శాసన వ్యవస్థకు పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభలు ఉండును… అవి చట్టాలు చేయును… వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయును… రాజ్యాంగస్పూర్తి దెబ్బతినకుండా చట్టాల అమలు తీరూతెన్నూ సుప్రీంకోర్టు కాపు కాయును… ప్రజాస్వామ్యంలో ఈ మూడింటికీ వేర్వేరు బాధ్యతలు ఉండును… ఇవే కాదు, అంబేడ్కర్ నేతృత్వంలో రచింపబడిన మన రాజ్యాంగం ఎవరికీ నియంతృత్వం, అపరిమిత స్వేచ్ఛ అధికారాలు లేకుండా బోలెడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేసినది…
……… ఇదే కదా మనం ఇన్నాళ్లూ చదువుకుంది… అమలులో ఉన్నదీ ఇదే కదా… కానీ సుప్రీంకోర్టు కోర్టులు చట్టాలు చేయలేవనేది అపోహ అంటుందేమిటి..? ఆ అపోహను తొలగిస్తున్నామని అంటున్నదేమిటి…? ఏదేని అంశంపై చట్టాలు లేనప్పుేడు కోర్టులు ఇచ్చే తీర్పులకే శాసనాధికారాలు ఉంటాయనే కొత్త నిర్వచనం ఇస్తున్నదేమిటి..? ఫలానా విషయంలో స్పష్టత లేదు, చట్టం చేయండి అని సూచించవచ్చు గానీ, మేం ఇచ్చే తీర్పే శాసనం అంటున్నదేమిటి..?
దురదృష్టం కొద్దీ సుప్రీం తీర్పులపై మన నాగరిక సమాజం నిర్మాణాత్మక పద్ధతిలో చర్చించడం లేదు… ఓ సమీక్ష, ఓ విశ్లేషణ అనేదే ఉండటం లేదు… ఇవన్నీ చాలా కీలకవిషయాలు… నేషనల్ జుడిషియల్ కమిషన్ చట్టాన్ని పక్కన పెట్టేసింది సుప్రీం కోర్టు… మా కొలీజియం మా ఇష్టం ఉంటుంది… ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో మాత్రం తమ జోక్యం ఉండాలట… చట్టాలు లేకపోతే తన తీర్పులే చట్టాలతో సమానమట… చిత్రం ఏమిటంటే..? దేశాన్ని దశాబ్దాల తరబడీ పాలించిన కాంగ్రెస్ స్పందన దాన్ని స్వాగతించే తీరులో ఉండటం..!
Ads
ఈ పరిణామాలపై ప్రధాని మోడీ మాట్లాడటం లేదు సరే… బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉంది… దాని స్పందన ఏమిటి..? సుప్రీంకోర్టు సుప్రిమసీని అంగీకరిస్తున్నదా..? రాజ్యాంగాన్నే మార్చాలంటున్న బీఆర్ఎస్ మాట్లాడదేమిటి..? ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి ఓ కమిటీ వేసింది… నువ్వు చట్టం చేసేదాకా ఈ కమిటీయే నియామక బాధ్యతను చూస్తుంది అంటోంది… సరే, దాన్నలా పెట్టేస్తే… హిండెన్‌బర్గ్-ఆదానీ వ్యవహారంపై ఓ కమిటీ వేసింది… అందులో ఎవరున్నారో ఓసారి శీలసమీక్ష చేసిందా..? లేదు..!
Share this Article