏమిటంటే… గూగుల్ సెర్చ్ [Google Search ] మరియు గూగుల్ సెర్చ్ అడ్వర్టైజ్మెంట్లు రెండూ వేరే వేరే, కానీ వీటిలో కూడా తన మోనోపలీని కొనసాగిస్తున్నది. అయితే గూగుల్ మీద అమెరికాలో కూడా ఇలాంటి కేసే నడుస్తున్నది. తుది విచారణ సెప్టెంబర్ 2023 లో జరగబోతున్నది. 2022 అక్టోబర్ నెలలో CCI గూగుల్ మీద యాంటీ ట్రస్ట్ చట్ట ఉల్లంఘన మీద 1,338 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ ఆర్డర్ ని నిలుపుదల చేయమని సుప్రీం కోర్టుకి వెళ్ళింది గూగుల్, కానీ సుప్రీం కోర్ట్ గూగుల్ అభ్యర్ధనని తిరస్కరించింది. గూగుల్ వాదన ఏమిటంటే ఇప్పటికే ఇదే కేసు విషయంలో మేము యూరోపు కోర్టులలో జరిమానా చెల్లించాము కాబట్టి భారత్ లో కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని.
********************************
జార్జ్ సోరోస్, ఐరోపా సమాజం, అమెరికాలకి గూగుల్ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన డబ్బుని తమ దేశ కోర్టులలో జరిమానాగా చెల్లించాలి ! అప్పుడు ఆ డబ్బు ఆయా దేశాలకి పనికివస్తుంది ! కానీ భారత్ లో చెల్లించాలి అంటే ఇష్టపడట్లేదు !
*************************************
అయితే గూగుల్ కి జరిమానాగా వేసిన 1,338 కోట్లు పెద్ద మొత్తం ఏమీ కాదు ! అసలు సమస్య భారత్ లో యాండ్రాయిడ్ కి పోటీగా మొబైల్ Os రాబోవడం ! చెన్నైకి చెందిన IIT విద్యార్ధులు [JandK Operations Private Limited ] డెవలప్ చేసిన BharOS అనే పేరుతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని త్వరలో విడుదల చేయబోతున్నారు. BharOS అనేది వినియోగదారులకి భద్రత,స్వేచ్చ, మరింత ఫ్లెక్సిబిలిటీతో పాటు తమ తమ అవసరాల కోసం మార్పులు చేసుకునే వీలు ఉంటుంది. ఇది ఇంకా బేటా దశలోనే ఉంది కానీ త్వరలో అన్ని బగ్స్ ని వెరిఫై చేసుకొని మార్కెట్లోకి రావొచ్చు!
***********************
BharOS వల్ల ఇప్పటికిప్పుడు యాండ్రాయిడ్ Os కి వచ్చిన నష్టం ఏమీ ఉండదు కానీ వచ్చే కొద్ది సంవత్సరాలలో మాత్రం BharOS వల్ల గూగుల్ ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. భారత్ లో 145 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పాతవి అమ్మేసి కొత్తవి కొంటూనే ఉంటారు భారతీయులు కాబట్టి ముందు ముందు BharOS వల్ల నష్టం ఉంటుంది అన్నది జార్జ్ సోరోస్, ఐరోపా సమాజం, అమెరికాల ఆందోళన !
*************************
మోడీ అధికారంలో ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ! మొదట్లో మైక్రోసాఫ్ట్ మొబైల్ లు మార్కెట్ లోకి వచ్చినా యాండ్రాయిడ్ తో పోటీ పడలేక మూసేసుకుంది మైక్రోసాఫ్ట్ ! కాబట్టి BharOS కూడా అలాగే అవుతుంది అనే వాళ్ళకి కొదువ లేదు, కానీ ఎప్పుడూ ఒకేలాగా జరగదు కదా ?
చైనాలో గూగుల్ కి కానీ,ఫేస్బుక్ కి కానీ స్థానం లేదు. ఇప్పుడు భారత్ లో యాండ్రాయిడ్ కి మార్కెట్ లేకపోతే తన వైభవం కోల్పోతుంది ! రెండేళ్ల క్రితం మోడీ భారీ ఆఫర్ ఇచ్చారు ఫేస్బుక్ కి ప్రత్యామ్నాయంగా భారతీయులు కొత్త అప్లికేషన్ డెవలప్ చేస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటూ ! కానీ అది కార్య రూపం దాల్చలేదు కానీ మొబైల్ BharOS మాత్రం వెలుగులోకి వచ్చింది !
********************************
గతంలో AIDS కి మందులు కనిపెట్టడంలో బిల్ గేట్స్ భారత్ లోని మనుషులని ప్రయోగశాలలోని ఎలుకల్లాగా వాడుకోవడానికి సహకరించించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ! కానీ కోవిడ్ విషయంలో మోడీ ఆ అవకాశం ఇవ్వలేదు, పైగా ఫైజర్ లాంటి సంస్థ తన కోవిడ్ వాక్సిన్ వైఫల్యాల మీద ముఖం చాటేసే స్థితికి తెచ్చారు మోడీ !కాబట్టి మోడీ అధికారంలో కొనసాగకూడదు !
*********************************
ఇక మరో అరుదయిన అవకాశం ఉంది అది లిథియం ! జమ్మూలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద లిథియం నిల్వలు బయటపడ్డాయి ! రాబోయే అయిదేళ్లలో క్రూడ్ ఆయిల్ కంటే లిథియంకే ఎక్కువ డిమాండ్ ఉండబోతున్నది ! మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే లిథియం గనులు, నిర్వహణ, ప్రాసెస్ లాంటి అత్యంత లాభదాయక కాంట్రాక్ట్ యూరపు లేదా అమెరికాకి దక్కదు ! సో, మోడీ కుర్చీ మీద ఉండకూడదు… అదీ టార్గెట్…
Share this Article