Sankar G………. శాండో mm చిన్నప్పదేవర్… ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఐదో క్లాస్ వరకే చదివాడు. 9 రూపాయల జీతానికి ఒక మిల్లులో పనిచేశాడు. మద్రాస్ చేరి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. తమిళ్ సూపర్ స్టార్ ఎంజీఆర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆయనకు ఆప్తుడుగా మారాడు. సొంతంగా సినిమా తీయాలనీ MGR డేట్స్ అడిగితే వెంటనే డేట్స్ ఇచ్చి సినిమా తీయించాడు. ఆ సినిమా హిట్.
వరుసగా పదహారు సినిమాలు MGR తోనే చేశాడు. బి. సరోజను మొదటిసారి MGR పక్కన హీరోయిన్ గా నటింపచేశాడు. జయలలిత వచ్చేవరకు MGR అన్ని చిత్రాల్లో సరోజ దేవియే హీరోయిన్. శివాజీ గణేశన్ తో ఒక్క సినిమా కూడా తీయలేదు. ఎక్కువగా భక్తిరస చిత్రాలు, జంతువుల ప్రాధాన్యత ఉన్న చిత్రాలు నిర్మించాడు.
Ads
హిందీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో హాథి మేరే సాథి చిత్రాన్ని నిర్మించాడు. అంతవరకూ ఎవరూ ఇవ్వనంత పారితోషకాన్ని రాజేష్ ఖన్నాకు ఇచ్చాడు. అసలు ఆయనకు హిందీ రాదు. ఒంటిమీద చొక్కా ఉండదు. నడుముకు పంచె, భుజమ్మీద టవల్, నుదుటిన విభూతి నామాలతో సూట్ కేస్ నిండా డబ్బు తీసికెళ్లి, హీరో టేబుల్ మీద పెట్టి, సినిమా డేట్స్, అగ్రిమెంట్ అనేవాడు. డబ్బు చూడగానే హిందీ హీరోలు మారుమటాడకుండా సైన్ చేసేవారట.
తెలుగులో పొట్టేలు పున్నమ్మ, అమ్మ ఎవరికైనా అమ్మ చిత్రాలు నిర్మించాడు. తమిళ్ నిర్మించిన చిత్రాలే తెలుగులో డబ్ చేయించేవాడు. ఈయన సుబ్రహ్మణ్యస్వామికి పరమ భక్తుడు. తనకు సినిమాల్లో వచ్చిన లాభాలను నాలుగు భాగాలు చేసి, ఒక భాగాన్ని మురుగన్ గుళ్లకు దానం ఇచ్చేవాడు. రెండో భాగాన్ని తను ఉంచుకునేవాడు. మూడో భాగాన్ని తను మొదటి సినిమా తీయటానికి ఆర్ధిక సాయం చేసిన మిత్రులకు పంపేవాడు. నాలుగో భాగం పేదలకు, పేద విద్యార్థుల చదువులకు ఇచ్చేవాడు…
Share this Article