అఖిల్ జాతకం ఏమిటో గానీ… ఏడెనిమిదేళ్లుగా కష్టపడుతూ, నాలుగు సినిమాలు చేసి, అయిదో సినిమా రాబోతున్నా… అంతటి అక్కినేని నాగార్జున వారసుడైనా… ఒక్క హిట్టూ లేదు… వసూళ్ల మాట దేవుడెరుగు… తను హీరో సరుకే, రానురాను క్లిక్ అవుతాడనే అభినందనలు కూడా కరువయ్యాయి… నిజంగానే రా సరుకు… ఇప్పటికీ ప్రాసెస్ జరగలేదు… నాగార్జున ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో అఖిల్ కూడా అలాగే ఉన్నాడు… ఏదైనా మంచి ప్రామిసింగ్ రోల్ పడితే తప్ప మనిషి పాలిష్ కాడు… పనికిరాడు…
ఇప్పుడు ఏజెంట్ అనే సినిమా వస్తోంది… సురేందర్ రెడ్డి దర్శకుడు… స్పై థ్రిల్లర్… బాగా పాతబడి, నలిగిపోయిన జానరే… ఆ పాటలు చూస్తుంటే మాత్రం సురేందర్ రెడ్డి ఏవో ప్రయోగాలు చేస్తున్నాడు కానీ అవి కనెక్టయ్యేలా కనిపించడం లేదు… అఖిల్ కూడా ఉద్వేగరహిత మొహంతో కనిపిస్తున్నాడు… స్టెప్పులు, మూమెంట్స్ వరకు వోకే… కానీ ఈజ్, ఫీలింగ్స్, ఎమోషన్స్ పలకాలి, లేకపోతే ఈ పోటీ రోజుల్లో కష్టం… వెంకటేశ్‌లు, నాగార్జునలు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తరోజులు కావివి…
పాటల సంగతికొస్తే ఉదాహరణకు… మళ్లీ మళ్లీ నువ్వు ఎదురొస్తే అనే పాట… మనకు రోల్ రైడా అనే హైదరాబాదీ సింగర్ ర్యాపర్‌గా కష్టపడుతున్నాడు… యాడ్స్ మాత్రమే కాదు, ఒకటీరెండు సినిమాల్లో కనిపించినట్టు కూడా గుర్తు… కానీ ర్యాప్ అనేది ఈరోజుకూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు… మామూలు వాక్యాల్నే ముక్కలుముక్కలుగా విడగొట్టి పాడటమే అనే అభిప్రాయం ఉంది… అది నిజమే కూడా… దాదాపు అన్నీ ఒకే రీతిలో పలుకుతుంటాయి…
Ads
ఇప్పుడు ఏజెంట్ సినిమాలో హిప్ హాప్ స్టయిల్ కొద్దిగా ప్రయోగించారు… అదొకరకం సాంగ్స్ స్టయిల్… మొత్తం హిప్ హాప్ సాంగ్ పెట్టడానికి జంకినట్టున్నారు… కాస్త మామూలు పాటకు హిప్ హాప్ ఫ్లేవర్ అద్ది ఈ మళ్లీ మళ్లీ పాట చేశారు… మ్యూజిక్ కూడా హిప్ హాప్ తమీజా… నిజానికి తన పేరు ఆదిత్య వెంకటాపతి… చెన్నై బేస్డ్… హిప్ హాప్ జానర్ పాటలు తన స్పెషాలిటీ… సేమ్, మన సిధ్ శ్రీరాం తమ్ముడే, తెలుగు పదాల ఉచ్ఛరణ ఏమాత్రం బాగనిపించలేదు…
పాడింది తనే, కంపోజింగ్ తనే… ఇక పాట రాసిందేమో ఆదిత్య అయ్యంగార్… తను కూడా సింగర్ కమ్ లిరిసిస్ట్… కీరవాణి, థమన్ ఎంకరేజ్ చేస్తున్నా సరే మంచి బ్రేక్ రావడం లేదు తెలుగులో… ఏజెంట్ సినిమాలోని మళ్లీ మళ్లీ పాట కొత్తకొత్తగా ఉంది కానీ ఇంప్రెసివ్‌గా లేదు… పాట కంటెంట్, ట్యూన్, సింగింగ్ స్టయిల్… అన్నీ ఓ మోస్తరుగా ఉన్నయ్, అంతే… హీరోయిన్ సాక్షి వైద్యతో సహా..!!
Share this Article