ఒక్క చంద్రబాబేనా..? బావమరిది బాలయ్య, కొడుకు లోకేష్ కూడా బోలెడుసార్లు నోరుపారేసుకున్నారు… అవి నాలుకలు కావనీ, తాటిమట్టలనీ వాళ్లకువాళ్లే నిరూపించుకున్నారు… తెలంగాణ వచ్చినందుకు కాదు, ఇలాంటి బేకార్లను వదిలించుకున్నందుకు తెలంగాణ సమాజం సంతోషిస్తోంది… మళ్లీ మళ్లీ అవే కూతలు రాగులు, సజ్జలు, జొన్నలు తిని బతికే తెలంగాణ జనం ఎన్టీయార్ రెండురూపాయల బియ్యం ఇచ్చాకే అన్నం తిన్నదట… మెదళ్లు పాదాల్లోకి దిగిపోయినట్టున్నయ్…
ఇదే చెబుతూ ఓ మిత్రుడి సెటైర్ ఏమిటంటే… ‘‘గతంలో నారావారిపల్లెలో అమ్మణమ్మ అనే ఓ అమ్మ ఉండేది… ఖర్జూరనాయుడు అనే తండ్రి ఉండేవాడు… చంద్రబాబు పేరెంట్స్… వాళ్లింట్లో అస్సలు రాగిముద్ద, రాగుల రొట్టెలు ఉండేవి కావు… తెల్లవారే చికెన్ దమ్ బిర్యానీ వండేవాళ్లు ఇంట్లో… మధ్యాహ్నం సన్నన్నంతో పాయసం… రాత్రి మటన్ బిర్యానీ… లేకపోతే చంద్రబాబుకు అస్సలు ముద్ద దిగేది కాదు… వాళ్లు తినడమే కాదు, ఊరివారందరికీ సన్నబియ్యంతో అన్నసంతర్పణ చేసేవాళ్లు…’’ ఆమధ్య రాసుకున్న ముచ్చటే మరోసారి చదువుదాం ఇలా…
మొన్నామధ్య పవన్ కల్యాణ్ కూడా ఇలాగే మాట్లాడాడు… అసలు చంద్రబాబు, పవన్, బాలయ్య ఏమిటి..? వాళ్లందరూ అంతే… ఆంధ్రులు వచ్చాకే తెలంగాణ సమాజం బట్టకట్టింది, ము– కడుక్కుంది… పళ్లుతోముకోవడం, స్నానం చేయడం కూడా నేర్చుకున్నారు తెలంగాణ ప్రజలు… మరీ ఎన్టీయార్ వచ్చాక తెలంగాణ సమాజం నాగరికతను నేర్చుకుంది… చంద్రబాబు ధోరణీ అదే… మరి తనకున్న జ్ఞానసంపద, చరిత్రవిజ్ఞానం మనకు లేదు కదా… ఉండదు కదా… అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు మనవి అండమాన్ గుహల సెంటినలీస్ బతుకులే కదా… ఆంధ్రుల వంటి నాగరికులను చూస్తే భయంతో దాక్కునేవాళ్లం కదా… బట్ట ఉండదు, ఏదో అఢవుల్లో దొరికే కందమూలాలు తింటూ, ఎప్పుడైనా రాగులు, జొన్నలో పండితే పండుగ చేసుకోవడం… పొద్దెక్కేదాకా పడుకోవడం…
Ads
భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, ఓ గౌరవప్రదమైన జీవనవిధానం లేదు… ఆటవికుల్లా బతికేవాళ్లం… ఎన్టీఆర్ వచ్చాకే వరిఅన్నం మొహం చూశాం… రేషన్ బియ్యంతో రోజూ పండుగ చేసుకున్నాం… పొద్దున్నే లేచి పనిచేయడం నేర్చుకున్నాం… ము– కడుక్కోవడం నేర్చుకున్నాం… బట్ట కట్టాం, భాష ఒంటబట్టింది… మనుషుల్లా బతకడం ఎన్టీయార్ వచ్చాకే మొదలైంది… పవన్ కల్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు… అందరివీ అలాంటివే కూతలు… వాళ్ల జన్యువుల్లోనే తెలంగాణ వ్యతిరేకత అంతఃనిర్మితమై ఉంటుందేమో… ఏ పార్టీ, ఏ కులం అనే తేడా ఏమీలేదు…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా సరే… మీరూ వద్దు, మీ సోపతి వద్దు, అయ్యోడివా, నువ్వు అవ్వోడివా అంటూ వెళ్లగొట్టినా సరే… ఎనిమిదేళ్లయినా ఓ చిన్న రాజధాని కట్టుకునే దిక్కులేదు, తెలివి లేదు ఈరోజుకూ… తెలంగాణ మీద పడి తింటూ, తెలంగాణ మీదే ఏడుపు… ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్ ఈరోజుకూ తెలంగాణ బియ్యమే తినేది… ఎవడి తిండి తింటే వాడినే తిట్టిపోయడం కదా వీళ్లు నేర్పే మర్యాద… తెలంగాణ అంటే ఈరోజుకూ అదే వెక్కిరింపు, అదే హేళన… వరిబియ్యం ఇవ్వడమే కాదు, వండుకోవడం తెలియకపోతే ఎన్టీయారే ఊరూరా క్యాంపులు పెట్టి, అన్నం ఎలా వండుకోవాలో నేర్పించినట్టున్నాడు అప్పట్లో… అంతేనా సార్..?
