హీరో అర్జున్ అనగానే గుర్తొచ్చింది… తన పరివారం మొత్తం సినిమావాళ్లే… తన చుట్టూ సినిమా వాతావరణమే… విష్వక్సేనుడితో వివాదం వార్త రాస్తూ ఓసారి అర్జున్ వివరాలు సెర్చుతుంటే… ఈ వివరాలు అచ్చెరువుగొలిపాయి… అసలు ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా కాసేపు అర్థం కాలేదు…
- శక్తిప్రసాద్… ఈయన నటుడు… ఈయన కొడుకు కిషోర్ సర్జా… ఈయన దర్శకుడు… ఈయన భార్య పేరు అపర్ణ కిషోర్… వీళ్ల కొడుకు పేరు సూరజ్ సర్జా… ఈయన సంగీత దర్శకుడు…
- కిషోర్ ప్రసాద్ కొడుకు పేరు అర్జున్ సర్జా.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరో, దర్శకుడు, నిర్మాత తనే… ఈయన భార్య పేరు నివేదిత… ఈమె నటి… ఈమె తండ్రి పేరు రాజేష్… ఈయన నటుడు… నివేదిక కజిన్ పేరు అను ప్రభాకర్… ఆమె కూడా నటి… ఆమె భర్త పేరు రఘు ముఖర్జీ… ఆయన కూడా నటుడే…
- అను ప్రభాకర్ మాజీ అత్త పేరు జయంతి… ఆమె నటి… (తెలుగువాళ్లందరికీ చిరపరిచితం ఈ పేరు…) ఈ జయంతి మాజీ భర్త పేరు పేకేటి శివరాం… అతనూ నటుడే…
- అర్జున్ సర్జా కూతురి పేరు ఐశ్వర్య… ఆమె హీరోయిన్… మరో కూతురి పేరు అంజన… ఆమె ప్రొడ్యూసర్…
- అర్జున్ మేనల్లుడి పేరు భరత్ సర్జా తను నటుడు… మరో మేనల్లుడు పవన్ తేజ, తను కూడా నటుడే…
- శక్తిప్రసాద్ మరో బిడ్డ పేరు అమ్మాజీ… ఆమెకు కొడుకు పేరు చిరంజీవి సర్జా… నటుడు… ఈ చిరంజీవి భార్య పేరు మేఘన రాజ్… ఆమె హీరోయిన్…
- ఈ మేఘన రాజ్ తండ్రి పేరు సుందర్ రాజ్… ఈయన నటుడు కమ్ దర్శకుడు… మేఘన రాజ్ తల్లి పేరు ప్రమీలా జోషి… ఈమె ప్రొడ్యూసర్ కమ్ నటి…
- ఈ అమ్మాజీ కొడుకు పేరు ధ్రువ సర్జా… ఇప్పుడు కన్నడంలో దుమ్ము రేపేలా ఓ సినిమా చేస్తున్నాడు… యశ్, రిషబ్‌లకు పోటీపడతాను అంటున్నాడు…ఈయన భార్య పేరు ప్రేరణ శంకర్…
Ads
వీరందరిలో హీరో అర్జున్ చాలా ఫేమస్ కేరక్టర్… తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో హీరోగానే కాదు, ఏ పాత్ర నచ్చితే అది చేస్తాడు… చిరంజీవి, బాలకృష్ణ తదితరుల సమకాలీనుడు… హనుమంతుడికి వీరభక్తుడు… అప్పట్లో కృష్ణవంశీ నితిన్‌తో శ్రీఆంజనేయం సినిమా చేస్తూ అర్జున్‌ని అడగ్గానే హనుమంతుడి వేషానికి వోకే చెప్పాడు… ఈమధ్య ఆంజనేయుడికి చెన్నైలో ఓ సుందరమైన ఓపెన్ టెంపుల్ కట్టించాడు… కేసీయార్ బిడ్డ కవిత చెన్నై వెళ్లినప్పుడు అక్కడికి వెళ్లింది… ఈ మొత్తం అర్జున్ పరివారంలో మనందరికీ బాగా పరిచయం తను ప్లస్ జయంతి… ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్జున్ అంటే సౌత్ ఇండియన్ మూవీ… దట్సాల్…!!
మొత్తం 130 వరకూ సినిమాలు చేశాడు… తెలుగులో అప్పుడెప్పుడో, అంటే 1985లో వచ్చిన మాపల్లెల్లో గోపాలుడు సూపర్ హిట్… అందులోని పాటలు ఈరోజుకూ పాపులరే… అప్పట్లో రాణీరాణమ్మా అనే పాటయితే అందరి నోళ్లలోనూ నానిన సూపర్ హిట్ సాంగ్… తరువాత జెంటిల్‌మన్ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకుపోగా… శ్రీమంజునాథ కూడా ఆ రీచ్‌ను మరింత పెంచింది… అందులో బ్రెత్‌లెస్ సాంగ్ ఓం మహాప్రాణదీపం సూపర్ హిట్ సాంగ్..!!
Share this Article