Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్… పెంచి పోషించిన టెర్రరిస్టులను తనే ఖతం చేస్తున్న ఐఎస్ఐ…

March 5, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ………… గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టులు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు !

1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక పరిస్థితి బాగాలేదు కాబట్టి, RAW పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పాకిస్థాన్ లోని కిరాయి హంతకులని ఉపయోగించుకుంటున్నది !

2. TTP [తెహ్రిక్ తాలిబన్ ఆఫ్ పాకిస్థాన్ ] కి చెందిన వాళ్ళు ఈ హత్యలు చేస్తున్నారు. ప్రస్తుతం పాక్ ఆర్మీ దగ్గర ఉన్న అధునాతన స్నేపర్ రైఫిల్స్ TTP దగ్గర కూడా ఉన్నాయి. అందుకే హంతకులు ఎవరో కనిపెట్టలేకపోతున్నారు అని.

Ads

*****************

పై రెండింటిలో RAW మీదనే ఎక్కువ శాతం మంది ప్రజలు మరియు మీడియా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ! సహజంగా భారత్ మీద అనుమానం రావడం సహజం ! కొంతమంది అత్యుత్సాహంతో RAW విజయవంతంగా పాకిస్థాన్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు ! ఈ వరుస హత్యల నేపధ్యంలో చివరికి తాలిబన్లు కూడా పాకిస్థాన్ కి ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరికలు చేశారు ! అంటే ఆ హత్యలు మేమే చేస్తున్నాము అని క్లెయిమ్ చేసుకుంటున్నారు తాలిబన్లు !

***********

అసలు నిజం ఏమిటో సిఐఏ లీక్ చేసింది ! హత్యలు చేయిస్తున్నది కాదు చేస్తున్నది పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI…. IMF పాకిస్థాన్ కి బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వడానికి ఒప్పుకున్నా చాలా షరతులు విధించింది ! వాటిని పూర్తి చేస్తేనే అప్పు ఇస్తానని మెలిక పెట్టింది. IMF పెట్టిన షరతులలో ప్రధానమయినది :…. పాకిస్థాన్ ఆర్మీ ప్రస్తుత జనరల్స్ మరియు ఇటీవల కాలంలో పదవీ విరమణ చేసిన జనరల్స్ ఆస్తుల వివరాలు వెల్లడించాలి ! ఇలా చేస్తే పాక్ ప్రజల నుండి ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవుతుంది అని IMF వ్యూహం ! ఇందులో నిజం ఉంది ! పాక్ ఆర్మీ జనరల్స్ ఆస్తుల వివరాలు బహిర్గతం చేస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటపడతాయి !

**************

దశాబ్దాలుగా పాకిస్థాన్ సైన్యంలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులు ఎవరూ కూడా రిటైర్ అయిన తరువాత పాకిస్థాన్ లో ఉండడం లేదు ఎందుకని ? రిటైర్ అయ్యేవరకు సంపాయించుకోవడం రిటైర్ అయిపోయిన తరువాత పాకిస్థాన్లోని ఆస్తులని అమ్మేసుకొని బ్రిటన్, సౌదీ, UAE లలో స్థిరపడిపోతున్నారు ! ఇటీవలి కాలంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మీరు వేరే దేశాలకి ఎందుకు వెళుతున్నారు, మా దేశంలో ఆస్థులు కొనుక్కొని టర్కీ లోనే స్థిరపడిపోవచ్చుగా అంటూ ఆశ పెట్టేసరికి, రూటు మార్చి, టర్కీలో ఆస్థులు కొంటున్నారు ప్రస్తుత జనరల్స్ ! ఇక వేరే దేశాలకి వలస వెళ్ళ లేని రిటైర్డ్ ఆర్మీ అధికారులు పాకిస్థాన్ లోనే ఉండిపోయి ఏదో ఒక ప్రభుత్వ శాఖకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా ఉండి తమ ఆస్తులని కాపాడుకుంటున్నారు ! ప్రభుత్వం నుండి ఉచితంగా బంగ్లాతో పాటు ఇతర సౌకర్యాలు కూడా అనుభవించవచ్చు వృద్ధాప్యం మీద పడినా కూడా !

***********************

ఇటీవలే FATF మళ్ళీ హెచ్చరించింది పాకిస్థాన్ ని గ్రే లిస్ట్ లో పెడతాను అంటూ ! FATF కనుక పాకిస్థాన్ ని మళ్ళీ గ్రే లిస్ట్ లో పెడితే అది IMF నుండి అప్పు తీసుకోవడానికి వీలు పడదు ! ప్రస్తుతానికి IMF మరియు FATF ల దృష్టి మరల్చడానికి ISI ఇక పనికి రారు లేదా వృద్ధులు అయిపోయిన కొంత మంది టెర్రరిస్టులని ఎంపిక చేసుకొని, తన షార్ప్ షూటర్స్ ద్వారా వారానికి ఒక్కొక్కరిని హత్య చేయిస్తున్నది ! మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంని హత్య చేయించవచ్చు ISI త్వరలో ! ఎందుకంటే దావూద్ కి సంబంధించి వేల కోట్ల రూపాయాలు దుబాయి, సౌదీ, లండన్ లతో పాటు ముంబైలో కూడా ఉన్నాయి. ముంబైలో ఉన్న ఆస్థులు ఎటూ పాక్ ఆర్మీకి దక్కే ఛాన్స్ లేదు కానీ లండన్, దుబాయి, సౌదీలలోని ఆస్తులని స్వాధీనం చేసుకోవచ్చు.

****************

కాబట్టి దావూద్ ఇబ్రహీంతో పాటు ముంబై టెర్రర్ ఎటాక్ సూత్రధారి మసూద్ అజహర్ ని కూడా మట్టు పెడుతుంది ఐఎస్ఐ త్వరలో. ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న వరుస హత్యలు కేవలం కర్టెన్ రైజర్ మాత్రమే ! త్వరలో మనం దావూద్, మసూద్ అజహర్ హత్యల గురించి వినబోతున్నాము! నిజానికి ఐఎస్ఐ అంత పని చేస్తుందా అనే సందేహం రావొచ్చు చాలామందికి ! కానీ తప్పదు. డాలర్లు లేకుండా ఏ పనీ కాదు పాకిస్థాన్ కి ! అవి రావాలంటే ఐఎంఎఫ్ నుండి అప్పు రావాలి ! లేకపోతే తమ సైనిక జనరల్స్ ఆస్తుల మీద సిఐఏ కాన్సంట్రేట్ చేసింది కాబట్టి వదలదు !

**********************

ఇప్పటి వరకు జరిగిన హత్యల విధానం ఏమిటంటే… మోటార్ బైక్ ల మీద ముసుగులు ధరించిన వాళ్ళు వేగంగా వచ్చి ఘాట్ చేసి, అంతే వేగంగా బైక్ మీద పారిపోయారు! ఇలాంటి ఆపరేషన్స్ చేయగలిగేది ఐఎస్ఐ మాత్రమే ! పాకిస్థాన్ లో ఏ హత్య జరిగినా దానిని RAW అకౌంటులో వేస్తుంది ఐఎస్ఐ. ప్రజలు కూడా నిజమే అని నమ్మేస్తారు ! అల్ జవహరిని సిఐఏకి అప్పచెప్పిన పాక్ ఆర్మీకి తాలిబాన్ మరియు TTP ల నుండి ముప్పు ఉంటుంది అని తెలిసీ రిస్క్ తీసుకుంది. అలాంటిది దావూద్, మసూద్ అజహర్ లని మట్టుపెట్టి ఆ నెపం RAW మీద వేయడం పెద్ద పనేమీకాదు కదా ? అంచేత సోషల్ మీడియాలో అజిత్ దోవల్ పేరుని, RAW పేరుని వాడకండి తెలిసీ తెలియకుండా !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions