ముందుగా ఒక చిన్న విషయం చెబుతాను… మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ పేరు విన్నారా..? తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు… అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దర్బార్, బీస్ట్, తిరు… ఇలా… తెలుగులో బ్రహ్మాండంగా హిట్ సినిమా లేదు గానీ తమిళంలో తనే టాప్ ఇప్పుడు… సినిమాలే కాదు, ఈరోజున లైవ్ కన్సర్ట్‌లు ఇరగదీస్తున్నది కూడా తనే… తను ఓ సంచలనం…
ఈమధ్య ఓ తూర్పు దేశంలో తను ప్రోగ్రామ్ పెడితే… అక్షరాలా పది కోట్ల రూపాయల విలువైన టికెట్లు తెగాయి… వేల మందికి టికెట్లు దొరకలేదు… తన ప్రోగ్రాంతో ఉర్రూతలూగించాడు… నిజం చెప్పాలంటే థమన్లు, డీఎస్పీలు అస్సలు పోటీకి కూడా రాలేరు తనతో… అంతగా హిట్ పర్‌ఫార్మర్… ఏవో నాలుగు పాటల ట్యూన్లు కాపీ కొట్టి, ఏదో పిచ్చి కంటెంటుతో తెలుగు ప్రేక్షకులను రంజింపచేయవచ్చునేమో… కానీ వేల మందిని లైవ్ కన్సర్ట్ లో రంజింపచేయడం అంటే మాటలు కాదు…
ఏమాటకామాట బాలసుబ్రహ్మణ్యం కచేరీలు చాలా ఫేమస్… ఇక్కడా, విదేశాల్లో కూడా… ఎవరు తప్పు పాడినా సహించేవాడు కాదు… ఈ పాటల గురించే కదా తనకూ ఇళయరాజాకు నడుమ పేటెంట్ డబ్బుల తగాదా వచ్చింది… అన్నట్టు ఇళయరాజా అంటే గుర్తొచ్చింది… ఆదివారం సాయంత్రం హైదరాబాదులోనే ఓ కన్సర్ట్ నిర్వహించాడు… ఫ్లాప్… భారీ ఖర్చుకు ఈ ప్రోగ్రాం నిర్వహణను చేపట్టిన ఈటీవీ నెత్తికి చేతులు పెట్టుకున్నట్టే… ప్రోగ్రాం ఏమాత్రం అలరించలేకపోయింది… సోషల్ మీడియాలో కూడా మిత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు…
Ads
ఈ ఖర్చు కవర్ చేసుకోవడానికి ప్రోగ్రాం మొదట్లో గంట సేపు యాడ్స్, రకరకాల ప్రోమోస్ నడిపించారు… ఆరున్నరకు ప్రోగ్రాం స్టార్ట్ కావాలి… ఈ యాడ్స్, ఈ ప్రోమోస్ పూర్తయి ఇళయరాజా వేదిక మీదకు రావడానికి గంటసేపు పట్టింది… అదీ నేరుగా వచ్చేశాడు… ఇంట్రడక్షన్ చెప్పేవాళ్లు లేరు… హోస్ట్ గానీ, యాంకర్ గానీ లేరు… గతంలో జేసుదాసు నిర్వహించిన ప్రోగ్రాం యాదికొచ్చింది… జేసుదాసు కొడుకు అన్నీ తానై చూసుకున్నాడు, పాడాడు, తండ్రితో పాడించాడు… హిట్… మళ్లీ తరువాత జేసుదాసు ప్రోగ్రాం చేసినప్పుడు ఆయన కొడుకు లేడు,.. ప్రోగ్రాం ఫ్లాప్… చిత్ర తనే ఇప్పటికీ మధురంగా పాడుతుంది కదా ఆమె కచేరీలు కూడా ఫేమస్…
ఇక ప్రోగ్రాం గురించి చెప్పాలంటే… సౌండ్ సిస్టం వరస్ట్… చెవులు మోతెక్కిపోయాయి… ఓపెన్ ఆడిటోరియం కదా, ఏ సౌండ్ సిస్టం బాగుంటుందో చూసుకోవాలనే సోయి లేదు… మనో, ఎస్పీ చరణ్ తప్ప తెలిసిన గాయకులెవరూ లేరు… మనో కూడా పాడాలి కాబట్టి పాడుతున్నాను అన్నట్టుగా పాడాడు… చరణ్ పాడటం మరిచిపోయి చాలాకాలమైంది కాబట్టి తనను ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు… మిగతావాళ్లంతా సోసో… ఇళయరాజా ఫాఫం, రెండుమూడు పాటలు కష్టపడి పాడాడు… తనకేమో తెలుగు రాదు…
తమకు నచ్చిన పాటలు వచ్చినప్పుడు కొందరు చప్పట్లు కొట్టారు తప్ప ఓవరాల్‌గా ప్రోగ్రాం రక్తికట్టలేదు… శ్రోతలను పూర్తిగా రంజింపచేయలేదు… 1500 నుంచి 15 వేల దాకా టికెట్లు పెట్టినప్పుడు ఆమేరకు కచేరీ మీద కాన్సంట్రేషన్ చేయాలి… అదే లోపించింది… ప్రత్యేకించి శ్రోతకూ, గాయకుడికీ నడుమ (పర్‌ఫార్మర్) సంధానకర్త ఎవరైనా ఉండాలి… హోస్టింగ్ లేకపోవడం పెద్ద మైనస్… మనో ఒక పాట పాడుతున్నప్పుడు ఆ ఫ్లూటిస్ట్ జీవితం మీద వైరాగ్యం కలిగేలా వాయించాడు… ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాట ఖూనీ అయిపోయింది… అంటే, ఇవి ఒకటీరెండు ఉదాహరణలు… ప్చ్, ఇళయరాజా స్థాయికి తగిన కచేరీ మాత్రం కాదు ఇది… తన పేరును చెడగొట్టుకోవడమే ఇది…
కొసమెరుపు- ఆరేడు సందర్శిని స్టాల్స్… గ్రౌండ్ లోనే ఏర్పాటు చేశారు…
సమోసా- 50₹
చిప్స్. – 100₹
Share this Article