ఆ మనస్సుల్లో ముద్రపడిపోతుంది చిన్నప్పటి నుంచే… తెలంగాణ మీద ఇలాంటి భావనలు… వీళ్లకు చరిత్ర తెలియదు, అక్కర్లేదు, తిండిని వెక్కిరించాలి, బట్టను వెక్కిరించాలి, భాషను వెక్కిరించాలి, పండుగను వెక్కిరించాలి… ఇప్పుడు మళ్లీ ఉద్దరిస్తారట బయల్దేరారు… షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు… వీళ్లు చదివే వేల పుస్తకాల్లో హైదరాబాద్ రాజ్య చరిత్ర ఉండదు… కాకతీయ పాలన వైభవాల చరిత్ర ఉండదు… ప్రకాశం బ్యారేజీ, ధవళేవ్వరం రాకమునుపు బతుకుల మాటేమిటో ఆత్మసోయి అసలే ఉండదు…
కాకతీయుల కాలంలోనే గొలుసుకట్టు చెరువులు, పెద్ద పెద్ద మధ్యతరహా ప్రాజెక్టులు, అప్పట్లోనే సన్నబియ్యం పంటలు… బిర్యానీల ఘుమఘుమలు వీళ్ల మెదళ్లకెక్కవు… ఎన్టీయార్ సైకిల్ మీద ఇల్లిల్లూ తిరుగుతూ పాలమ్ముకునే సమయానికి హైదరాబాదు రాజ్యానికి సొంత రైల్వే, సొంత పవర్ స్టేషన్, సొంత కరెన్సీ, సొంత విమానాశ్రయం, సొంత యూనివర్శిటీ ఉండేవనీ తెలియదు… దేశదేశాలతో సాంస్కృతిక సంబంధాలున్న నగరం ఇది… ఇవన్నీ ఎందుకు..? శ్రీనాథుడు ఏం రాశాడో గుర్తు చేస్తే సరిపోతుందిగా…
‘‘చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జ జొన్న కూళ్లు సర్పంబులును తేళ్లు
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు
జొన్న కలి, జొన్న యంబలి
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్
సున్న సుమీ సన్నన్నము
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరికున్
గరళము మ్రింగితిననుచున్
పురహర, గర్వించబోకు, పో, పో, పో, నీ
నీ బిరుదింక గాన వచ్చెడి
మెఱసెటి రేనాటి జొన్న మెతుకులు తినుమీ
రసికుడు పోవడు పల్నాడె
సగంగా రంభమైన నేకులె వడకున్
వసుధేశుడైనను దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్
మొన్నటి పాత రాతే కదా ఇది అంటారా..? మరి చంద్రబాబు నోట మునుపటి పాత కూతే కదా మళ్లీ మళ్లీ… ఎవడైనా ఆ తాటిమట్ట మీద నాలుగు చురకలు పెడితే బాగుండు అనిపిస్తోందా..? తప్పులేదు..!! తరిమేసినా సరే శరంలేకుండా మళ్లీ మళ్లీ వస్తుండు, ఏదో ఒకటి కూస్తుండు…!!
Murali Buddha……….. సిగ్గులేని జీవులు… 1951 నాటికే తెలంగాణాలో 16 లక్షల ఎకరాల్లో వరి పండించారు … ఇది తెలంగాణ. ఇప్పుడు చెబుతున్న లెక్కలు కాదు . అమెరికా ఆరు దశాబ్దాల క్రితం ప్రచురించిన వివరాలు . (ఫోటోలు మిత్రులు Rajender Reddy Gannu సహకారం తో )
Share this Article