Sankar G…….. శకుంతల…. పౌరాణిక చిత్రాలకు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నకాలంలోనే, అగ్ర స్థాయి నటుడుగా ఎన్టీఆర్ వెలుగొందుతున్న రోజుల్లో.., అప్పటి డ్రీమ్ గర్ల్ బి. సరోజను హీరోయిన్ గా పెట్టారు, ఘంటసాల సంగీతం, పాటలు అందించారు, నర్తనశాల లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రాజ్యం ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మించారు.., అయితేనేం, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ధడేల్ మని బాల్చి తన్నేసింది. ఆ తరువాత మళ్ళీ ఎవరూ ఈ శకుంతల చిత్రం జోలికి వెళ్ళలేదు… (దాసరి మాత్రం విశ్వామిత్ర పేరిట ఒక టెలిసీరియల్ నిర్మించినట్టు గుర్తు)…
మళ్ళీ ఇన్నేళ్లకు ఫామ్ లో లేని గుణశేఖర్ ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. గుణశేఖర్ కు ఈ భారీ చిత్రాల పిచ్చి ఏమిటో అర్ధం కాదు. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ పౌరాణికాన్ని ఎవరు చూస్తారు. ఈ వెటరన్, ఔట్ డేటెడ్ దర్శకుడి శకుంతల ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుందంటే… శకుంతల పేరు చెప్పి ఎక్స్పోజింగ్ చేయించటం, సహజత్వానికి దూరంగా మరియు కథ పట్ల అవగాహన లేకుండా ఒక పేషెంట్ యొక్క నీరస ముఖాన్ని కరుణరసంలాగా చూపించాలి అనుకోవడం చికాకు వ్యవహారమే…
శకుంతలకి ప్లాస్టిక్ పూలు, శాటిన్ చీరలు వాడటం, ఋషుల ఆహార్యం పట్ల – పర్ణశాల వగైరా ప్రాపర్టీస్ పట్ల, అవగాహన లేకపోవడం మరియు అశ్రద్ధ స్పష్టంగా కనిపించటం, అప్పటి భాష విషయంలో అజ్ఞానం, కథ పైన పట్టులేకపోవడం, ముక్కు మొఖం తెలియని వాడిని హీరోగా పెట్టి హిందీ సీరియల్ లాంటి సినిమా తీయడం, ఆమీర్పేట్ గ్రాఫిక్స్ వాడటం వంటివి విమర్శలకు గురి అయ్యాయి..,
Ads
అవన్నీ సరిదిద్ది మళ్లీ కొన్ని భాగాలు చిత్రీకరణ చేయాలి అంటే స్క్రిప్టు మార్చాలి మరియు reshoot చేయాలి , సెట్టింగ్స్, ప్రాపర్టీస్, vfx మార్చాలి, అందరికీ డేట్స్ కుదరాలి, బడ్జెట్ పెంచాలి, దీనికి ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి. చిత్రీకరణ వెనుక – విడుదల వెనక, ఆర్థికంగానే కాదు గుణశేఖరుడికి ఇంకా చాలా తలపోట్లు ఉన్నాయ్. అవన్నీ దాటుకొని విడుదల చేసుకోలేక వాయిదా వేస్తున్నారు. ఎప్పుడూ కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించే దిల్ రాజు ఇందులో ఇన్ వాల్వ్ అవ్వటం ఆశ్చర్యమే…
Share this Article