పార్ధసారధి పోట్లూరి …….. మోడీ Vs జార్జ్ సోరోస్! అసలు ఇంతకీ లిథియం గనులు తవ్వకం, నిల్వలు, ప్రాసెసింగ్ విషయంలో ఏ దేశం స్థానం ఎక్కడ ఉంది ? ముందు లిథియం అయాన్ బాటరీ జీవితకాలం ఎంత ? 5,000 రీ చార్జ్ సైకిల్స్ గా ఉంది, అంటే హీన పక్షం 6 ఏళ్లు పనిచేస్తుంది!
బొలీవియా లో అత్యధికంగా 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అర్జెంటీనా లో 20, అమెరికాలో 12, చిలీ దేశంలో 11, ఆస్ట్రేలియాలో 7.9 చైనాలో 5.9, భారత్ లో 5.9 మిలియన్ టన్నులు ఉన్నాయి. అయితే ఈ లెక్కలు ముడి ఖనిజంకి సంబంధించినవి. 5.4 టన్నుల ముడి ఖనిజం తవ్వి దానిని ప్రాసెస్ చేస్తే వచ్చే లిథియం ఒక టన్ను మాత్రమే. అది కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన టెక్నాలజీ.. పర్యావరణం దెబ్బ తింటుంది. ప్రాసెసింగ్ టెక్నాలజీ అనేది అమెరికా, రష్యా, చైనాల దగ్గర మాత్రమే ఉంది.
*******************************
Ads
మరి రష్యా సంగతి ఏమిటీ ?
రష్యాలో భారీ స్థాయిలో లిథియం నిల్వలు ఉన్నాయి కానీ వాటిని తవ్వి తీయడానికి రష్యా వద్ద మానవ వనరులు కానీ తగినంత డబ్బు కానీ లేదు. అయితే రెండు భారీ లిథియం ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ముడి ఖనిజం చిలీ దేశం నుండి దిగుమతి చేసుకొని దానిని ప్రాసెస్ చేసి లిథియం ఉత్పత్తి చేస్తున్నది.
అమెరికా ఆంక్షల వల్ల దెబ్బ తిన్న రష్యా ప్రస్తుతం లిథియం గనుల తవ్వకం, నిర్వహణ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగల దేశం కోసం ఎదురుచూస్తున్నది. అది భారత్ ! ఆదానీ గ్రూపు ! ముందు జమ్మూలో బయటపడ్డ లిథియంని వెలికి తీసి దానిని ప్రాసెస్ చేయడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుంది అలాగే నిర్వహణ కూడా చేయాలి. ఆదానీ ఇప్పటికే గనుల నిర్వహణలో ఉన్నాడు కాబట్టి బయటి దేశానికి ఇవ్వకుండా ఆదానీ గ్రూపుకే ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. దీనికి రష్యా తన టెక్నాలజీని ఇస్తుంది. ఆదానీకి అనుభవం వచ్చిన తరువాత రష్యా తమ దేశంలో లిథియం వెలికి తీసే కాంట్రాక్ట్ ని ఆదానీ గ్రూపు ఇస్తుంది.
*************************
దీనిని పసిగట్టిన అమెరికా యూరోపు దేశాలు మోడీ పుతిన్ స్నేహాన్ని విడగొట్టాలి అంటే ముందు ఆదానీకి అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల దగ్గర అప్పు పుట్టకుండా చేయాలి. తరువాత మోడీని ఎట్టిపరిస్థితులలో కూడా తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి. వీలయితే 2024 ఎన్నికలకి ముందే మోడీని ప్రధాని పీఠం నుండి దించే వీలుంటుందేమో చూడాలి.
జస్ట్ టార్గెట్ పుతిన్ వయా మోడీ!
అమెరికా, యూరోపు, జపాన్ రష్యా మీద ఆంక్షలు విధించినా ఇంకా రష్యా లొంగలేదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడాన్ని ఖండించలేదు ఇంతవరకు పైగా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకొని దానిని శుద్ధి చేసి యూరోపు, అమెరికాలకి తక్కువ ధరలో సరఫరా చేస్తున్నారు మోడీ!
జెలెన్స్కీ డిమాండ్ చేసినట్లు అమెరికా, యూరోపు భారత్ మీద ఆంక్షలు విధించగలవా ?
అలా చేస్తే ఇప్పటికే తమ అవసరాలని చైనా నుండి తీర్చుకుంటున్న అమెరికా యూరోపులకి… చైనా కాళ్ళ మీద పడి వేడుకోవాల్సిన స్థితి వస్తుంది. కాబట్టి ఆపని చేయలేవు. ఒక వేళ ఆంక్షలు విధిస్తే అప్పుడు పూర్తిగా రష్యాతో స్వేచ్ఛగా మరింత ఎక్కువగా లావాదేవీలు చేస్తుంది భారత్ ! మోడీ ఈ తురుపు ముక్కని రిజర్వ్ లో పెట్టుకున్నారు! మోడీకి తెలుసు ఈ విషయం ! అందుకే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
*******************
ఇక హంగరీలో పుట్టి అమెరికాలో ఉంటున్న యూదు నాస్తికుడు మరియు 92 ఏళ్ల జార్జ్ సోరోస్ అనే వాడు ఒకప్పటి సింహం అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆ సింహం ముసలిది అయిపోయింది. కుందేలు కూడా తోక ఆడిస్తుంది ! ఒక కాలు శ్మశానంలో ఇంకో కాలు ఇంట్లో ఉన్న జార్జ్ సోరోస్ మోడీని చేయడానికి ఏమీ ఉండదు! కాకపోతే బిలియన్ల కొద్దీ డాలర్లు ఉన్నాయి వీడి దగ్గర. పేరుకి నాస్తికుడే అయినా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పేరుతో అతి పెద్ద NGO ని నిర్వహిస్తూ ప్రాజెక్ట్ జాషువా పేరుతో భారత దేశంలోకి నిధులు కుమ్మరిస్తూ వస్తున్నాడు దశాబ్దాలుగా. ప్రపంచం మొత్తం క్రైస్తవం వ్యాపింప చేయడం వీడి లక్ష్యం !
***************************
జార్జ్ సోరోస్ అతని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ గురుంచి ముందు నుండి బిజేపికి తెలుసు కాబట్టే నకిలీ NGO లని రద్దు చేశారు మోడీ ! జార్జ్ సోరోస్ కి కాంగ్రెస్ కి ఉన్న అనుబంధం రహస్యం కానీ మోడీ ఆ రహస్యాన్ని బహిరంగంగా అందరికీ తెలిసేలా చేయడంలో విజయం సాధించారు. జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి వైస్ ప్రెసిడెంట్ అయిన సలీల్ శెట్టి రాహుల్ తో చేయి చేయి కలిపి నడవడాన్ని అందరూ చూసేలా చేయగలిగారు మోడీ
************************
పుతిన్ KGB చీఫ్ గా ఉన్నప్పటి నుండి జార్జ్ సోరోస్ అనే వాడిని తన హిట్ లిస్ట్ లో పెట్టుకున్నాడు ! రష్యా అధ్యక్షుడు అవగానే తన హిట్ లిస్ట్ లో మొదటి స్థానం జార్జ్ సోరోస్కి ఇచ్చాడు… కానీ సిఐఏ అండ దండలు ఉండడం వలన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.
************************
టర్కీ ? ఎర్డోగాన్ ?
ప్రస్తుతం అమెరికా వ్యతిరేక కూటమిలో ఉన్న టర్కీకి భూకంపం వచ్చిన వెంటనే మోడీ రెండు సైనిక రవాణా విమానాల ద్వారా సహాయం అందించడం చాణక్యం ! నిత్యం మన మీద దుమ్మెత్తి పోసేఎర్డోగాన్ కి సహాయం చేయడం ఏమిటీ అని సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళకి సమాధానం ఎర్డోగాన్ ఇచ్చాడు తెలుసా ? నిజానికి భూకంపం వచ్చిన మొదటి 24 గంటలలో చేసే సహాయం అత్యంత కీలకంగా ఉంటుంది ఎప్పుడూ ! మోడీ అదే పని చేశారు !
తాము పంపిన సాయాన్ని తమకే తిరిగి పంపించిన సంగతిని అధికారులు ఎర్డోగాన్‌కు చెప్పారు… అదేసమయంలో పాకిస్థాన్ నుండి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశాడు ఎర్డోగాన్ కి… తనతో పాటు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో టర్కీ కి రావాలని అనుకుంటున్నామని… అప్పటికే తమ దేశానికి సహాయం కోసం భారత్ రెండు మిలటరీ రవాణా విమానాలని పంపిస్తే, అవి భారత్ పాకిస్థాన్ భూభాగం మీదుగా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదన్న కోపంలో ఉన్నాడు ఎర్డోగాన్… తాము పంపించిన సహాయాన్ని తిరిగి పాకిస్థాన్ లేబుల్స్ వేసి పంపించడాన్ని కూడా జీర్ణించుకోలేని ఎర్డోగాన్ షెహబాజ్, షరీఫ్ టర్కీ రావద్దని ఖరాఖండిగా చెప్పేశాడు కోపంతో !
Share this Article