అదానీ పని అయిపోయినట్టే… 12 లక్షల కోట్ల మేరకు నష్టపోయాడు… ఇక ఏ బ్యాంకూ తనను సపోర్ట్ చేయదు… వరల్డ్ నంబర్ 3 గా ఎదిగిన ఆయన, తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలినట్టే భావించాలి… ఇక కోలుకోవడం కష్టం… బ్యాంకుల్ని మోసగించాడు… ఈ దేశాన్ని మోసగించాడు…. ఈ దెబ్బకు మోడీ వెన్ను కూడా విరిగినట్టే….. ఇలాంటి వ్యాసాలు, అభిప్రాయాలు, విమర్శలు, విష విషెస్ రోజూ చదువుతున్నాం కదా….. కానీ అదానీని వేరే కోణంలో పరిశీలిస్తూ, ఆర్థిక కోణంలో విశ్లేషించే అభిప్రాయాలు చాలా తక్కువగా కనిపించాయి…
‘‘ఒక రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో ఒక వ్యక్తి ఒక బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు… దుకాణం తెరిచాడు… కానీ అది నామ్‌కేవాస్తే… వ్యాపార నిర్వహణ చేతగాక ఆ దుకాణం దివాలా తీసింది… బ్యాంకుకు అప్పు మిగిలింది… కానీ సదరు రుణగ్రహీత బాగానే ఉన్నాడు…’’ ఇలాంటివాళ్ల సంఖ్య మన దేశంలో అపారం… కానీ అదానీ ఆ టైపు కాదు… తను అడుగుపెట్టిన ఫీల్డ్స్‌లో ఉన్నత ప్రమాణాల్ని సాధిస్తున్నాడు… తనకు వ్యాపారం తెలుసు… రుణాల్ని ఎలా వినియోగించాలో తెలుసు… అఫ్‌కోర్స్, తన విస్తరణలో భాగంగా మోడీ అండ తీసుకుని కొందరిని బెదిరిస్తున్నాడు, పక్కకు తప్పిస్తున్నాడు… అత్యంత బలమైన ప్రపంచస్థాయి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించే దిశలో తప్పులూ చేస్తున్నాడు… అయితే…
షేర్ మార్కెట్‌లో కరెక్షన్స్ చాలా సహజం… డొల్ల కంపెనీలు, బ్యాంకు అప్పులు, పార్టీల సపోర్టు లేని పెద్ద కంపెనీని చూపించండి ఇండియాలో… చివరకు ఇంత మాట్లాడుతున్న సీపీఎం కూడా టెన్ టీవీ విషయంలో చేసింది ఏమిటి..? అది ఇంకా ఘోరం కదా, కూలీనాలీ చేసుకునే కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసింది… సో, మరో కోణంలో ఆలోచిస్తే అదానీకే ప్రస్తుత పరిణామాలన్నీ ఉపయుక్తం… తనను తాను కరెక్ట్ చేసుకుంటాడు… అదొక ఫీనిక్స్… కానీ ఆర్థిక కోణంలో అదానీని సరిగ్గా విశ్లేషించేది ఎవరు..? అదానీని మోడీ కోణంలో చూడటం కరెక్టు కాదు… అదానీని ఓ వ్యాపారిలాగే చూడాలి… అదెందుకు జరగడం లేదు..? ఈ ప్రశ్నలకు ఎకనామిక్ టైమ్స్‌లో ఓ వ్యాసం జవాబుగా కనిపించింది…
Ads
Share this Article