విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ… అలియాస్ విరుష్క… ఫ్యాన్స్ ఇద్దరినీ కలిపి పిలుచుకునే పేరు… పాప పుట్టింది… ఈ వార్త రాయని మీడియా, సైట్లు, టీవీలు, ట్యూబ్ చానెళ్లు లేవు… హహహ… రకరకాల ఫేక్ ఫోటోలు కూడా అప్పుడే దర్శనమిచ్చాయి… సరే, ఆ ఫోటోల రియాలిటీ ఏమిటనేది పక్కన పెడితే… చర్చ ఇప్పుడు ఆ పాపకు పెట్టబోయే పేరు మీదకు మళ్లింది… బోలెడన్ని డిబేట్లు, సూచనలు… అదో ఆనందం… కొందరు విరుష్క అనే పేరే ఖాయం చేయమని చెబితే… మరికొందరు రకరకాల పేర్లను సజెస్ట్ చేస్తూనే ఉన్నారు… తమ ఇంట్లోనే ఓ పాప పుట్టి, ఓ పేరు గురించి మథనం చేస్తున్నంతగా సంబరం… అందరికీ ప్రీతిపాత్రుడైన క్రికెటర్, అందమైన హీరోయిన్… ఆ సంబరాన్ని తప్పుపట్టలేం గానీ… మరీ పాప పేరు ఏం పుట్టాలో కూడా ఆ దంపతులకు వదిలిపెట్టేట్టుగా లేరు ఫ్యాన్స్…
బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమో, కాదో వదిలేస్తే… పురివి, అన్వి, అన్విత, వినుష్క, ఇరష్క వంటి సోషల్ సజెస్టెడ్ పేర్లలో నిజంగానే వాళ్లు పాపకు ఏం పేరు పెడతారు అనేదీ వదిలేస్తే… ఈ పేర్ల ట్రెండ్ అనేది మళ్లీ ఓ చర్చనీయాంశం… ఇటీవల వ్యాపార సంస్థలకు పెడుతున్న కొత్త తరహా పేర్ల గురించి మనం నిన్న చెప్పుకున్నాం కదా… అదీ ఈ లింకు…
Ads
ఊకో కాక… చిచ్చా ఏక్ పెగ్… విస్తరాకు… అత్తా వచ్చిపో… ఇదే ట్రెండ్..!!
మన తెలుగులోనూ ఇది చాలారోజులుగా ఉన్నదే… రకరకాల పేర్లను పెట్టేయడం… ప్రత్యేకించి టీవీల్లో… ప్రదీప్-హారిక కలిపి ప్రదీక… సుధీర్-రష్మి కలిపి రధీర్… అరియానా- అవినాష్ కలిపి అవియానా… అభిజిత్-హారిక కలిపి అభిక… అఖిల్- మోనాల్ కలిపి మోఖిల్… ఇమాన్యుయేల్- వర్ష కలిపి ఇమ్మార్ష… ఇలాగన్నమాట…
సమంత-చైతన్య కలిపి చైసామ్ అనే పేరు చాలారోజులుగా పాపులరే… అర్జున్-స్నేహ పేరు కలిసి వచ్చేలా తమ బిడ్డ పేరును అర్హ అని పెట్టుకున్నారు కదా… అదీ ట్రెండ్ ఫాలో కావడం అంటే..! ఓ వార్త చూసి మతిపోయినంత పనైంది… అభిక, నోభిక, నోభికస్యతో కలిసి యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూ చేస్తాడనేది వార్త… కాసేపు బుర్ర చించుకుంటే అర్థమైంది ఏమిటంటే..? అభిక అంటే అభిక-హారిక… నోభిక అంటే నోయెల్- అభిజిత్- హారిక… నోభికస్య అంటే నోయెల్- అభిజిత్- హారిక- లాస్య అట… వామ్మో… ఇది మరీ అతి…
అన్నట్టు పేర్లు అంటే టీవీల్లో బంధుత్వాల సంభోదన ఒకటి మరీ విచిత్రం… జీటీవీలో ప్రేమఎంతమధురం అనే ఓ సీరియల్ వస్తుంది… అందులో మాన్సి అనే ఓ తలతిక్క పాత్ర… (పోషించేది జబర్దస్త్లో ఈమధ్య కనిపిస్తున్న వర్ష…) ఈ పాత్ర అత్తను మామిన్లా, బావను బ్రోఇన్లా అని పిలుస్తూ ఉంటుంది… ఇదో పైత్యం అన్నమాట… గతంలో ఎన్టీయార్ ప్రభుత్వ పథకాలకు పెట్టే తెలుగు పేర్లపై మస్తు జోకులు పడేవి… మరీ బహిర్భూమి పథకం దాకా వెళ్లిపోయింది ఆయన గారి తెలుగు ప్రతాపం… చంద్రబాబు ఆదరణ, తోఫా వంటి పేర్లను పెట్టగా… జగన్ చేదోడు, గోరుముద్ద వంటి పేర్లు పెడుతున్నాడు… సో, రాబోయే రోజుల్లో సినిమా, టీవీ సీరియళ్ల పేర్లకూ ఈ కొత్త ట్రెండ్ పాటిస్తే… చిత్రవిచిత్రమైన పేర్లను ఇంకా చదవాల్సి రావొచ్చు… గుండె రాయి చేసుకొండి…!!
Share this Article