కర్నాటకలో ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపలు కొంగులు నడుముకు చుట్టేసి, జత్తూజుత్తూ పట్టుకుని, వీథి కుళాయిల దగ్గర కొట్టుకుంటున్నట్టే తగాదా పడుతున్నారు కదా… అసలు వాళ్లిద్దరి నడుమ ఎందుకు ఈ పంచాయితీ వచ్చింది..? మరీ ఈ రేంజులో రూప సదరు రోహిణిని ఎందుకు టార్గెట్ చేసింది… ఆమె పట్ల శీలహననానికి ఎందుకు పాల్పడుతోంది…? ఈ ప్రశ్నకు కొద్దికొద్దిగా జవాబులు వస్తున్నాయి… ఒకటేమో ఒక ఆడియో క్లిప్, మరొకటేమో రూప ఫేస్‌బుక్ పోస్టు…
బుధవారం ఓ ఆర్టీఐ యాక్టివిస్టు గంగరాజు ఓ 25 నిమిషాల ఆడియో క్లిప్ షేర్ చేసుకున్నాడు… అందులో రూప వాయిస్ ఉంది… ఆమె ఆరోపణ ఏమిటంటే… ‘‘నా భర్త మునీశ్ మోడ్గిల్ ల్యాండ్ రెవిన్యూ రికార్డులు, సర్వే సెటిల్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (భూరికార్డులన్నింటికీ బాస్ ఈ శాఖ) కమిషనర్‌గా ఉన్నప్పుడు రోహిణి సింధూరితో కొన్ని ల్యాండ్స్ వివరాలు షేర్ చేసుకునేవాడు… ఎందుకంటే..? రోహిణి భర్త సుధీర్ రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి… వాళ్ల వ్యాపారానికి ఉపయోగపడేలా భూముల వివరాల్ని ఇచ్చేవాడు మునీశ్…
Ads
కబిని దగ్గర ఉన్న భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెట్లను మునీశ్ నుంచి తీసుకుంది, వీటిని కొనవచ్చా లేదాని అడిగేది… సర్వే నంబర్లను సబ్ నంబర్లుగా విభజించే (పొడి) వీలుందాని అడిగేది… ఈ డాక్యుమెంట్లు సక్రమమేనా, ఏమైనా వివాదాలున్నాయా అనడిగేది… ఇవి సహించలేక నేను ఆ డిపార్ట్‌మెంట్ నుంచి నా భర్తను బదిలీ చేయమంటూ ఉన్నతాధికారులను అడిగేదాన్ని…’’ అని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది… అసలు ఎవరు ఈ గంగరాజు..?
ఆర్టీఏ యాక్టివిస్టు… ఎమ్మెల్యే సారా మహేశ్ మీద కేసు పెట్టించాలనీ, సీబీఐ లేదా సీఐడీ ఎంక్వయిరీ జరిగేలా చూడాలనేది రోహిణి పంతం మొదట్లో… దానికి గంగరాజును ఉసిగొల్పి కేసులు పడేలా, ఆరోపణలు చేయించేది… తరువాత మహేశ్ రోహిణి మీద పరువు నష్టం దావా వేశాడు… ఈ స్థితిలో మరో ఐఏఎస్ అధికారి కెప్టెన్ మణివణ్నన్ ద్వారా మహేశ్‌తోె రాజీకుదిరింది… బెలగావిలో అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నప్పుడు, అక్కడే ఈ రాజీ భేటీలు జరిగాయనేది ఆమె వివరణ…
రోహిణి భర్త రూప మీద పోలీసులకు కంప్లయింట్ చేయడం, రోహిణి రూప మీద చీఫ్ సెక్రెటరీకి కంప్లయింట్ చేయడం, రూప కూడా రోహిణి మీద పలు ఆరోపణలు చేయడం… తను కూడా చీఫ్ సెక్రెటరీకి తన ఆరోపణల మీద దర్యాప్తు జరపాలని కోరడం చకచకా జరిగిపోయాయి… రోహిణి ప్రైవేటు ఫోటోలను రూప సేకరించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రోహిణి ఈ ఫోటోలను ముగ్గురు మగ ఐఏఎస్‌లకు పంపించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది…
అంటే ఒకరకంగా రోహిణి శీలాన్ని, గుణాన్ని బజారుకు లాగుతోంది… అంతేకాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే పోరాడుతున్నా, ఇప్పటికైతే నా భర్త, నేను కలిసే ఉన్నాం, కుటుంబం విచ్ఛిన్నం గాకుండా జాగ్రత్తపడుతున్నా, పలువురి జీవితాలు నాశనమయ్యేదుకు కారణమైన మహిళను నిలదీయకతప్పదు… తమిళనాడులో ఓ ఐపీఎస్, కర్నాటకలో ఓ ఐఏఎస్, మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు, ఒక ఐఏఎస్ జంట విడాకులు తీసుకుందని ఆరోపిస్తోంది ఆమె… ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా సరే ఫేస్‌బుక్ పోస్టు పెట్టసింది ఇవన్నీ చెబుతూ…
అంటే ఏమిటి అర్థం..? రోహిణి సింధూరి కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది… దాన్నుంచి నా భర్తను ఇప్పటికైతే కాపాడుకున్నాను అని ఆరోపిస్తోంది… అంటే తన భర్త కూడా ఆమె వలలో పడిపోయి, ఆమె అడిగిన సాయాలు చేసిపెడుతున్నాడు అని పరోక్షంగా చెబుతోంది ఆమె… ఇది మరీ సీరియస్… రోహిణిని పూర్తిగా బజారుకు లాగి బదనాం చేయడం… ఇది ఇంకా ఏ రూపం దాల్చుతుందో చూడాలిక… అన్నట్టు రూప మొగుడు మునీశ్‌ను కూడా మొన్న మంగళవారం కర్నాటక ప్రభుత్వం రెవిన్యూ శాఖ నుంచి బదిలీ చేసింది… అదీ ఓ ప్రధానమైన పోస్టులోకి..!!
Share this Article