ఈమాత్రం కట్ అండ్ పేస్ట్ యవ్వారానికి కూడా బోలెడంత టైమ్ తీసుకుంటారు మనవాళ్లు… కథ మాత్రమే ఒరిజినల్ నుంచి తీసుకుంటాం, దాంట్లో మార్పులు దగ్గర నుంచి పాటలు, మాటలు, షూటింగ్, క్యాస్టింగ్, మార్కెటింగ్ ఒప్పందాలు, ఇతరత్రా టెక్నికల్ విషయాలు, వీఎఫ్ఎక్స్… మళ్లీ కొత్త సినిమా తీసినట్టే కదా అంటారు రీమేక్ దర్శకులు, హీరోలు… మరి ఇదంతా తంతు తప్పనిసరే అయినప్పుడు మంచిగా తెలుగు కథే రాయించుకోవచ్చు కదా…
ఐనా కథదేముంది..? ఆవారా హీరో, మాఫియా విలన్… ఆ విలన్‌కే బిడ్డ, ఆమె వెంటబడి పడేసే హీరో… డిష్యూం డిష్యూం… నాలుగు పాటలు, ఓ ఐటమ్ సాంగ్, అరడజను ఫైటింగ్ సీన్లు, వాటిల్లో సూపర్ మ్యాన్ హీరో… అన్నింట్లోనూ అదే కదా… ఈమాత్రం దానికి కథ కొత్తగా అనిపించింది, కథ చెప్పగానే ఓకే చెప్పాను, ఈమధ్య వంద కథలు విని ఉంటాను, ఏదీ నచ్చలేదు అంటూ సొల్లు కబుర్లు చెబుతుంటారు సినిమావాళ్లు…
Ads
ఈ రీమేకుల విషయానికొస్తే హిందీ వాళ్లు మన సినిమాల్ని రీమేక్ చేసుకోవడం కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో ఉంది… ఇప్పుడు నేరుగా హిందీలోకి డబ్ అయిన సినిమాలు దుమ్మురేపుతున్నాయి కాబట్టి హిందీ సినిమా మైనస్ పాయింట్లన్నీ ఎక్స్‌పోజ్ అవుతున్నాయి… సౌత్ హీరోలు చేసిన రీమేక్ సినిమాలను టైమ్స్ వాడు లెక్కతీశాడు… స్టార్లు, సూపర్ స్టార్లు కూడా…
Kamal Haasan (Tamil) – 60 + Movies
Rajinikanth (Tamil) – 60 Remakes
తలైవార్ రజినీగా పిలిపించుకునే హీరో రజినీకాంత్ కూడా 60 రీమేకులు చేశాడు… ఈయన మొత్తం 260 రీమేక్స్ చేయగా, అందులో 60 అంటే కమల్ హాసన్‌కన్నా ‘రీమేక్ పర్సంటేజ్’ తక్కువ గానీ సంఖ్య సేమ్… కమల్ కాస్త నయం, రకరకాల ప్రయోగాలు చేస్తాడు… రజినీకాంత్ అయితే అన్నీ మూస కథలే…
Chiranjeevi (Telugu) – 38 remakes
తెలుగులో చిరంజీవి దాదాపు 150 సినిమాలు కదా తీసింది… అందులో 38 రీమేకులే… మరీ ఈమధ్య రీమేకులు తప్ప ఇంకేమీ తీయడం లేదు… ఐతే ఒరిజినల్‌కూ తన ఇమేజీకి సరిపడా మార్పులు అనేసరికి, ఒరిజినల్‌తో అసలు పోలికే లేకుండా పోతోంది… ఒక్క బేసిన్ సినిమా ప్లాట్ మాత్రమే తీసుకుంటున్నారు…
Mohan Lal (Malayalam)– 34 movies
మామూలుగా మలయాళం సినిమాల నుంచి అందరూ రీమేక్స్ చేస్తుంటారు… మలయాళం ఇండస్ట్రీ కథలపరంగా స్ట్రాంగ్… పైగా తక్కువ బడ్జెట్‌లో సినిమాను తీసేస్తారు… సో, రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ… వాటిల్లో హిట్టయినవి వేరే భాషల హీరోలు కొనుక్కుని పోతారు… మోహన్‌లాల్ దాదాపు 350 సినిమాలు తీసుంటాడు… అందులో 34 రీమేక్స్…
