పాత హిట్ పాటలను రీమిక్స్ చేసి కొత్త సినిమాల్లో వాడుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే… ఇందులో చాలా రకాలు.., ముఖ్యమైనవి… 1) ట్యూన్ అదే ఉంటుంది, కాస్త గాయకుల టోన్ కొత్తగా ఉంటుంది… కంటెంటు కూడా సేమ్… అంటే పాత పాటే కొత్తగా వినిపిస్తుంది… వీలైనంతవరకూ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా పాతవే వాడతారు… ఉదాహరణకు రీసెంటుగా కల్యాణరాం అమిగోస్ సినిమాలో పాత వెంకటేష్ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ పాట రీమిక్స్ చేసి వాడటం…
అప్పట్లో అది సూపర్ హిట్ పాట… లోతుగా ఆలోచిస్తే బూతులా ధ్వనించే కంటెంటు… కాకపోతే ట్యూన్, పాడినవారి టోన్ ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటను హిట్ చేశాయి… అయితే అమిగోస్ సినిమాలో కల్యాణరాం దానికి పెద్దగా సూట్ కాలేదు… అది వేరే సంగతి… చిరంజీవి పాటలు బంగారు కోడిపెట్ట, శుభలేఖ రాసుకున్నా రాంచరణ్ వాడినట్టున్నాడు… బాగానే సూటయ్యాయి… సాయిధరమ్ తేజ గువ్వా గోరింక పాటను రీమిక్స్ చేయించుకున్నాడు, పర్లేదు… 2) పాత హిట్ పాటల ట్యూన్ వాడుకుని కొత్త కంటెంటుతో కొట్టడం… ఉదాహరణకు ఆకుచాటు పిందె తడిసె స్టయిల్‌లో జూనియర్ ఎన్టీయార్ అదేదో సినిమాలో 2002 వరకు చూడలేదే ఇంత సరుకు అని కొత్తకొత్తగా కొట్టాడు… ఇదీ హిట్టయింది…
అదే జూనియర్ ఎన్టీయార్ యమగోలలో మరో హిట్ ఎన్టీయార్ పాట ఓలమ్మీ తిక్కరేగిందాలో పల్లవిని అలాగే ఉంచేసి, మిగతా కంటెంట్ మార్చిపారేశారు రాజమౌళి, కీరవాణి… పాట స్టార్ట్ కావడమే కిలికిలి భాషలో ఉంటుంది… అదో టైపు రీమిక్స్… ఎహె, ఇవన్నీ కథలెందుకు అనుకుంటే పాత పాటను యథాతథంగా కొత్త సినిమాలో వాడేసుకోవడం… దీన్ని రీమిక్స అనలేం… ఇప్పుడు మరో టైపు…
Ads
పాత ఎన్టీయార్, పాత ఏఎన్నార్, పాత వెంకటేశ్, పాత బాలకృష్ణ, పాత చిరంజీవి పాటల్ని మనం రీమిక్స్ చేసుకోవడం దేనికి… మనవే పాత హిట్ పాటలు బోలెడున్నయ్, వాటిల్లో మెరికలాంటి మాస్ పాట వెతికి రీమిక్స్ చేసుకుంటే సరిపోదా… ఇది మరీ డబుల్ డోస్‌లా ఉంటుంది కదా అనేది ఇప్పటి ఆలోచన… చిరంజీవిది ఓ హిట్ పాట ఉంది కదా… రామ్మా చిలకమ్మా… అప్పట్లో సూపర్ హిట్… ఇప్పుడు రాబోయే భోళా శంకర్ సినిమా కోసం దాన్ని రీమిక్స్ చేస్తారట…
ఇదేదో బాగుంది కదాని బాలయ్య కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమాకు సమరసింహారెడ్డి సినిమాలోని ఓ పాటను సెలక్ట్ చేశాడట… అదే అందాల ఆడబొమ్మా పాట… అప్పట్లో అదీ సూపర్ హిట్… బాలయ్య వీరాభిమాని థమన్ అప్పుడే ఆ పని స్టార్ట్ చేశాడట కూడా… కొత్త ట్యూన్లు కష్టం, కాపీ కొట్టాల్సి వస్తుంది గానీ ఇదెంత పని… డమడమ వాయించేయడమే… కాకపోతే పాత పాట ఉదిత్ నారాయణ్ పాడాడు… ఈయన ఎవరితో పాడిస్తాడో… ప్రస్తుతం తారకరత్న మరణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందట… త్వరలో చకచకా పూర్తి చేసేసి దసరాకు రిలీజ్ చేస్తారట…
Share this Article