ఆంధ్రజ్యోతి ఫ్యామిలీ పేజ్ నవ్యలో కాస్త క్వాలిటీ కంటెంట్ ఉంటుందని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు… ఆదివారం గీతామాధురి ఇంటర్వ్యూ ఎందుకు వేశారో, అది సండే స్పెషల్ ఎలా అయ్యిందో ఆ ఎడిటర్‌కు, ఓనర్‌కే తెలియాలి… నో డౌట్, అనేకమంది తెలుగు ఫిమేల్ సింగర్స్‌లో గీతామాధురి టాప్ టెన్ లేదా టాప్ ఫిఫ్టీన్‌లో ఉంటుంది… కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఎందుకయ్యా, సందర్భం ఏమిటయ్యా అంటే… ఆమె ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షోలో జడ్జిగా ఎంపికైందట…
నవ్వు చేటు అంటారు దీన్నే… రోజూ అనేక షోలు వస్తుంటాయి టీవీల్లో… బోలెడు మంది జడ్జిలుగా వ్యవహరిస్తుంటారు… అందులో గొప్పతనం ఏముంది..? పెద్ద అచీవ్‌మెంట్ ఏముంది అందులో..? ఒక నిత్యా మేనన్‌ను తీసేశారు, ఒక గీతా మాధురిని పెట్టారు… అంతేగా తేడా… సేమ్, అలాంటి షో ఈటీవీలో పాడుతాతీయగా లో సునీత జడ్జి… జీసరిగమప లో ఎస్పీ శైలజ జడ్జి… అసలు జడ్జిగా ఉండటానికి పెద్ద అర్హతలు అక్కర్లేదు…
తమన్, కార్తీక్ పక్కన కూర్చోవడానికి భయమేసింది వంటి హిపోక్రటిక్ మాటలు యథాతథంగా అచ్చేశారు పత్రికలో… నవ్వొచ్చేలా…! గీతామాధురి వాయిస్ అన్ని జానర్ల పాటలకు సూటవుతుందా అనేది పెద్ద చర్చే… బిగ్‌బాస్‌లోకి వెళ్లాక మరో కో కంటెస్టెంటుతో కలిపి, ఎవడో హౌజు వీడిపోతుంటే తెగని శోకాలు పెట్టి, తన ఇమేజీని ఖరాబ్ చేసుకుంది… తరువాత లావైంది… ఈమధ్య పాటలూ తక్కువే…
Ads
ఇండియన్ ఐడల్‌లో కూడా ఓ బొమ్మలా కూర్చోవడం, కిట్టీ పార్టీలా ఫీల్ కావడమే… అంతేతప్ప ఏదైనా పాటలోని తప్పొప్పులను విశ్లేషించే సోయి కూడా లేదామెకు… జడ్జిగా ఉండటం గొప్పదనమెలా అవుతుంది..? సరిగమప షోలో అనంత శ్రీరాం తన లుక్కు మార్చుకుని ఓవరాక్షన్ చేస్తున్నాడు… పిచ్చి పిచ్చి స్టెప్పులు వేసి, హుందాతనాన్ని కోల్పోయి, లాఫింగ్ స్టాక్ అయిపోయాడు అందరికీ… చివరకు షోకు వచ్చిన సింగర్ స్మిత తనను చూసి, ఏమిటీ లుక్కు, ఎవరికైనా చూపించకపోయారా అని కామెంట్ చేసింది… తను కూడా జడ్జి…!! ఇక జడ్జితనానికి విలువేముంది గీతమ్మా…!
అసలు ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే సెకండ్ సీజన్ ఇండియన్ ఐడల్ బాగా నాసిరకంగా ఉంది… రెండు ఎపిసోడ్లు చూస్తే చికాకుగానే ఉంది… అన్నీ మొహమాటపు కేసులు… షోలో డ్రమ్మర్ తమ్ముడు, తబలా ప్లేయర్ కొడుకు అని ఓ కంటెస్టెంటుకు కార్డు ఇచ్చేశారు… ఇంకెవరినో పోయిన సీజన్‌లో సెలెక్ట్ చేస్తాము అన్నారట, చేయలేదట, ఈసారి పిలిచి, చక్రవాక రాగం ఆలపింపజేసి ఏకంగా గోల్డెన్ మైక్ ఇచ్చేశారు…
ఒకాయన సగం కూడా పాడలేదు, దగ్గరకు రమ్మని కార్డు ఇచ్చారు… ఓ తెలంగాణ గాయనిని బయటికి పంపించి, అరగంట టైమిచ్చి, ఓ నేటివ్ సాంగ్ ప్రిపేరై రమ్మన్నారు… దాదాపు అన్నీ ఇలాగే తప్ప స్ట్రెయిట్‌గా మెరిట్ చూసి, విశ్లేషించి ఎంపికలు చేయడం లేదు… గత సీజన్‌లో పూర్తి భిన్నం… ఒక వైష్ణవి, ఒక వాగ్దేవి, ఒక రేణుకుమార్, ఒక ధరమ్‌శెట్టి, ఒక జయంత్ ఎట్సెట్రా ప్రోగ్రామ్‌ను ఇరగేశారు… ఒకతనికి గీతామాధురి 500 అడ్వాన్స్ ఇచ్చి, 30 పాటలు నేర్చుకో, ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి పాడాలని ఆఫర్ ఇచ్చింది… ఈమే సొంతంగా కచేరీలు ఆర్గనైజ్ చేస్తోందా..?
మరొకామె ఆల్ రెడీ సినిమాల్లో పాడుతోంది… (సౌజన్య..?) ఆమెకు కార్డు ఇచ్చేశారు… ఇవన్నీ ఎలా ఉన్నా, కామెడీ కోసం… కొందరు స్క్రిప్టెడ్ కంటెస్టెంట్ల వేషాలు కూడా బాగాలేవు… ఒకడు నేను సైకిల్ మీద గీతామాధురిని తిప్పాలి అని వేదిక మీదకు సైకిల్ తెచ్చేస్తాడు… వెనుక ఎక్కితే చాలా, నడుం మీద చేయి వేయాలనే కోరిక ఏమైనా ఉందా అంటూ తమన్ ఓ ఎదవ జోక్ వేస్తాడు… రెండు రోజులు లాంచింగ్ ఆడిషన్స్‌లో ఒక్కటంటే ఒక్కటీ నచ్చేట్టు లేదు… ఈ గొప్పతనానికేనా ఈ ప్రత్యేక సండే ఇంటర్వ్యూ..? ఫాఫం, ఆంధ్రజ్యోతి కూడా ఇలా ఇండియన్ ఐడల్ షోలాగా నాసిరకాన్ని అద్దుకుంటే ఎలా..?! ఇంతచెప్పుకున్నాం కదా… స్టిల్… జీసరిగమప కన్నా ఇండియన్ ఐడల్ వంద రెట్లు మేలు..!!
Share this Article