Venkatesh Daggubati (Telugu) – 32 remakes
సాధారణంగా తెలుగు హీరో వెంకటేష్ అనగానే రీమేక్ అనే పదం గుర్తొస్తుంది… అన్ని సినిమాలు చేశాడు తను… కానీ నిజానికి లెక్క తీస్తే చిరంజీవితకన్నా తన ఖాతాలో రీమేకుల సంఖ్య తక్కువే… దాదాపు 70 సినిమాలు చేసుంటాడు కదా అందులో 32 రీమేకులే… అంటే పర్సంటేజీ పరంగా ఎక్కువ వెంకటేషే… అందుకే తనను రీమేక్స్ హీరో అంటుంటారు…
Dr. Shiva Rajkumar (Kannada) – 28 remakes
కన్నడంలో రాజకుమార్ కొడుకు శివ కూడా స్టార్ హీరోయే దాదాపు… చాలా ఏళ్లుగా, అంటే దాదాపు 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు… 100 సినిమాల వరకూ చేసుంటాడు… అందులో 28 రీమేకులే… కన్నడ సినిమాలు మొన్నమొన్నటిదాకా బయట కనిపించేవి కావు, ఎవరూ చూసేవారు కాదు కాబట్టి ఈయన సినిమాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు…
Upendra (Kannada) – 27 movies
తెలుగువారికి కాస్త పరిచయం ఉన్న పేరు ఉపేంద్ర… చిత్ర విచిత్రమైన టైటిల్స్‌తో అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరించేవాడు… స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా కొన్ని చేసినట్టున్నాడు… హీరోయేతర పాత్రలు కూడా… తను దర్శకుడు… తన రీమేకుల సంఖ్య 27…
Mammootty (Malayalam) – 26 Films
సంఖ్యాపరంగా హీరోగా బహుశా మమ్ముట్టి చేసినన్ని సినిమాలు మరే ఇతర సౌత్ హీరో చేసి ఉండడు… దాదాపు 400 సినిమాలు… అందులో జస్ట్, 26 మాత్రమే రీమేకులు… అవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు భాషల నుంచి తీసుకున్నవే ఎక్కువ… సౌత్ టు సౌత్ రీమేకులు తక్కువే…
Nagarjuna Akkineni (Telugu) – 20+ remakes
ఇప్పుడంటే రీమేకుల సంఖ్య తక్కువ గానీ, గతంలో నాగార్జున కూడా పలు రీమేకులు చేసినవాడే… తను మొత్తం 100 సినిమాలు చేసి ఉంటే, అందులో 20 వరకూ రీమేకులు… ఎక్కువగా ఎయిటీస్, నైంటీస్‌లో ఈ రీమేకులు ఎక్కువగా చేశాడు…
Nandamuri Balakrishna (Telugu) – 17 remakes
బాలకృష్ణవి ఎక్కువగా తెలుగులో వండబడిన కథలే అయి ఉంటాయి… దాదాపు అన్నీ మూస… రజినీకాంత్ తరహాలో టిపికల్ సౌత్ హీరో తరహా… తను కూడా దాదాపు 100 సినిమాలు తీస్తే, అందులో 17 రీమేకులు… సో, సౌత్ స్టార్స్ ఎవరూ రీమేకులకు అతీతులు కాదు… కాకపోతే అయిదూ పది సినిమాలు అటూఇటూ… ఇప్పుడు మాత్రం రీమేకుల జోలికి పోవడం లేదు తను…
Share this Article