Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టన్నింగ్ యాక్షన్ సీన్ల మార్టిన్… హీరో ధ్రువ కేజీఎఫ్ యశ్‌కే సవాల్ విసురుతున్నాడట…

March 1, 2023 by M S R

ఇప్పుడు ఇండియన్ సినిమాలో కన్నడిగులదే హవా… గత ఏడాది కాంతార, కేజీఎఫ్-2, విక్రాంత్ రోణ, 777 చార్లీ వసూళ్లలో ఇరగదీశాయి… వాళ్ల వచ్చే సినిమాలు కూడా ప్రిస్టేజియస్ సినిమాలే… ప్రత్యేకించి ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి బ్రహ్మాండమైన కెరీర్ బాటలోకి మళ్లారు… ఆ సినిమాల్లో హీరోలు యశ్, రిషబ్ ఇప్పుడు ఫుల్లు డిమాండ్ ఉన్న హీరోలు… ‘‘వాళ్లకు తాను సవాల్ విసురుతాడు, కేజీఎఫ్ తాత వంటి యాక్షన్ సినిమాను తీస్తున్నాడు’’ అంటున్నారు అప్పుడే సర్జా ధ్రువ నటించిన మార్టిన్ అనే సినిమా గురించి సినిమా జర్నలిస్టులు…

ఇతను ఎవరో తెలుసు కదా… హీరో అర్జున్ మేనల్లుడు… పదేళ్ల నుంచీ ఇండస్ట్రీలో ఉన్నా ఆరేడు సినిమాలే ఉన్నాయి తనకు… అందులో పెద్ద హిట్టేమీ లేదు… కానీ ఇప్పుడు రాబోయే మార్టిన్ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ పూర్తిగాక ముందే ఫుల్ హైప్ క్రియేట్ చేసుకుంది… తరణ్ ఆదర్శ్ అనే ప్రఖ్యాత సినిమా విమర్శకుడు 2023లో మోస్ట్ ప్రామిసింగ్ సినిమా కాబోతుందని అంచనా వేస్తున్నాడు దీన్ని… 

dhruva

Ads

పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సీన్స్ అంటే ఏమిటో ఈ సినిమా రుచిచూపించబోతోంది… టీజర్ ఆ ముందస్తు సూచనల్ని జారీ చేసింది… ఈ పాన్ ఇండియా సినిమా దర్శకుడి పేరు ఏపీ అర్జున్… ఈయన తీసినవే నాలుగు సినిమాలు… ప్రతి సినిమాకు నడుమ మూడునాలుగేళ్ల గ్యాప్… అలాంటిది ఒకేసారి ఓ భీకరమైన సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు… అసలు టీజర్‌తోనే ఫుల్లు చర్చనీయాంశం చేసేశాడు సినిమాను…

ఏడాదికాలంగా షూటింగ్ జరుగుతోంది… హైదరాబాదులో ఓ భారీ సెట్‌లో 45 రోజులపాటు కొన్ని సీన్లు, వైజాగ్‌లో నెలపాటు ఓ ఛేజ్ సీన్ పూర్తి చేశారు… 35 రోజులపాటు కశ్మీర్‌లో షూటింగ్ జరిగింది… (ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లోని పలు లొకేషన్లలో సినిమాల షూటింగులు జరుగుతున్నాయి)… అక్కడ ఐస్ వార్ సీన్లు షూట్ చేశారు… క్లైమాక్స్ సీన్‌కే 40 రోజులు పట్టిందట… ‘‘ఇంత లెంతీ క్లైమాక్స్ బహుశా ఈ సినిమాలోనే ఫస్ట్… కథ అలా డిమాండ్ చేస్తోంది… ప్రేక్షకుల్ని స్టన్ చేయడం ఖాయం…’’ అంటున్నాడు దర్శకుడు… సినిమాలో వైభవి శాండిల్య హీరోయిన్, కానీ పెద్దగా రొమాన్స్ సీన్లు ఉండవు… హీరోల్లో ఒక పాత్ర పేరు అర్జున్, మరో పాత్ర పేరు మార్టిన్…

ఆమధ్య లైగర్ సినిమాలో మైక్ టైసన్ ఫైట్ సీన్లున్నాయి కదా… ఈ మార్టిన్ సినిమాలో ఇద్దరు ఇంటర్నేషనల్ హెవీ వెయిట్స్‌తో ఫైట్ సీన్స్ పెట్టారు… ఒకరి పేరు నెక్‌జిలా… రెండో అతని పేరు నాథన్ జోన్స్, ఈయన యూఎఫ్సీ మాజీ చాంపియన్ కూడా… ‘‘ఈ భారీ దృఢకాయులతో ఫైట్ అనగానే మొదట ఠారెత్తిపోయాను… ఇది నటన మాత్రమేననీ, మనం సినిమా కోసం నటిస్తున్నామనీ మీరు మనసులో పెట్టుకొండి ప్లీజ్ అని పదే పదే వాళ్లకు చెప్పాను ఎందుకైనా మంచిదని…’’ అని సరదాగా చెబుతున్నాడు మార్టిన్ అలియాస్ ధ్రువ సర్జా…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions