Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉమ్మడి కుటుంబానికే తెలుగు ప్రేక్షకుడు జై… సినిమాల్లో మాత్రమే…

March 5, 2023 by M S R

Bharadwaja Rangavajhala…………    ఓ టైమ్ లో తెలుగు సినిమా కుటుంబాల మీద దృష్టి సారించింది. ఉమ్మడి కుటుంబం అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ఆదర్శ కుటుంబం అని ప్రత్యగాత్మ తీశారు. ప్రత్యగాత్మ కమ్యునిస్టు కదా … ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా భావించి … చాలా సీరియస్ గా వేరింటి కాపురాలే బెటరు అంటూ .. ఎప్పుడేనా ఓ కామన్ సెలవు రోజున అలా వచ్చేసి అందరూ కల్సి ఉండి .. రేత్రికి తుండూ తుపాకీ సర్దుకుని పోవచ్చనేది కాన్సెప్టు…

 

ఇక కె.ఎస్ ప్రకాశరావు విచిత్ర కుటుంబం అంటూ కొన్ని విన్యాసాలు చేశారు. ఇంకా ఆ కుటుంబం, ఈ కుటుంబం ఇలా చాలానే కుటుంబాలొచ్చాయి… ఏ కుటుంబం వచ్చినా ఉమ్మడి కుటుంబానికే మనోళ్లు ఓటేశారు… ప్రభాకరరెడ్డిగారు పండంటి కాపురం సినిమా ప్రారంభిస్తూ కృష్ణను భాగస్వామిగా కలవమన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ సలహా అడిగారు.

Ads

ఎన్టీఆర్ లైన్ విని ఉమ్మడి కుటుంబ ఔన్నత్యాన్ని చెప్పే కథలు మనోళ్లు ఎప్పుడు తీసినా చూస్తారు … అని చెప్తూ ఓ అద్భుమైన మాట అన్నారుట… ప్రభాకర రెడ్డి గారు రాసి పుణ్యం కట్టుకున్నారు కనుక మనకి తెల్సింది… ఎన్టీఆర్ డైలాగ్ :

‘‘ఒకటి బ్రదర్, మన జీవితాల్లో ఉన్న డొల్లతనం సిన్మాగా చూపిస్తే బాధ వేస్తుంది… మనం అలా బతక్కపోయినా, అలా బతకాలి అనే కోరిక లోపల ఉంటుంది.. వాళ్ళు బతకాలి అనుకుని బతకలేక పోతున్న బతుకు సిన్మాలో చూపిస్తే మళ్ళీ మళ్ళీ చూసి గొప్ప విలువలు ప్రతిపాదించారు మీరు అని పొగుడుతారు. ఇది ప్రజల వీక్నెస్ అనుకో ఏమైనా అనుకో… జనం ఉమ్మడి కుటుంబ కథలు చూస్తారు… అది పాడి ఆవు లాంటి సబ్జెక్ట్… అయితే డొల్ల తనం చూపించడం కళాకారులుగా మన బాధ్యత… అందుకే మేం తోడు దొంగలు లాంటి సిన్మా తీసాం… బాధ్యతగా తీసిన ఆ సిన్మా జనం చూడలేదు… అది పక్కన పెడితే…. ఈ పండంటి కాపురానికి డబ్బులు పెట్టు ఏం పర్లేదు’’
anr

ఈ  సలహా చెప్పడంతో కృష్ణ దిగాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఆ సినిమా శతదినోత్సవానికి ఎన్టీఆర్ నే ఛీఫ్ గెస్ట్ గా పిల్చారు. ఆ తర్వాత కూడా విజయబాపినీడు కూడా బొమ్మరిల్లు నుంచీ గ్యాంగ్ లీడర్ వరకు ఉమ్మడి కుటుంబాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ విజయాలు అందుకుంటూ కొనసాగారు. నాకు అర్ధం కానిదేమంటే … వేరింటి కాపురాలు అరవై ఐదు నాటికే ఊపందుకున్నప్పటికిన్నీ మనోళ్లు ఎందుకు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబకథలకు జై కొడతారు అని … అంటే డ్యూయల్ కారక్టరనేగా అర్ధం …

అంచేత ప్రేక్షకులు పరమ– అని అర్దమైంది కదా … ఎన్టీఆర్ ఆరోజుల్లో రెడ్డి గారికి కృష్ణ గారికి చెప్పింది కూడా ఇదే… అదీ సంగతి … పైన ఇచ్చిన ఫుటోలు … ఒకటి ఆదర్శకుటుంబమే బెటరంటున్న అక్కినేని … ఆ రోజులు పోయాయి నాగేస్పర్రావా … ఇప్పుడన్నీ విచిత్రకుటుంబాలే అంటున్న సావిత్రి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions