పార్ధసారధి పోట్లూరి ……. సోమవారం 06-03-2023 ఉదయం 6 గంటల సమయం ! చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకు వెళ్ళాయి ! మొత్తం 10 వివిధ రకాలయిన చైనా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకు వెళ్ళాయి. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ పరిధిలోకి వచ్చిన విమానాలని తైవాన్ రక్షణ శాఖ తన రాడార్ల ద్వారా పసిగట్టింది.
1. మొత్తం పది జెట్ ఫైటర్స్ మరియు 4 నావీ వేసేల్స్ తైవాన్ ప్రాదేశిక జలాల్లోకి వచ్చినట్లు తైవాన్ ఒక ట్వీట్ లో తెలిపింది.
2. తైవాన్ కి చెందిన CAP [Combat Air Patrol] ఎయిర్ క్రాఫ్ట్ ఈ విషయాలని ధృవీకరించింది కూడా.
Ads
3. రెండు Y-8 ASW & BZK-005 UAV RECCC విమానాలని గుర్తించింది. ఈ రెండు కూడా చైనాకి చెందిన నిఘా విమానాలు.
4. Y-8 ASW అనేది చైనాకి చెందిన నిఘా విమానం కాగా రెండోది BZK-005 UAV RECCC అనేది లాంగ్ రేంజ్ నిఘా డ్రోన్ .
5. ఈ రెండూ తైవాన్ లోని సౌత్ వెస్ట్ ప్రాంతం అయిన ఆదిజ్ ప్రాంతం నుండి తైవాన్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించినట్లు తైవాన్ తెలిపింది.
6. అయితే తైవాన్ కి చెందిన జెట్ ఫైటర్స్ [F-16?] వెంటనే ఆకాశంలోకి వెళ్ళి చైనా విమాన పైలట్లతో రేడియో ద్వారా కాంటాక్ట్ చేసి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించగానే నిఘా విమానాలు వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది తైవాన్.
7. చైనా ఆర్మీకి చెందిన యుద్ధ టాంకులు రోడ్ల మీద వేగంగా వెళ్తున్న దృశ్యాలని తైవాన్ చూపెడుతూ, అవి చైనా సముద్ర తీరానికి వెళ్తున్నట్లుగా ఉన్నాయని, తైవాన్ భూభాగానికి ఎదురుగా మోహరించడానికే అవి వస్తున్నట్లుగా ప్రకటించింది.
8. చైనా జనవరి 24 న రెండు అమెరికన్ నావీ జెట్ ఫైటర్స్ సౌత్ చైనా సీ ఉపరితలం మీదుగా చైనాకి చెందిన ఎయిర్ స్పేస్ లో ఎగురుతూ కనిపించాయని వెంటనే తమ ఫైటర్ జెట్స్ వాటిని వెంబడించిన వీడియోలని విడుదల చేసింది నిన్న.
*********************************
సాధారణంగా ఏ దేశమన్నా దాడి చేయాలంటే రాత్రి రెండు నుండి నాలుగు గంటల మధ్య మొదలుపెడతాయి కానీ చైనా మాత్రం ఉదయం 6 గంటలకి తన నిఘా విమానాలని పంపింది. అయితే వాటికి తోడుగా అక్కడికి దగ్గరలోనే ఆకాశంలో J-11 ఫ్లాన్కర్స్ [Flankars] ని మొహారించింది ! ఇది దాడికి ముందస్తు సూచనగా తీసుకోవచ్చు. దాదాపుగా రెండేళ్ల నుండి చైనా తైవాన్ చుట్టూ తన యుద్ధ నౌకలని తరుచూ పంపిస్తూనే ఉన్నది కానీ దాడి చేయలేదు. బహుశా పులి రామయ్య కధలోలాగా చైనా ఇలానే చేస్తుంది అని ఉదాసీనంగా ఉన్నప్పుడు హఠాత్తుగా దాడి చేసే అవకాశం ఉంది.
*************************
ఎందుకింత హఠాత్తుగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది ?
రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం చివరి దశకి చేరుకుంది. 2022 ఫిబ్రవరి నుండి 2023 ఫ్రిబ్రవరి వరకు చూస్తే ఒక సంవత్సరం పాటు జరిగిన యుద్ధంలో రష్యా తాను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలని కాపాడుకోవడానికి కష్ట పడుతున్నది. మరో వైపు ఆయుధాలు తరిగిపోతున్నాయి.
ఉక్రెయిన్ ఇక చాలు అని అంటుందేమో అని పుతిన్ ఎదురుచూస్తున్నాడు. యుద్ధం ముగిస్తున్నట్లు పుతిన్ ప్రకటన చేస్తాడేమో అని జెలెన్స్కీ ఆశిస్తున్నాడు కానీ రెండిట్లో ఏదీ జరిగేట్లుగా కనపడట్లేదు.
రష్యాకి కనీసం ఆరు నెలల విరామం కావాలి ! యుద్ధ విరామం కోసం ఎవరు ముందుకు వస్తారు ? మొన్నటిదాక మోడీ మాత్రమే మధ్యవర్తిత్వం చేయగలరు అంటూ ప్రపంచ దేశాలు అంటూ వచ్చాయి. బహశా మోడీ ఈ విషయంలో కలుగచేసుకోకపోవచ్చు… పుతిన్ ఏదన్నా ప్రతిపాదన పంపే వరకు మోడీ కలుగచేసుకోకపోవచ్చు !
వారం క్రితమే అమెరికా చైనాని హెచ్చరించింది. రష్యాకి కనుక ఆయుధాలు సప్లై చేస్తే రష్యా మీద విధించినట్లే చైనా మీద కూడా పూర్తి స్థాయి ఆంక్షలు విధిస్తాము అంటూ… దీనర్ధం చైనా దగ్గర ఉన్న 2 ట్రిలియన్ డాలర్ల రిజర్వ్ ని స్థంబించి వేస్తుంది అన్నమాట ! రష్యాకి చెందిన 32 బిలియన్ డాలర్లని అమెరికా ఆపేసింది వాడుకోకుండా గత సంవత్సరమే ! దీనర్ధం ఏమిటంటే చైనా రష్యాకి ఆయుధాలు సప్లై చేయడానికి సిద్ధపడింది అని.
******************
చైనా మాత్రం అమెరికా మాటలని ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు ఎందుకని ? చైనా గ్లోబల్ సప్లై చైన్ కి కేంద్రం అవడమే ! చైనా మీద ఆంక్షలు విధిస్తే రాబోయే వేసవి కాలంలో యూరోపుతో పాటు అమెరికాకి కూడా ఎయిర్ కండిషనర్లు వాటి విడిభాగాలు దొరకవు! జర్మనీ అసలే కష్టాలలో ఉంది. అలాంటిది అమెరికా ఆంక్షలు విధిస్తే జర్మన్ ఆటోమొబైల్ పరిశ్రమ మూసేసుకోవాలి ! కాబట్టి ఆంక్షలు విధించడానికి జర్మనీ ఒప్పుకోదు!
ఇక బల్క్ డ్రగ్స్ విషయంలో అమెరికా అటు చైనాతో పాటు ఇటు భారత్ మీద కూడా ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా చైనా మీద ఆంక్షలు విధిస్తే భారత్ కూడా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సప్లై చేయలేదు యూరోపుతో పాటు అమెరికాకి కూడా ! భారత్ బల్క్ డ్రగ్ పరిశ్రమకి కావాల్సిన API [Active Pharma Ingridient ] 68% చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నది.
భారత్ లో API తయారు చేస్తే చైనా కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది… తద్వారా మన దేశం నుండి అమెరికా, యూరోపుకి ఎగుమతి అయ్యే మందుల ధరలు కనీసం 20% పెంచాల్సి ఉంటుంది! ఇలా చాలా అంశాలు ఉన్నాయి చైనా విషయంలో కాబట్టి చైనా అమెరికా బెదిరింపులని లెక్క చేయదు ! తైవాన్ విషయంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది మొదట అమెరికానే ! అటు ఉక్రెయిన్ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకొని వేలు కాల్చుకున్న నాటో దేశాలు ఇప్పుడు తైవాన్ విషయంలో మళ్ళీ ఆ తప్పు చేస్తాయా ? చూడాలి….
Share this Article